బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

IT Hub: కరోనా పాజిటివ్, 3 వేల మంది ఎస్కేప్, కేటుగాళ్లు ఎక్కడున్నారు ?, కొంపలు ముంచేశారు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ చెన్నై: భారత దేశంలో కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కోవిడ్ సెకండ్ వేవ్ దెబ్బతో ముంబాయి, ఢిల్లీ నగరాలు కరోనా పాజిటివ్ కేసుల్లో ముందు వరుసలో ఉంటే వాటికి పోటీగా బెంగళూరు తయారైయ్యింది. బెంగళూరు నగరంలో కూడా కోవిడ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వచ్చేవారంలో లేదా రెండు వారాల్లో బెంగళూరులో కూడా అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోయే అవకాశం ఉందని, ముంబాయి, ఢిల్లీని బీట్ చేసే అవకాశం ఉందని రెండు వారాల క్రితమే నిపుణులు హెచ్చరించినా, కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తం అయినా పరిస్థితి మాత్రం చెయ్యిదాటిపోయింది. బెంగళూరులో ప్రతిరోజు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. బెంగళూరులో లాక్ డౌన్ అమలులో ఉన్నా పరిస్థితి మాత్రం అదుపులోకి రాలేదు. బెంగళూరు ఏకంగా 3, 000 మందికి పైగా కోవిడ్ పాజిటివ్ పేషంట్లు వారి మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని పరారైనారని ఆ రాష్ట్ర రెవిన్యూ శాఖా మంత్రి ఆర్. అశోక్ బాంబు పేల్చడంతో ప్రజలు హడలిపోతున్నారు.

Coronavirus: గర్భిణి డాక్టర్, ప్రజలకు కరోనా చికిత్స, డాక్టర్, బిడ్డ బలి, ఫ్యామిలీ మొత్తం పాజిటివ్ !Coronavirus: గర్భిణి డాక్టర్, ప్రజలకు కరోనా చికిత్స, డాక్టర్, బిడ్డ బలి, ఫ్యామిలీ మొత్తం పాజిటివ్ !

ఎంత చేసినా అదే ఫలితం

ఎంత చేసినా అదే ఫలితం

బెంగళూరులోని ఆసుపత్రులు అన్ని ఫుల్ అయిపోవడంతో కర్ణాటక ప్రభుత్వం బెంగళూరులోని కొన్ని హోటల్స్ ను కోవిడ్ చికిత్సా కేంద్రాలుగా మార్చింది. హోటల్స్ యాజమాన్యంతో చర్చలు జరిపిన బీబీఎంపీ అధికారులు పలు హోటల్స్ ను కోవిడ్ కేర్ సెంటర్లుగా మార్చేసింది. బెంగళూరులో కోటి మందికిపైగా జనాబా ఉండటంతో కోవిడ్ పాజిటివ్ కేసులు చాపకింద నీరులా విపరీతంగా పెరిగిపోయాయి.

కోవిడ్ కేసుల్లో రికార్డ్ బ్రేక్

కోవిడ్ కేసుల్లో రికార్డ్ బ్రేక్

కర్ణాటకలో విపరీతంగా కోవిడ్ పాజిటివ్ కేసులు పెరిగిపోయాయి. బుధవారం ఒక్కరోజే కర్ణాటకలో 39, 047 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొత్తగా వెలుగు చూసిన కరోనా పాజిటివ్ కేసుల్లో ఐటీ హబ్ బెంగళూరు సిటీలో ఏకంగా 22, 596 కరోనా పాజిటివ్ కేసులు ఉండటంతో ఆ నగర ప్రజలు హడలి చస్తున్నారు.

బాంబు పేల్చిన అశోక్

బాంబు పేల్చిన అశోక్

బెంగళూరులో కరోనా వైరస్ సోకి ఆసుపత్రికి వచ్చి చికిత్స చేసుకున్న తరువాత సుమారు 3, 000 మందికి పైగా కోవిడ్ పేషంట్లు వారి మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని పరారైనారని ఆ రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి, కోవిడ్ కేర్ ఇన్ చార్జ్ ఆర్. అశోక్ బాంబు పేల్చారు. కోవిడ్ చికిత్స చేసుకునే ముందు ఆసుపత్రుల్లో వారు ఇచ్చిన ఇంటి అడ్రస్ లో 3 వేల మందికి పైగా లేరని, వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయని మంత్రి ఆర్. అశోక్ మీడియాకు చెప్పారు.

చివరి నిమిషంలో వచ్చి ఐసీయూ బెడ్ కావాలంటే ఎలా ?

చివరి నిమిషంలో వచ్చి ఐసీయూ బెడ్ కావాలంటే ఎలా ?

కరోనా పాజిటివ్ వచ్చిన తరువాత వైద్యుల సలహామేరకు చికిత్స చేసుకోవాలని, అలా కాకుండా చాలా మంది వాళ్లకు కోవిడ్ పాజిటివ్ వచ్చిన విషయం సాటి ప్రజలకు చెప్పకుండా వారితో కలిసి తిరిగేసి లేనిపోని సమస్యలు తెస్తున్నారని మంత్రి ఆర్ .అశోక్ విచారం వ్యక్తం చేస్తున్నారు. కరోనా వ్యాధి ముదిరిపోయే వరకు ఎక్కడెక్కడో తిరిగేసి చివరి నిమిషంలో ఆసుపత్రి వచ్చి మాకు ఐసీయూ బెడ్ కావాలని అడుగుతున్నారని, ఈ విధంగా లేనిపోని సమస్యలు వస్తున్నాయని సీనియర్ మంత్రి ఆర్. అశోక్ విచారం వ్యక్తం చేస్తున్నారు.

మందుల ధరలు 90 శాతం తక్కువ అని వస్తున్నారు

మందుల ధరలు 90 శాతం తక్కువ అని వస్తున్నారు

కోవిడ్ పాజిటివ్ వచ్చిన రోగులకు ప్రభుత్వం 90 శాతం తక్కువ ధరతో ఔషదాలు, మందులు ఇస్తున్నదని మంత్రి ఆర్. అశోక్ గుర్తు చేశారు. ప్రభుత్వం తక్కువగా మందులు ఇస్తోందని మాత్రమే వారు ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్నారని, వ్యాధి సోకిన వెంటనే వస్తే వారికి చికిత్స చేసి వ్యాధి నుంచి కోలుకునే లాగా చెయ్యవచ్చని, అలా కాకుండా కరోనా వ్యాధి ముదిరిపోయే వరకు నిర్లక్షం చేస్తున్నారని, ఇది ఎవ్వరికి మంచిది కాదని మంత్రి ఆర్. అశోక్ అన్నారు.

మీ ఫోన్లు స్విచ్ ఆన్ చెయ్యండి స్వామి

మీ ఫోన్లు స్విచ్ ఆన్ చెయ్యండి స్వామి

బెంగళూరు నగరంలో కోవిడ్ పాజిటివ్ వచ్చి పారిపోయిన సుమారు 3, 000 మంది వెంటనే వారి మొబైల్ ఫోన్లు స్విచ్ ఆన్ చేసుకుని స్థానిక వైద్యులను కలుసుకుని చికిత్స చేసుకోవాలని మంత్రి ఆర్. అశోక్ మనవి చేశారు. మీరు చేస్తున్న పనివలన మీ కుటుంబ సభ్యులతో పాటు ఇతరు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారనే విషయాన్ని మీరు గుర్తించాలని మంత్రి ఆర్. అశోక్ అంటున్నారు.

Recommended Video

TRS Party Formation Day: 14 ఏళ్ల క్రితం పురుడు పోసుకున్న టీఆర్ఎస్ పార్టీ - Party Leaders
 అందుకే పారిపోయారా ?

అందుకే పారిపోయారా ?

మరో వైపు కోవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్లను బీబీఎంపీ నీరు లేకుండా, డాక్టర్లు, మందులు లేని హాల్ లో కుర్చోపెట్టడం వలనే పారిపోతున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద కోవిడ్ పాజిటివ్ వచ్చిన 3 వేల మంది పారిపోయారని వెలుగు చూడటంతో బెంగళూరు ప్రజలకు కంటి మీద కునుకులేకుండా పోయింది.

English summary
Coronavirus: Upto 3000 People Affected By Covid-19 Are Missing In Bengaluru city: Karnataka Minister R. Asoka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X