బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Night Curfew: కొత్త రకం కరోనా దెబ్బ, సీఎం ఆదేశాలు, నేటి నుంచి జారీ, న్యూఇయర్ ఎఫెక్ట్, గోవిందా గోవింద!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ బళ్లారి/ మైసూరు: భారతదేశంలో ఇప్పటికే కరోనా వైరస్ (COVID-19) దెబ్బ నుంచి ప్రజలు కోలుకోలేకపోతున్నారు. ఇలాంటి సందర్బంలో కొత్త తరహా కరోనా వైరస్ అంటూ ప్రచారం మొదలు కావడంతో ప్రజలు హడలిపోతున్నారు. కరోనా వైరస్ దెబ్బతో ఐటీ,బీటీ సంస్థల దేశ రాజధాని, సిలికాన్ సిటీ బెంగళూరు నగరంతో సహ కర్ణాటకలో నేటి నుంచి (డిసెంబర్ 23 బుధవారం) 2021 జనవరి 2వ తెదీ వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ఆదేశాలు జారీ చేశారు. నేటి రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు జనవరి 2వ తేదీ వరకు క్రమం తప్పకుండా నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుందని, ప్రజలు సహకరించాలని కర్ణాటక సీఎం బీఎస్ యడియూరప్ప మనవి చేశారు.

BJP VS Congress: గ్రామ పంచాయితీ ఎన్నికలు, నువ్వా ?, నేనా ?, 1, 17, 383 మంది పోటీ, దేవుడా?BJP VS Congress: గ్రామ పంచాయితీ ఎన్నికలు, నువ్వా ?, నేనా ?, 1, 17, 383 మంది పోటీ, దేవుడా?

సీఎం అత్యవసర సమావేశం

సీఎం అత్యవసర సమావేశం

బుధవారం బెంగళూరులో కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ఆధ్వర్యంలో కోవిడ్ కేర్ నియంత్రణ మండలి శాఖ అధికారులు, ఆరోగ్య శాఖ అధికారులు అత్యవసర సమావేశంలో పాల్గొన్నారు. ఇదే సమయంలో బెంగళూరు సిటీతో పాటు కర్ణాటకలో కరోనా వైరస్ వ్యాధిని ఎలా నియంత్రణ చెయ్యాలి అంటూ సీఎం బీఎస్. యడియూరప్ప అధికారులతో చర్చించారు.

కొత్త రకం కరోనా వైరస్?

కొత్త రకం కరోనా వైరస్?

భారతదేశంలో ఇప్పటికే ప్రజల్లో కొత్త తరహా కరోనా వైరస్ గురించి ఆందోళన మొదలైయ్యింది. ఇదే సమయంలో కొత్త తరహా కరోనా వైరస్ ను ఎలా అరికట్టాలి, ప్రజలకు ఉన్న భయం ఎలా పోగొట్టాలి ? అంటూ సీఎం బీఎస్, యడియూరప్ప అధికారులతో చర్చించారని తెలిసింది. కర్ణాటకలో కరోనా వైరస్ ను పూర్తిగా అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం. బీఎస్. యడియూరప్ప ఆదేశాలు జారీ చేశారు.

నేటి నుంచి నైట్ కర్ఫ్యూ జారీ

నేటి నుంచి నైట్ కర్ఫ్యూ జారీ

అధికారులతో సమావేశం పూర్తి అయిన తరువాత సీఎం బీఎస్. యడియూరప్ప బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ ను అరికట్టడంలో భాగంగా నేటి రాత్రి 10 గంటల నుంచి జనవరి 2వ తేదీ ఉదయం 6 గంటల వరకు ప్రతిరోజు బెంగళూరుతో సహ కర్ణాటక మొత్తం నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుందని, ప్రజలు అందరూ సహకరించాలని సీఎం బీఎస్. యడియూరప్ప ప్రజలకు మనవి చేశారు.

RT-PCR నియమాలు పాటించాలి

RT-PCR నియమాలు పాటించాలి

విదేశాల నుంచి బెంగళూరు సిటీతో పాటు కర్ణాటకలోకి వచ్చిన ప్రతిఒక్కరూ ఆర్ టీ-పీసీఆర్ పద్దతితో కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సీఎం బీఎస్. యడియూరప్ప సూచించారు. విదేశాల నుంచి వచ్చిన వారికి నెగటివ్ వచ్చినా 72 గంటల పాటు బయట తిరగరాదని, తరువాత వారికి మరోసారి ఆరోగ్య పరీక్షలు చేసిన తరువాత బయట తిరగడానికి అధికారులు అవకాశం ఇస్తారని చెప్పారు.

2021 న్యూ ఇయర్ ఎఫెక్ట్?

2021 న్యూ ఇయర్ ఎఫెక్ట్?

కరోనా వైరస్ ను పూర్తిగా కట్టడి చెయ్యడానికి కేంద్ర ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం శక్తి వంచన లేకుండా పని చేస్తోందని, ప్రజలు ఆందోళన చెందనవసరం లేదని సీఎం బీఎస్. యడియూరప్ప హామీ ఇచ్చారు. 2021 నూతన సంవత్సరం వేడుకల సందర్బంగా యువత విచ్చలివిడిగా రెచ్చిపోకుండా చెయ్యడానికి నేటి నుంచి నైట్ కర్ఫ్యూ జారీ చేశారని ఓ పక్క ప్రచారం జరుగుతోంది. ఏదిఏమైనా కత్త సంవత్సరం వేడుకల సందర్బంగా నైట్ కర్ఫ్యూతో కరోనాను కట్టడి చెయ్యడానికి అవకాశం ఉంటుందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

English summary
Coronavirus: Night Curfew imposed from today all over Karnataka from 10 PM to 6 AM for Nine days (02 January 2021).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X