బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భారీ వర్షాలతో మునిగిన బెంగళూరు - మరో మూడు రోజులు ఇలాగే..!!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు నగరం మరోసారి మునిగింది. భారీ వర్షాలు నగరాన్ని ముంచెత్తాయి. బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం సిలికాన్ సిటీ దెబ్బ తింది. నగరంలోని పలు ప్రాంతాల్లో జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. నగరంలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ వర్షం తీవ్రత తగ్గలేదు. రాజమహల్‌ గుట్టహల్లిలో 59 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. కొద్ది నెలల క్రితం నగరంలో భారీ వర్షాల ధాటికి అనేక ప్రతిష్ఠాత్మక సంస్థలు నీట మునిగాయి. జాతీయ స్థాయిలో బెంగూరు నగరంలోని వర్షాలు..నీట మునగటం పైన చర్చ మొదలైంది. ఐటీ పార్కు కూడా నీటిలో చిక్కుకుంది.

ప్రఖ్యాత సంస్థలు సైతం ఆక్రమణలకు పాల్పడటంతోనే నగరం వర్షం నీటికి మునిగిందనే విమర్శలు ఉన్నాయి. దీంతో, ఆక్రమణల నిర్మూలనకు అధికారులు చర్యలు మొదలు పెట్టారు. ఇప్పుడు మరోసారి భారీ వర్షంతో నాటి పరస్థితులే కనిపిస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు భారీ వర్షం ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎల్లో అలర్ట్ జారీ చేసారు. సరిగ్గా ఏడున్నర గంటల ప్రాంతలో జోరు వాన పడడం, ఆఫీసుల నుంచి బయటకు వచ్చేవాళ్లతో రోడ్లు జామ్‌ అయ్యాయి. రోడ్లు, సెల్లార్లు నీట మునిగాయి. వాహనాలు భారీ సంఖ్యలో దెబ్బ తిన్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ఈ ఏడాది వానాకాలంలో రికార్డు స్థాయిలో 1,706 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది.

Heavy rain lashes Bengaluru, streets waterlogged, Yellow Alert issued

అంతకు ముందు.. 2017లో 1,696 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డుగా నమోదు అయ్యింది. అక్రమ కట్టడాల మూలంగానే నగరం ఈ స్థితికి చేరుకుందని ఇంజినీరింగ్‌ నిపుణులు ఇచ్చిన నివేదికలతో ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. ఇదే సమయంలో సామాన్యులు ప్రభుత్వంలోని ముఖ్యులు..అధికారుల తీరు పై మండి పడుతున్నారు. తమ కష్టాలను వివరిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు. ఇదేనా వ్యవహరించే తీరు అంటూ నిలదీస్తున్నారు. బెంగళూరు తూర్పు, దక్షిణ, మధ్య ప్రాంతంలో వర్ష ప్రభావం తీవ్రంగా కనిపించింది.

English summary
Heavy rain battered Bengaluru on Wednesday, with the downpour resulting in waterlogging on arterial roads in several parts of the city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X