Hijab: కాలేజ్ దగ్గర హంగామా, ధర్నాలు, హిజాబ్ ఎఫెక్ట్, 58 మంది విద్యార్థుల సస్పెండ్, దెబ్బకు దెబ్బ!

బెంగళూరు/ శివమొగ్గ: కర్ణాటక వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ముస్లీం అమ్మాయిలు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. హిజాబ్ లేకుండా మేము క్లాస్ రూమ్ లో అడుగు పెట్టమని కొందరు ముస్లీం అమ్మాయిలు తేల్చి చెప్పారు. హిజాబ్ తీసేయ్యాలని చెప్పడానికి మా తల్లిదండ్రులకే హక్కు లేదని, హిజాబ్ లు తీసేసి స్కూల్ కు, కాలేజ్ కు రావాలని అని చెప్పడానికి వీళ్లే ఎవరు ? అని ఇప్పటికే చదువుకుంటున్న ముస్లీం అమ్మాయిలు మండిపడ్డారు. మేము హిజాబ్ వేసుకుని కుర్చీలు, టేబుల్స్ మీద కుర్చుకుంటున్నామని, వాళ్ల నెత్తి మీద కుర్చోవడం లేదని ముస్లీం అమ్మాయిలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

కావాలంటే పరీక్షలు రాయకుండా ఇంట్లో కుర్చుంటామని, హిజాబ్ లు తీసే ప్రసక్తే లేదని ముస్లీం అమ్మాయిలు పరీక్షలు బహిష్కరించడం హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఇదే సమయంలో హైకోర్టు ఆదేశాలను లెక్క చెయ్యకుండా హిజాబ్ లు వేసుకుని విద్యాసంస్థలకు వెళ్లిన 58 మంది ముస్లీం విద్యార్థులను విద్యాశాఖా అధికారులు సస్పెండ్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

మాకు హిజాబ్ ముఖ్యం...... వేరే విషయం అక్కర్లేదు

మాకు హిజాబ్ ముఖ్యం...... వేరే విషయం అక్కర్లేదు

కర్ణాటకలోని అనేక ప్రాంతాల్లో ముస్లీం అమ్మాయిలు ఆందోళన చేశారు. హిజాబ్ లేకుండా మేము క్లాస్ రూమ్ లో అడుగు పెట్టమని కొందరు ముస్లీం అమ్మాయిలు ఇప్పటికే తేల్చి చెప్పారు. హిజాబ్ లు వేసుకునే మేము విద్యాసంస్థల్లో అడుగు పెడుతామని, హిందువులు నుదుటి మీద బొట్టు పెట్టుకుంటే మేము ఎప్పుడు కూడా అభ్యంతరం చెప్పలేదని, ఇప్పుడు ఎందుకు మా హిజాబ్ విషయంలో వీళ్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని, మాకు హిజాబ్ ముఖ్యం, వేరే విషయాలు అక్కరల లేదని ఇప్పటికే కొందరు ముస్లీం అమ్మాయిలు తేల్చి చెప్పారు.

హిజాబ్ లు తియ్యాలని చెప్పే హక్కు ఎవ్వరికీ లేదు

హిజాబ్ లు తియ్యాలని చెప్పే హక్కు ఎవ్వరికీ లేదు

హిజాబ్ తీసేయ్యాలని చెప్పడానికి మా తల్లిదండ్రులకే హక్కు లేదని, హిజాబ్ లు తీసేసి స్కూల్ కు, కాలేజ్ కు రావాలని అని చెప్పడానికి రాజకీయ నాయకులు ఎవరు ?, వాళ్లు ఆ విషయాన్ని ఎందుకు చెబుతున్నారు ?, మేము వేరే మతానికి వ్యతిరేకం కాదని, మా హక్కుల కోసం పోరాడుతున్నామని కొందరు ముస్లీం అమ్మాయిలు మండిపడ్డారు.

హిజాబ్ లేకుంటే పరీక్షలు కూడా రాయలేము

హిజాబ్ లేకుంటే పరీక్షలు కూడా రాయలేము

మేము హిజాబ్ వేసుకుని కుర్చీలు, టేబుల్స్ మీద కుర్చుని చదువుకుంటున్నామని, వాళ్ల నెత్తి మీద కుర్చోవడం లేదని ముస్లీం అమ్మాయిలు మండిపడుతున్నారు. కావాలంటే పరీక్షలు రాయకుండా ఇంట్లో కుర్చుంటామని, హిజాబ్ లు తీసే ప్రసక్తే లేదని ముస్లీం అమ్మాయిలు పరీక్షలు బహిష్కరించారు.

పోలీసులతో వాగ్వివాదం

పోలీసులతో వాగ్వివాదం

హిజాబ్ లు వేసుకున్న కొందరు ముస్లీం అమ్మాయిలు ఇటీవల పరీక్షలు రాయడానికి వెళ్లడంతో పోలీసులు వెనక్కి పంపించేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు హిజాబ్ లు వేసుకుని రాకూడదని విద్యాశాఖ అధికారులు, పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో విద్యాశాఖా అధికారులు, పోలీసులతో వాగ్వివాదానికి దిగిన ముస్లీం అమ్మాయిలు హిజాబ్ లు లేనిదే లోపలికి వెళ్లమని తేల్చి చెప్పారు. చివరికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో కొందరు ముస్లీం అమ్మాయిలు ఆందోళనకు దిగారు.

వేటు వేసిన విద్యాశాఖ అధికారులు

వేటు వేసిన విద్యాశాఖ అధికారులు

హైకోర్టు ఆదేశాలను లెక్క చెయ్యకుండా హిజాబ్ లు వేసుకుని వెళ్లి శుక్రవారం విద్యాసంస్థలకు వెళ్లి ఆందోళనకు దిగి ధర్నాలు చేసిన 58 మంది ముస్లీం విద్యార్థులను విద్యాశాఖా అధికారులు సస్పెండ్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని శిరాలకోప్ప తాలుకాలో 58 మంది ముస్లీం అమ్మాయిలు నియమాలు ఉల్లంఘించి ప్రవర్తించారని, ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులను ఎదిరించి నియమాలు ఉల్లంఘించారని వారి మీద సస్పెన్షన్ వేటు వేశారు.

కొందరు విద్యార్థులు హిజాబ్ లు వేసుకుని వచ్చారని, వారితో పాటు కొందరు విద్యాసంస్థల దగ్గర శాంతిభద్రతలకు విఘాతం కలిగించి ధర్నాలు చేశారని విద్యాశాఖా అధికారులు ఆరోపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+