బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Effect: ఇంత జరగడానికి ఎవరు కారణం ?, మామల మీద వేటు పడింది, తెలిసినా పట్టించుకోలేదని!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/కోప్పళ: మతాంతర వివాహం, వాల్మీకి విగ్రహం ఏర్పాటు విషయంలో రెండు వర్గాల మద్య గొడవ జరగడంతో ఇరు వర్గాలకు చెందిన ఇద్దరు దారుణ హత్యకు గురైనారు. లవ్ మ్యారేజ్ విషయంలో మొదలైన గొడవలు తరువాత వాల్మీకి విగ్రహం ఏర్పాటు చేసే విషయంలో గొడవపపడి ఇంతవరకు తెచ్చుకోవడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. ఇంత జరగడానికి పోలీసు అధికారుల నిర్లక్షం కారణం అని పై అధికారుల విచారణలో వెలుగు చూడటంతో హాట్ టాపిక్ అయ్యింది.

Lady: బాయ్ ఫ్రెండ్ తో ఉంటే మహిళ కిడ్నాప్, 7 మంది సామూహిక అత్యాచారం, ఆంటీ చిక్కిందని మైనర్లు కూడా !Lady: బాయ్ ఫ్రెండ్ తో ఉంటే మహిళ కిడ్నాప్, 7 మంది సామూహిక అత్యాచారం, ఆంటీ చిక్కిందని మైనర్లు కూడా !

హిందువులు, ముస్లీంలు

హిందువులు, ముస్లీంలు

కర్ణాటకలోని కోప్పళ జిల్లాలోని కనకగురి తాలుకాలో హులిహైదర్ అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో హిందువులు, ముస్లీం సోదరులు నివాసం ఉంటున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి హిందువులు, ముస్లీంల మద్య గొడవలు జరుగుతున్నాయి. గొడవలు జరిగిన ప్రతిసారి ఇరు వర్గాల పెద్దలు, పోలీసులు రాజీ చేస్తూ వస్తున్నారు.

వాల్మీకి విగ్రహం.... లవ్ మ్యారేజ్

వాల్మీకి విగ్రహం.... లవ్ మ్యారేజ్

ఇటీవల ఇదే గ్రామంలో నివాసం ఉంటున్న ముస్లీం, హిందూ యువతి, యువకుడు ప్రేమించుకుని గ్రామం నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ప్రేమికుల విషయంలో గ్రామంలో నివాసం ఉంటున్న ఇరు వర్గాల వారు ఒకరిని చూస్తే ఒకరు రగిలిపోతున్నారు. ఇదే సందర్బంలో గ్రామంలో వాల్మీకి విగ్రహం ఏర్పాటు చేసే విషయంలో ఇరు వర్గాల మద్య గొడవలు మొదలుకావడంతో పరిస్థితులు తల్లకిందులైనాయి.

ఇద్దరి దారుణ హత్య

ఇద్దరి దారుణ హత్య

గత గురువారం గ్రామంలోని మార్కెట్ దగ్గరకు పాషావలి (27) అనే యువకుడు వెళ్లిన సందర్బంలో అక్కడ గొడవ మొదలైయ్యింది. అంతే ఇరు వర్గాల మద్య గొడవలు జరగడంతో ఆ ప్రాంతం రణరంగంగా మారిపోయింది. ఈ గొడవల్లో పాషావలితో పాటు యంకప్ప (60) అనే ఆయన హత్యకు గురైనారు. ఇద్దరు హత్యకు గురికావడంతో అనేక మందికి గాయాలైనాయి.

పోలీసు అధికారుల మీద వేటు

పోలీసు అధికారుల మీద వేటు

గత గురువారం హులి హైదర్ గ్రామంలో గొడవలు జరిగి ఇద్దరు హత్యకు గురి అయ్యారు. గొడవలు జరిగి వారం రోజులు అయినా ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు అలాగే ఉన్నాయి. గొడవలు జరిగే అవకాశం ఉందని ముందుగా సమాచారం అందినా పోలీసు అధికారులు నిర్లక్షంగా వ్యవహరించారని, దాని ఫలితంగా ఇద్దరు హత్యకు గురైనారని పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది.

ఇంత జరగడానికి కారణం అయిన ఇన్స్ పెక్టర్ పరసప్పప భజంత్రి, ఏఎస్ఐ మంజునాథ్, హెడ్ కానిస్టేబుల్ హనుమంత, సంగప్ప, అనే నలుగురిని సస్పెండ్ చేస్తూ పై అధికారులు గురువారం ఆదేశాలు జారీ చేశారు.

English summary
Effect: Huli Haider gangwar case, four more police officials suspende in Koppal in Karnataka
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X