బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Marriage: పూలహారాలు కాదు, మాస్క్ లతో హారాలు, చూడు నాయనా, జీవితంలో, వైరల్ మామ!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ మైసూరు: కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో గ్రాండ్ గా జరగాల్సిన వివాహాలు సింపుల్ గా జరిగిపోతున్నాయి. విద్యావంతులైన యువతి యువకుడు ముందుగా పెద్దలు నిర్ణయించిన ముహూర్తానికి సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం కరోనా కాలంలో ఏ విషయం హాట్ టాపిక్ అయ్యిందో అదే పద్దతిలో వెరైటీగా పెళ్లి చేసుకున్నారు. కరోనా కాలంలో ఈ కొత్త జంట చేసుకున్న వెరైటీ పెళ్లి ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. నవవధూవరుల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, పూలహారాలు పక్కన పెట్టి మాస్క్ లతో తయారు చేసిన హారాలు తెరమీదకు తెచ్చేశారు.

Illegal affair: కొబ్బరి తోటలో ఆంటీ లవ్ స్టోరీ, యజమానికి తెలిసిందని ?, ప్రియుడి స్కెచ్!Illegal affair: కొబ్బరి తోటలో ఆంటీ లవ్ స్టోరీ, యజమానికి తెలిసిందని ?, ప్రియుడి స్కెచ్!

ముందే పెళ్లి ఫిక్స్

ముందే పెళ్లి ఫిక్స్

కర్ణాటకలోని మైసూరు సిటీ కార్పోరేషన్ మాజీ కార్పోరేటర్ యమునా, అనంతనారాయణల కుమార్తె స్నేహ, మైసూరులోని పార్థసారథి, అండాళ్ దంపతుల కుమారుడు రాఘవేంద్రల వివాహం మే 3, 4వ తేదీలలో చెయ్యాలని కొన్ని నెలల ముందే ఇరు కుటంబాల పెద్దలు, బంధువులు నిర్ణయించారు.

కరోనా సెకండ్ వేవ్+ లాక్ డౌన్ ఎఫెక్ట్

కరోనా సెకండ్ వేవ్+ లాక్ డౌన్ ఎఫెక్ట్

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ తో ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. ఇదే సమయంలో గత వారం రోజుల నుంచి కర్ణాటకలో సంపూర్ణ లాక్ డౌన్ అమలులో ఉంది. ఈ సందర్బంలో స్నేహ, రాఘవేంద్రల పెళ్లి అనుకున్న ముహూర్తానికి జరిపించాలని పెద్దలు మళ్లీ మరోసారి స్ట్రాంగ్ గా మాట్లాడుకున్నారు.

వెరైటీగా ఉంటుందని ప్లాన్

వెరైటీగా ఉంటుందని ప్లాన్

ముందుగా నిర్ణయించిన మైసూరు నగరంలోని నజహర్ బాద్ లోని శ్రీ రాశీ శివశంకర్ రాజగోపాల్ కల్యాణ మండపంలోనే పెళ్లి సింపుల్ గా చెయ్యాలని డిసైడ్ అయ్యారు. పెళ్లికి పూలహారాల బదులుగా ఫేస్ మాస్క్ లతో ప్రత్యేకంగా తయారు చేసిన హారాలు వేసుకుని పెళ్లి చేసుకోవాలని పెళ్లి కొడుకు రాఘవేంద్ర, పెళ్లి కుమార్తె స్నేహా నిర్ణయించారు.

సింపుల్ గా పెళ్లి జరిగిపోయింది

సింపుల్ గా పెళ్లి జరిగిపోయింది

పెళ్లి ఎలా చేసుకున్నా మాకు అభ్యంతరం లేదని ఇరు కుటుంబ సభ్యుల పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. మాస్క్ లతో ప్రత్యేకంగా తయారు చేసిన హారాలు మార్చుకున్న స్నేహ, రాఘవేంద్ర కొత్త జీవితంలో అడుగుపెట్టారు. ప్రస్తుతం కరోనా వైరస్ తాండవం చేస్తున్న సమయంలో ముందుగా నిర్ణయించిన ముహూర్తానికి సింపుల్ గా పెళ్లి జరిపించామని, కరోనా వైరస్ మహమ్మారితో ప్రతిఒక్కరు జగ్రత్తగా ఉండాలని ఇలాంటి ఫేస్క్ మాస్క్ లతో హారాలు చేయించామని స్నేహ, రాఘవేంద్ర కుటుంబ సభ్యులు అంటున్నారు.

Recommended Video

Adar Poonawalla : నా తల తీసేస్తారు.. బెదిరింపుల వల్లే లండన్‌కు SII CEO Shocking Comments || Oneindia
 మామా..... పెళ్లి ఫోటోలు వైరల్

మామా..... పెళ్లి ఫోటోలు వైరల్

స్నేహా, రాఘవేంద్ర పెళ్లికి కేవలం ముఖ్యమైన సుమారు 30 మంది మాత్రమే హాజరైనారని, ప్రతి ఒక్కరూ భౌతికదూరం పాటిస్తూ ముఖాలకు మాస్క్ లు వేసుకుని పెళ్లికి హాజరైనారని అధికారులు అంటున్నారు. మొత్తం మీద స్నేహా, రాఘవేంద్రల ఫేస్ మాస్క్ హారాల పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

English summary
Coronavirus: The bride and groom have Exchanged of face Masks to spread awareness On Covid-19 at a simple wedding in Mysuru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X