Controversy: మీ ఇంట్లో ముస్లీంలకు పంది మాంసంతో వంటలు పెడుతావా హంసలేఖ ?, ఎంపీ ఫైర్!

బెంగళూరు/ మైసూరు: ప్రతి ఒక్కరూ ఆహారం ఆరగించే పద్దతులను ఒకే విదంగా పాటిస్తే సమాజంలో తారతమ్యాలు తొలగిపోతాయని ప్రముఖ సంగీత దర్శకుడు అన్నారు. దళితుడి ఇంటికి పేజావర్ స్వామీజీ వెళ్లిన సమయంలో ఆహారం సేవించే విషయంలో వెనుకా ముందు ఆలోచించారని, అందుకే ప్రతి ఒక్కరూ మాంసాహారం తీసుకుంటే ఇలాంటి సమస్యలు ఎదురుకావని ఆ సంగీత దర్శకుడు, గీత రచయిత అన్నారు. సంగీత దర్శకుడి వ్యాఖ్యలతో ప్రముఖ ఎంపీ మండిపడ్డారు.

మీరు చేస్తున్న ఉచిత హితభోద చాలా బాగుంది, ముందు మీ ఇంటికి ముస్లీం సోదరులను ఆహ్వానించి వారికి పంది మాంసంతో వంటలు చేసి పెట్టండి, వారు పంది మాంసం తింటారా ? తినరా ? అనే విషయం పక్కాగా తెలుసుకున్న తరువాత మీరు ప్రజలకు ఉచిత సలహాలు ఇవ్వండి అంటూ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆహారం ఆరగించే విషయంలో ప్రతిఒక్కరూ ఒకే విదంగా పాటిస్తే ముస్లీం సోదరులు కూడా పందిమాంసం తినాలి కదా ? అని ఆ ఎంపీ సంగీత దర్శకుడిని ప్రశ్నించారు. సన్యాసులు, స్వామీజీలు ఏమితినాలో, తినకూడాదో చెప్పడానికి నువ్వు ఎవరు ? అంటూ యువ ఎంపీ ప్రముఖ సంగీత దర్శకుడి మీద విరుచుకుపడటం కలకలం రేపింది.

అందరికోసమేనా

అందరికోసమేనా

దళితుడి ఇంటికి వెళ్లిన ఉడిపి పేజావర్ స్వామీజీ ప్రజల మధ్య ఉన్న తారతమ్యాలు తొలగించడానికి ప్రయత్నించారు. మాది ఎక్కువ కులం, మీది తక్కువ కులం అని సమాజంలో ఎవ్వరూ వేలు ఎత్తి చూపించకూడదని పేజావర్ స్వామీజీ అంటున్నారు. ప్రజలు అందరూ సమానమే అని చాటి చెప్పడానికి పేజావర్ స్వామీజీ ప్రయత్నించారని స్వామీజీ భక్తులు, అభిమానులు అంటున్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ ఏమన్నారంటే ?

మ్యూజిక్ డైరెక్టర్ ఏమన్నారంటే ?

ప్రతి ఒక్కరూ ఆహారం ఆరగించే పద్దతులను ఒకే విదంగా పాటిస్తే సమాజంలో తారతమ్యాలు తొలగిపోతాయని ప్రముఖ కన్నడ సంగీత దర్శకుడు, గీత రచయిత హంసలేఖ అన్నారు. గతంలో దళితుడి ఇంటికి పేజావర్ స్వామీజీ వెళ్లిన సమయంలో ఆహారం సేవించే విషయంలో వెనుకా ముందు ఆలోచించారని, దళితులు మాంసం తింటారనే పేజావర్ స్వామీజీ ఆలోచించారని సంగీత దర్శకుడు హంసలేఖ చెప్పారు.

అందరూ మాంసం తింటే సరిపోతుంది

అందరూ మాంసం తింటే సరిపోతుంది

అందుకే ప్రతి ఒక్కరూ మాంసాహారం తీసుకుంటే ఇలాంటి సమస్యలు ఎదురుకావని సంగీత దర్శకుడు హంసలేఖ అన్నారు. హంసలేఖ తెలుగులో కూడా ప్రమఖ హీరోల సినిమాలకు సంగీత దర్శకుడిగా పని చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు హంసలేఖ వ్యాఖ్యలతో పేజావర్ స్వామీజీ అభిమానులు, భక్తులు, హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.

ముస్లీంలకు పంది మాసం పెడుతావా?

ముస్లీంలకు పంది మాసం పెడుతావా?

సంగీత దర్శకుడు హంసలేఖ వ్యాఖ్యలతో ప్రముఖ బీజేపీ నాయకుడు, మైసూరు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ మండిపడ్డారు. మీరు ఇస్తున్న ఉచిత హితభోద చాలా బాగుంది, ముందు మీ ఇంటికి ముస్లీం సోదరులను ఆహ్వానించి వారికి పంది మాంసంతో వంటలు చేసి పెట్టండి, వారు పంది మాంసం తింటారా ? తినరా ? అనే విషయం పక్కాగా తెలుసుకున్న తరువాత మీరు ప్రజలకు ఉచిత సలహాలు ఇవ్వండి అంటూ మైసూరు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అందరూ పంది మాంసం తినాలి కదా?

అందరూ పంది మాంసం తినాలి కదా?

ఆహారం ఆరగించే విషయంలో ప్రతిఒక్కరూ ఒకే విదంగా పాటిస్తే ముస్లీం సోదరులు కూడా పందిమాంసం తినాలి కదా ? అని మైసూరు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ ప్రముఖ సంగీత దర్శకుడు హంసలేఖను ప్రశ్నించారు. సంగీత దర్శకుడిగా పని చెయ్యడానికి చేతిలో సినిమాలు లేకపోవడం, ప్రజలు కూడా పట్టించుకోవడం పూర్తిగా మానేయడంతో ఫ్రీ పబ్లిసిటీ కోసం హంసలేఖ ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేసి కాలం గడుపుతున్నారని మైసూరు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ మండిపడ్డారు.

పేజావర్ స్వామీజీ అందరూ స్వామీజీలు లాగా కాదు

పేజావర్ స్వామీజీ అందరూ స్వామీజీలు లాగా కాదు

సన్యాసులు, స్వామీజీలు ఏమితినాలో, తినకూడాదో చెప్పడానికి నువ్వు ఎవరు ? అంటూ యువ ఎంపీ ప్రముఖ సంగీత దర్శకుడి మీద విరుచుకుపడటం కలకలం రేపింది. స్వామీజీలు, సన్యాసులు పూర్తి శాఖా హారులు అని కనీసం తెలీదా, బుద్దిలేకుండా మాట్లాడటం మంచిపద్దతి కాదని బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా అన్నారు. దివంగత ఉడిపి పేజావర్ స్వామీజీ (పేజావర్ శ్రీ) అందరు స్వామీజీలు లాగా కాదని, ఆయనకు కోట్లాది మంది అభిమానులు, భక్తులు ఉన్నారని, స్వామీజీ గురించి తెలుసుకుని మాట్లాడటం మీకే మంచిదని ప్రముఖ సంగీత దర్శకుడు, గీత రచయిత హంసలేఖకు మైసూరు ఎంపీ ప్రతాప్ సింహ సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+