ఆయన ఓడిపోతారని తన రక్తంతో రాసిస్తానని మాజీ సీఎం చాలెంజ్, మా కులం ఓట్లు !

బెంగళూరు/హుబ్బళి: ఎమ్మెల్యే టిక్కెట్లు దక్కలేదని సొంత పార్టీకి రాజీనామా చేసి ప్రతిపక్ష పార్టీల్లో చేరిపోయిన నాయకుల కారణంగా బీజేపీ లేనిపోని తంటాలు పడుతోంది. మాజీ ముఖ్యమంత్రి ఎలాంటి పరిస్థితిలో ఎమ్మెల్యేగా గెలవలేరని, కావాలంటే తన రక్తంతో రాసిస్తానని, ఆయన ఓటమే మా లక్షం అని మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప చాలెంజ్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ రాష్ట్ర మాజీ సీఎం బీఎస్. యడియూరప్ప కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో పర్యటించి బీజేపీ తరుపున ప్రచారం చేస్తున్నారు. ఇదే సమయంలో ఆయా ప్రాంతాల్లోని లింగాయత్ కులం నాయకులతో బీఎస్ యడియూరప్ప వరుస సమావేశాలు నిర్వహించి బీజేపీ గెలుపు కోసం పని చేస్తున్నారు.

CM Jagdish Shetter to defeat in assembly elections

హుబ్బళిలో లింగాయత్ కులం నాయకులతో సుదీర్ఘంగా చర్చలు జరిపిన బీఎస్. యడియూరప్ప మాజీ సీఎం జగదీష్ శెట్టర్ ను అందరూ కలిసి ఓడించాలని మనవి చేశారని తెలిసింది. లింగాయత్ నాయకులతో సమావేశం పూర్తి అయిన తరువాత మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప మీడియాతో మాట్లాడారు.

మాజీ సీఎం జగదీష్ శెట్టర్ బీజేపీకి ద్రోహం చేసి అధికార దాహంతో కాంగ్రెస్ పార్టీలో చేరారని మాజీ సీఎం బీఎస్ మండిపడ్డారు. మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా బీజేపీలో అన్ని పదవులు అనుభవించిన జగదీష్ శెట్టర్ అధికార దాహంతో ఇంతకాలం ఆదరించిన పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపారని బీఎస్ యడియూరప్ప ఆరోపించారు.

హుబ్బళి-ధారవాడ సెంట్రల్ నియోజక వర్గంలోని లింగాయత్ సోదరులు అందరూ ఏకమై ఇంతకాలం ఆదరించిన బీజేపీకి ద్రోహం చేసి వెళ్లిపోయిన జగదీష్ శెట్టర్ ను ఓడించాలని, నమ్మకద్రోహం చేసిన ఆయనకు సరైన బుద్దిచెప్పాలని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప లింగాయత్ కులం నాయకులకు మనవి చేశారు.

మాజీ సీఎం జగదీష్ శెట్టర్ కాంగ్రెస్ టిక్కెట్ మీద ఎలాంటి పరిస్థితిలో విజయం సాధించలేరని నేను చాలెంజ్ చేస్తున్నా, శెట్టర్ ఓడిపోతారని నేను నా రక్తంతో రాసిస్తానని మాజీ సీఎం యడియూరప్ప అన్నారు. మాజీ సీఎం జగదీష్ శెట్టర్ ను ఓడించాలని బీజేపీ నాయకులు శక్తివంచనలేకుండా హుబ్బళిలోని లింగాయత్ కులం నాయకులతో, అక్కడి బీజేపీ కార్యకర్తలతో చర్చలు జరుపుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+