పైకి మాత్రమే శత్రువులు, లోపల ఇద్దరు మాజీ సీఎంలకు అగ్రిమెంట్ కుదిరింది, మాజీ ప్రధాని ఫైర్ !
న్యూఢిల్లీ/బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు ముందు ఏదైనా జరిగే అవకాశం ఉందని తెలిసింది. బీజేపీకి చెందిన మాజీ సీఎం, కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి లోలోపల ఒప్పందాలు చేసుకుని పైకి ప్రజలను మోసం చేస్తున్నారని మాజీ ప్రధాని హెచ్. డీ. దేవేగౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు ప్రత్యర్థి పార్టీలకు చెందిన ఇద్దరు మాజీ సీఎంలకు డీల్ కుదిరిందని మాజీ ప్రధాని దేవేగౌడ బాంబు పేల్చారు.
ఢిల్లీలో ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు. మైసూరులోని వరుణ నియోజక వర్గంలో పోటీ చేసే విషయంలో బీజేపీ మాజీ సీఎం బీఎస్. యడియూరప్ప, కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యల మధ్య భారీ డీల్ జరిగిందని మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ ఆరోపించారు.

వరుణా నియోజక వర్గంలో మాజీ సీఎం సిద్దరామయ్య మీద బీఎస్. యడియూరప్ప కుమారుడు బీవై. విజయేంద్ర పోటీ చెయ్యాల్సి ఉందని, కాని బీఎస్. యడియూరప్ప, సిద్దరామయ్యల మధ్య రాజీ కుదరడంతో విజయేంద్ర పోటీ నుంచి తప్పుకున్నారని మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ ఆరోపించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
గత అసెంబ్లీ ఎన్నికల తరువాత కాంగ్రెస్ తో కలిసి పని చేసిన జేడీఎస్ ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ తో కలిసి పని చేసే అవకాశం ఉందా అని ఆ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా ఇక్కడ ఇద్దరు మాజీ సీఎంలు చాలా క్లోజ్ గా డీల్ సెట్ చేసుకున్నప్పుడు మళ్లీ వారితో కలిసి జేడీఎస్ ఎలా పని చేస్తుందని మీరు అడుగుతున్నారు అంటూ మాజీ ప్రధాని హెచ్ డీ. దేవేగౌడ ప్రశ్నించారు.

హాసన్ లో కోడలు భవాని రేవణ్ణకు టిక్కెట్ ఇచ్చే విషయంలో కూడా మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ వివరణ ఇచ్చారు. మా కుమారులు హెచ్ డీ. రేవణ్ణ, హెచ్.డీ. కుమారస్వామిని తన ఇంటికి పిలిపించుకుని మాట్లాడామని, హాసన్ టిక్కెట్ విషయంలో అందరూ చర్చించుకుని ఓ నిర్ణయానికి వచ్చామని, ఆ సమస్య గురించి అందరూ ఓ నిర్ణయానికి వచ్చారని, త్వరలో అన్ని సర్దుకుంటాయని మాజీ ప్రధాని దేవేగౌడ వివరించారు. మొత్తం మీద సిద్దరామయ్య, బీఎస్. యడియూరప్పల మధ్య లోలోపల ఒప్పందం జరిగిందని మాజీ ప్రధాని దేవేగౌడ బాంబు పేల్చడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.












Click it and Unblock the Notifications