Cheating: స్యాంట్రో రవికి షాక్ ఇచ్చిన సీఎం, సీఐడీ ఎంట్రీ, తాజ్ మహల్ ఫోటో స్టేటస్ లో పెడితే, లాజిక్!

బెంగళూరు/మైసూరు: మనీలాండరింగ్, హైటెక్ వ్యభిచారం, భార్యపై వేధింపులు, అధికారులను బదిలీ చేస్తానని భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశాడని తదితర ఆరోపణలపై పోలీసు కస్టడీలో ఉన్న నిందితుడు స్యాంట్రో రవి అలియాస్ మంజునాథ్ కేసును కర్ణాటక ప్రభుత్వం సీఐడీకి అప్పగించడం హాట్ టాపిక్ అయ్యింది. స్యాంట్రో రవికి సంబంధించిన అన్నికేసుల విచారణ మొత్తం కర్ణాటక ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఈ నేపథ్యంలో స్యాంట్రో రవితో ఇంతకాలం సంబంధాలు పెట్టుకుని అతను చట్టానికి చిక్కకుండా చూసిన పోలీసు అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని తెలిసింది,

ఇక సైలెంట్ గా ఉండాలి

ఇక సైలెంట్ గా ఉండాలి

స్యాంట్రో రవి జ్యుడీషియల్ కస్టడీకి పంపించాలని మైసూరు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కేసు సీఐడీకి అప్పగించడంతో ఇక ముందు మైసూరులోని విజయనగర్ పోలీసులు దర్యాప్తు చేయ్యడానికి అవకాశంలేదు. విజయనగర పోలీసులు సీఐడీకి పూర్తి సమాచారం ఇచ్చి ఆ విభాగం అదికారుల విచారణకు సహకరించాల్సి ఉంది. ప్రస్తుతం మైసూరు కోర్టు స్యాంట్రో రవికి జ్యుడీషియల్ కస్టడీ విధించింది. సీఐడీ అధికారులు స్యాంట్రో రవిని కస్టడీలోకి తీసుకుని విచారణ చెయ్యడానికి సిద్దం అవుతున్నారు.

పోలీసులకు షాక్ ఇచ్చిన ప్రభుత్వం

పోలీసులకు షాక్ ఇచ్చిన ప్రభుత్వం

స్యాంట్రో రవిని ఏసీపీ శివశంకర్ ఇంతకాలం విచారించారని ఆ విషయాన్ని మైసూరు పోలీసులు కోర్టుకు తెలియజేశారు. తదుపరి విచారణ కోసం సీఐడీ అధికారులు స్యాంట్రో రవిని కస్టడీలోకి తీసుకోవాల్సి ఉంది. ఈ కారణంగా స్యాంట్రో రవిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. స్యాంట్రో రవితో పాటు అతడికి సంబంధించిన కేసు వివరాలు మొత్తం, దర్యాప్తు సమాచారాన్ని మైసూరు పోలీసులు సీఐడీ అధికారులకు అప్పగించనున్నారు.

 తాజ్ మహల్ ఫోటో స్టేటస్ లో పెడితే?

తాజ్ మహల్ ఫోటో స్టేటస్ లో పెడితే?

స్యాంట్రో రవి కేసును ప్రభుత్వం సీఓడీకి అప్పగించిందని అతని తరపు న్యాయవాది హరీష్ ప్రభు మీడియాకు చెప్పారు. కేసు సీఓడీకి అప్పగించకూడదని తాము హైకోర్టుకు వెళ్తామని స్యాంట్రో రవి న్యాయవాది అంటున్నారు. స్యాంట్రో రవి వాట్సాప్ స్టేటస్ ఆధారంగా ఏదైనా విచారణ చేయడం సాధ్యమేనా? ఇప్పుడు కుటుంబ కలహాలపైనే కేసు నమోదైంది. ఇతర కేసులు నమోదు కాలేదు. తాజ్ మహల్ ఫోటోను దేవుడి ఫోటోగా సెట్ చేసి దానిని స్టేటస్ పెట్టిన వ్యక్తికి ఆ తాజ్ మహల్ సొంతం అవుతందా, ఈ లాజిక్‌ను కూడా ప్రభుత్వం అర్థం చేసుకోకపోతే ఎలా అని స్యాంట్రో రవి కర్ణాటక ప్రభుత్వంలోని కొందరు పెద్దలను పరోక్షంగా ప్రశ్నించారు.

ఫ్యామిలీ మ్యాటర్ తో?

ఫ్యామిలీ మ్యాటర్ తో?

స్యాంట్రో రవి కేసులో సరైన ఆధారాలు లేవు. ఇది కుటుంబ కలహాలు మాత్రమే. మరో రెండు రోజుల్లో స్యాంట్రో రవికి బెయిల్ ఇవ్వాలని కోర్టుకు వెలుతామని అంటున్న సమయంలో కర్ణాటక ప్రభుత్వం కేసు సీఐడీకి ఎలా అప్పగించిందో తెలియడం లేదని స్యాంట్రో రవి తరపు న్యాయవాది హరీశ్ ప్రభు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. స్యాంట్రో రవికి జనవరి 26వ తేదీ వరకు జ్యూడీషియల్ కస్టడీ పొడిగించారు.

బెయిల్ తీసుకోవాలని?

బెయిల్ తీసుకోవాలని?

వీలైంత త్వరంగా బెయిల్ దరఖాస్తును దాఖలు చెయ్యడానికి స్యాంట్రో రవి న్యాయవాదులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. సాంట్రో రవి తరఫు న్యాయవాది హరీష్ ప్రభు మాట్లాడుతూ రవిపై అత్యాచారం, కుల దూషణ, మోసం వంటి అభియోగాలు ఉన్నాయని తెలిపారు. అధికారుల బదిలీతో సహా ఇతర ఆరోపణలు స్యాంట్రో రవి మీద వచ్చినట్లు ఎలాంటి ఆధారాలు లేవు. రవిని కూడా బెదిరించారని ఆయన న్యాయవాది ఆరోపించారు,

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+