Doute: రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ వ్యాపారం, వేరే లేడీతో ?, ఇనుప రాడ్ తో లేపేసిన భార్య, సొంత అత్త కూతురు!
బెంగళూరు: సొంత అత్తకూతురిని వివాహం చేసుకున్న వ్యక్తి సంతోషంగా కాపురం చేశాడు. దంపతులకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న భర్త డబ్బులు బాగా సంపాదిస్తున్నాడు. అంత డబ్బులు సంపాదిస్తున్నా ఇంట్లో భార్య ఆమె భర్తను డామినేట్ చెయ్యడం మొదలుపెట్టిందని తెలిసింది. బయట రూ. కోట్లలో లావాదేవీలు చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంటికి వెళ్లిన తరువాత పిన్ టూ పిన్ భార్యకు లెక్కలు చెప్పాల్సి వస్తోంది. ఇదే విషయంలో దంపతుల మద్య తేడాలు వచ్చాయని తెలిసింది.
ఇదే సమయంలో భర్త వేరే మహిళతో చనువుగా ఉంటున్నాడని, ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాడని అతని భార్య అనుమానం మొదలైయ్యింది. సొంత అత్త కూతురిని పెళ్లి చేసుకున్నా ఇంట్లో సుఖం లేదని రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆవేదన చెందుతున్నాడని అతని బంధువులు అంటున్నారు. రాత్రి మద్యం సేవించి ఇంటికి వెళ్లిన భర్తతో అతని భార్య గొడవ పెట్టుకుంది.
తరువాత ఇనుప రాడ్ తో భర్తను దారుణంగా చంపేసిన భార్య అతని శవం మాయం చెయ్యడానికి ప్రయత్నించిందని పోలీసులు అంటున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసులో అతని భార్య, ఇద్దరు కూతుర్లను అదుపులోకి తీసుకున్నామని, రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ వ్యాపారి హత్య కేసు పూర్తి వివరాలు బయటకు లాగుతున్నామని డీసీపీ అన్నారు.
Illegal
affair:
ప్రియురాలి
మోజులో
కాలేజ్
అబ్బాయి,
ఆంటీతో
ఎంజాయ్,
చివరికి
ఏం
చేశాడంటే?,
క్లైమాక్స్!

సొంత అత్త కూతురు
బెంగళూరు నగరంలోని ఆంధ్రాహళ్లిలోని సాయిబాబా లేఔట్ లో ఉమేష్ (52) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు 29 సంవత్సరాల క్రితం ఉమేష్. తుమకూరు జిల్లాలోని కుణిగల్ తాలుకాలోని అమృతూరుకు చెందిన అత్త కూతురు వరలక్ష్మి (48)ని వివాహం చేసుకున్నాడు. సొంత అత్తకూతురు వరలక్ష్మిని వివాహం చేసుకున్న ఉమేష్ ఆమెతో సంతోషంగా కాపురం చేశాడు.

రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ వ్యాపారం
ఉమేష్, వరలక్ష్మి దంపతులకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న ఉమేష్ డబ్బులు బాగా సంపాదిస్తున్నాడు. అంత డబ్బులు సంపాదిస్తున్నా ఇంట్లో భార్య వరలక్ష్మి ఆమె భర్త ఉమేష్ ను డామినేట్ చెయ్యడం మొదలుపెట్టిందని తెలిసింది.

పిన్ టూ పిన్ ఆరా తీస్తున్న భార్య
బయట రూ. కోట్లలో లావాదేవీలు చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి ఉమేష్ ఇంటికి వెళ్లిన తరువాత అతని భార్య వరలక్ష్మికి పిన్ టూ పిన్ లెక్కలు చెప్పాల్సి వస్తోంది. ఇదే విషయంలో ఉమేష్, వరలక్ష్మి దంపతుల మద్య తేడాలు వచ్చాయని తెలిసింది. ఆర్థిక లావాదేవీల విషయంలో తన భర్త ఉమేష్ తనను మోసం చేస్తున్నాడని వరలక్ష్మికి అనుమానం ఎక్కువ అయ్యింది.

అక్రమ సంబంధం
ఇదే సమయంలో ఉమేష్ వేరే మహిళతో చనువుగా ఉంటున్నాడని, ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాడని అతని భార్య వరలక్ష్మికి అనుమానం మొదలైయ్యింది. సొంత అత్త కూతురు వరలక్ష్మిని పెళ్లి చేసుకున్నా ఇంట్లో నాకు సుఖం లేదని రియల్ ఎస్టేట్ వ్యాపారి ఉమేష్ ఆవేదన చెందుతున్నాడని అతని బంధువులు, స్నేహితులు అంటున్నారు.

ఇనుప రాడ్ తో భర్తను చంపేసిన భార్య
రాత్రి మద్యం సేవించి ఇంటికి వెళ్లిన ఉమేష్ తో అతని భార్య వరలక్ష్మి పెద్ద గొడవ పెట్టుకుంది. తరువాత మాటామాటా పెరిగిపోవడంతో వరలక్ష్మి ఇనుప రాడ్ తీసుకుని ఆమె భర్త ఉమేష్ మీద దాడి చేసి అతన్ని దారుణంగా చంపేసింది. ఉమేష్ శవాన్ని వరలక్ష్మి మాయం చెయ్యడానికి ప్రయత్నించిందని పోలీసులు అంటున్నారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారి ఉమేష్ హత్య కేసులో అతని భార్య, ఇద్దరు కూతుర్లను అదుపులోకి తీసుకున్నామని, రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ వ్యాపారి హత్య కేసు పూర్తి వివరాలు బయటకు లాగుతున్నామని డీసీపీ డాక్టర్ సంజీవ్ పాటిల్ మీడియాకు చెప్పారు.