బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Plan B: మాజీ సీఎంను ఓడించాలి. రంగంలోకి మాజీ ప్రధాని, మరో మాజీ సీఎం, తెలుగు బెల్ట్ లో గేమ్!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/కోలారు: కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారిపోతున్నాయి. కర్ణాటకలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం అందరి కన్ను ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని కోలారు అసెంబ్లీ నియోజక వర్గం మీద పడింది. కోలారు నుంచి తాను పోటీ చేస్తానని మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఇప్పటికే ప్రకటించారు. మాజీ సీఎం పోటీ చేస్తే ఆయన్ను ఓడించాలని మాజీ ప్రధాని, మరో మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామి స్వయంగా రంగంలోకి దిగడం హాట్ టాపిక్ అయ్యింది.

అంబేద్కర్ వారసులతో ఇప్పటికే చర్చలు జరిపిన మాజీ ప్రధాని, మాజీ సీఎం కోలారులో మాజీ సీఎం సిద్దూను ఓడించడానికి పక్కాప్లాన్ వేస్తున్నారని సమాచారం. సిద్దూను ఓడించడానికి కులాలతో పాటు తెలుగు మాట్లాడేవారిని టార్గెట్ చేసుకుంటున్నారని తెలిసింది.

Romance: జైలు వార్డెన్లు, ఒకడు వల వేస్తే ఇంకొకడు వీడియోలు తీశారు, అర్దరాత్రి సెంట్రల్ జైల్లో ? అబ్బా!Romance: జైలు వార్డెన్లు, ఒకడు వల వేస్తే ఇంకొకడు వీడియోలు తీశారు, అర్దరాత్రి సెంట్రల్ జైల్లో ? అబ్బా!

 కోలారులో వాడుక బాష 80 శాతం తెలుగు

కోలారులో వాడుక బాష 80 శాతం తెలుగు

కోలారు జిల్లా కర్ణాటకలో ఉన్నా అక్కడ వాడుక బాష మాత్రం ఎక్కువగా తెలుగు మాట్లాడుతారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉన్న కోలారు జిల్లాలో తెలుగు సినిమాలో భారీ వసూళ్లు రాబడతాయి. కోలారు, చిక్కబళ్లాపురం, బెంగళూరు గ్రామీణ జిల్లాల్లో ఎక్కువగా తెలుగు బాషలో మాట్లాడుతుంటారు. తెలుగు తెలీకుండా బయట నుంచి వచ్చిన వారితో మాత్రమే కన్నడలో మాట్లాడుతారు.

సిద్దరామయ్య పోటీ

సిద్దరామయ్య పోటీ

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కోలార్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ప్రకటించారు. ఆయన్ను ఓడించేందుకు జేడీఎస్ మాస్టర్ ప్లాన్ వేస్తోందని తెలిసింది. జేడీఎస్ నాయకుడు, మాజీ సీఎం పార్టీ నేత హెచ్‌డీ. కుమారస్వామి రంగంలోకి దిగారు. తన రాజకీయ శత్రువు సిద్దరామయ్యను ఓడించడానికి హెచ్.డీ. కుమారస్వామి ఇప్పటికే రంగంలోకి దిగేశారు.

అంబేద్కర్ మనుమడు ఎంట్రీ?

అంబేద్కర్ మనుమడు ఎంట్రీ?

కోలారు అసెంబ్లీ నియోజక వర్గంలో దళిత ఓటర్లను గణనీయ సంఖ్యలో ఉన్నారు. దళితులను ఏకం చేసేందుకు డాక్టర్‌ బి. ఆర్. అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ సహాయం కోరాలని మాజీ ప్రధాని హెచ్ డీ, దేవేగౌడ, మాజీ సీఎం హెచ్, డీ. కుమారస్వామి నిర్ణయించుకున్నారని తెలిసింది. కోలారు నిమోజక వర్గం మీద ఫోకస్ పెట్టిన హెచ్ డీ. కుమారస్వామి పంచరత్న యాత్రకు విరామం ఇచ్చి కోలారు జేడీఎస్ నాయకులతో సమావేశమై వ్యూహం రచిస్తున్నారని తెలిసింది.

ఆయన వస్తారా?

ఆయన వస్తారా?

కోలారులో దళితులతో పాటు మైనారిటీలు, వెనుకబడిన తరగతుల వారిని తమవైపు తిప్పుకునేందుకు ప్రకాశ్‌ అంబేద్కర్ ను రంగంలోకి దించాలని జేడీఎస్ సీనియర్ నేత ఒకరు ప్రముఖ ఆంగ్ల దినపత్రికు చెప్పారు. జేడీఎస్‌ చీఫ్, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, మాజీ సీఎం హెచ్ డీ, కుమారస్వామి ఇటీవల ప్రకాశ్‌ అంబేద్కర్‌ను కలిసి ఇదే విషయంపై చర్చించారని తెలిసింది. జనవరి 14, 15 తేదీల్లో కోలార్, చిక్కబళ్లాపూర్, బెంగళూరు గ్రామీణ జిల్లాలకు చెందిన జేడీఎస్ నాయకులు, కార్యకర్తలతో మాజీ సీఎం హెచ్, డీ. కుమారస్వామి సమావేశం కానున్నారు.

ఎవరు ఈ శ్రీనాథ్

ఎవరు ఈ శ్రీనాథ్

కోలారులో సిద్ధరామయ్యను ఓడించడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలను జేడీఎస్ నాయకులు వెతుక్కుంటున్నారు. జేడీఎస్ పార్టీ ఇప్పటికే కోలార్ అసెంబ్లీ నియోజక వర్గం అభ్యర్థిగా ఒక్కలిగ నేత సీఎంఆర్. శ్రీనాథ్‌ను ప్రకటించింది. అయితే సిద్దరామయ్య తాను కోలారు నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన తరువాత శ్రీనాథ్ మార్చి వేరే అభ్యర్థిని రంగంలో దింపే అవకాశం ఉందని తెలిసింది. అయితే కోలారులో మా పార్టీ అభ్యర్థి శ్రీనాథ్ అని జేడీఎస్ నాయకులు అంటున్నారు. కోలార్ నుంచి పోటీ చేస్తానని సిద్ధరామయ్య ప్రకటించిన వెంటనే జేడీఎస్ తన అభ్యర్థిని మారుస్తుందనే ఊహాగానాలు వెలువడ్డాయి. జేడీఎస్ ఎమ్మెల్సీ, కోర్ కమిటీ కన్వీనర్ కేఏ తిప్పేస్వామి మాట్లాడుతూ మాకు కోలారులో మంచి అభ్యర్థి శ్రీనాథ్ ఉన్నారని, ఆయన్ను మార్చే ప్రసక్తే లేదని అంటున్నారు.

సీఎం ఇబ్రహీం ఎంట్రీ

సీఎం ఇబ్రహీం ఎంట్రీ

జేడీఎస్ పార్టీ కార్ణాటక రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సీఎం ఇబ్రహీం ఆ పార్టీని ముస్లింల్లో సీనియర్ నాయకుడు. కోలార్‌లో వేలాది మంది ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేందుకు సీఎం ఇబ్రహీం మరింత కృషి చేస్తానని ఎమ్మెల్సీ తిప్పేస్వామి అంటున్నారు. కోలారులో సిద్ధరామయ్య పోటీ మాకు మరింత సవాలుగా మారినప్పటికీ జేడీఎస్ అభ్యర్థి గెలుస్తారని నమ్మకంతో ఉన్నామని తిప్పేస్వామి అంటున్నారు. సీఎం ఇబ్రహీం కూడా విలేకరులతో మాట్లాడుతూ కోలారులో అహింద ప్లాన్ అమలు కాదని చెప్పారు. సిద్ధరామయ్య వరుణా నియోజక వర్గం నుంచి పోటీ చేస్తే ఆయనకే మంచిదని సీఎం ఇబ్రహీం వ్యంగంగా అన్నారు.

కోలారులో కులాల లెక్కలు

కోలారులో కులాల లెక్కలు

కోలారు నియోజక వర్గం ఎస్సీలు సిద్ధరామయ్యకు మద్దతు ఇవ్వరని జేడీఎస్ నాయకులు అంటున్నారు. ఇక ఆ నియోజక వర్గంలో ఎక్కుంగా ఉన్న బ్రాహ్మణులు, శెట్టిలు బీజేపీతో కలిసి వెళ్తున్నారు. సిద్ధరామయ్య వరుణ నుంచి పోటీ చేయడం మంచిదని సీఎం ఇబ్రహీం అన్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో కేంద్ర మాజీ మంత్రి కేహెచ్, మునియప్ప కోలారు లోక్ సభ నియోజక వర్గం నుంచి ఓడిపోయారని, ఆ రోజే కోలారు ప్రజలు కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పారని, ఇప్పుడు మళ్లీ అదే ప్రజలు మాజీ సీఎం సిద్దరామయ్యకు టాటా చెబుతారని జేడీఎస్ నాయకులు అంటున్నారు.

కోలారు జేడీఎస్ అభ్యర్థి శ్రీనాథ్ కు ముస్లింలతో మంచి సంబంధాలు ఉన్నాయని, వక్కలిగ, ముస్లిం ఓట్లు గణనీయంగా ఉన్నాయని, మా పార్టీ కచ్చితంగా గెలుస్తుందని, సిద్దరామయ్య ఓడిపోతారని జేడీఎస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

English summary
Ex-Prime Minister Deve Gowda and Ex-CM Kumaraswamy are planning to defeat former CM Siddaramaiah in Kolar in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X