Drugs racket: ఫేమస్ నటికి నోటీసులు, విచారణకు ఢుమ్మా, ఇప్పటికే ఫ్రెండ్ రింగరింగ, లాయర్లు!

బెంగళూరు/ ముంబాయి: బాలీవుడ్ హీరో సుషాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తు జరుగుతున్న సందర్బంలో అనేక మంది కూసాలు కదిలిపోతున్నాయి. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కు డ్రగ్స్ దందాకు లింక్ ఉందని ఆరోపణలు వస్తున్న సమయంలో ఎన్ సీబీ అధికారులు రంగంలోకిదిగారు. బాలీవుడ్ నుంచి స్యాండిల్ వుడ్ వరకు డ్రగ్స్ దందాకు లింక్ ఉందని వెలుగు చూసింది.

ఇప్పటికే నటి అనికాను అరెస్టు చేసిన అధికారులు అనేక మందికి నోటీసులు ఇచ్చారు. స్యాండిల్ వుడ్ తో పాటు తెలుగు, తమిళ తదితర బాషల్లో నటించిన ప్రముఖ నటికి విచారణకు హాజరుకావాలని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇచ్చారు .అయితే అనారోగ్య కారణంగా తాను విచారణకు హాజరుకాలేనని ఆ నటి న్యాయవాదులతో సమాచారం ఇచ్చారు. అయితే ప్రముఖ నటి వ్యక్తిగత సహాయకుడు ఇప్పటికే సీసీబీ పోలీసుల చేతికి చిక్కడంతో రింగరింగ అంటూ విచారణ చేశారు.

నటి అనికా దెబ్బతో హడల్

నటి అనికా దెబ్బతో హడల్

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు విషయంలొ డ్రగ్స్ మాఫియా దందా ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చిన సమయంలో ముంబాయిలో ఎన్ సీబీ అధికారులు రెహమాన్ అనే డ్రగ్ డీలర్ ను అరెస్టు చేశారు. రెహమాన్ ఇచ్చిన సమాచారం మేరకు బెంగళూరులో నటి అనికాతో సహ ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో నటి అనికా ఇచ్చిన సమాచారం మేరకు పలువురు సెలబ్రిటీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని సమాచారం.

స్యాండిల్ వుడ్ పై ఆరోపణలు

స్యాండిల్ వుడ్ పై ఆరోపణలు

బెంగళూరులో నివాసం ఉంటూ పలు సీరియల్స్ లో నటిస్తూ నటిగా గుర్తింపు తెచ్చుకుంటున్న అనికా అరెస్టు కావడం, ఆమె మొబైల్ ఫోన్లలో అనేక మంది సెలబ్రిటీల ఫోన్ నెంబర్లు ఉండటంతో పలుకోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇదే సమయంలో స్యాండిల్ వుడ్ కు చెందిన కొందరు నటీనటులపై బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) అధికారులు నిఘా వేశారని సమాచారం.

బహుబాష నటికి నోటీసులు

బహుబాష నటికి నోటీసులు

స్యాండిల్ వుడ్ కు డ్రగ్స్ మాఫియాతో లింక్ ఉందని ఆరోపణలు రావడంతో బెంగళూరు సీసీబీ పోలీసులు రంగంలోకి దిగారు. స్యాండిల్ వుడ్ తో పాటు తెలుగు, తమిళ తదితర బాషల్లో నటించిన ప్రముఖ నటి రాగిణి ద్వివేది వ్యక్తిగత సహాయకుడు రవిశంకర్ ను బెంగళూరు సీసీబీ పోలీసులు విచారణ చేశారు. ఇదే సమయంలో విచారణకు హాజరుకావాలని ప్రముఖ నటి రాగిణి ద్వివేదికి బెంగళూరు సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చెయ్యడం కలకలం రేపింది.

Sir....i'm not well

Sir....i'm not well

బెంగళూరు సీసీబీ పోలీసులు విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసినా నటి రాగిణి ద్వివేది విచారణకు హాజరుకాలేదు. తనకు అనారోగ్యంగా ఉందని, విచారణకు హాజరుకావడానికి సమయం కావాలని ప్రముఖ నటి రాగిణి ద్వివేది ఆమె న్యాయవాదుల సహాయంతో గురువారం బెంగళూరు సీసీబీ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Recommended Video

    Evening News Roundup 15/04/2019
    క్లారిటీ ఇచ్చిన నటి రాగిణి

    క్లారిటీ ఇచ్చిన నటి రాగిణి

    తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని, అందుకే తన న్యాయవాదులు బెంగళూరు సీసీబీ పోలీసులను కలిసి విషయం చెప్పారని గురువారం ప్రముఖ నటి రాగిణి ద్వివేది సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చారు. బెంగళూరు సీసీబీ పోలీసుల ముందు తాను సోమవారం ఉదయం హాజరౌతానని, అధికారుల విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని బ్యూటీ రాగిణి క్లారిటీ ఇచ్చారు. మొత్తం మీద బెంగళూరు డ్రగ్స్ మాఫియా విషయంలో పోలీసులు విచారణ ముమ్మరం చేస్తున్న సమయంలో నటి రాగిణికి బెంగళూరు సీసీబీ పోలీసులు నోటీసులు ఇవ్వడంతో కొందరు ప్రముఖులు హడలిపోతున్నారని తెలిసింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+