బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Bengaluru: హిజాబ్ దెబ్బ, బెంగళూరులో 14 రోజులు అంతే, తేడా వస్తే సీన్ రివర్స్, సేఫ్ సైడ్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: హిజాబ్ వివాదం రానురాను రచ్చరచ్చ అవుతోంది. హిజాబ్ వివాదంతో కాషాయం కండువాలు తెరమీదకు రావడంతో గొడవ పెద్దది అయ్యింది. హిజాబ్ VS కాషాయం కండువాల గొడవలు పెద్దవి కావడంతో కర్ణాటక వ్యాప్తంగా ఆందోళనలు మొదలైనాయి. మందుజాగ్రత్త చర్యగా కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు నగరంలోని అన్ని విద్యాసంస్థల ముందు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యాసంస్థల ముందు గుమికూడటం, ర్యాలీలు, ధర్నాలు చెయ్యడం, ఆందోళనకు దిగడం నిషేధించామని బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ అన్నారు. ఎవరైనా నియమాలు ఉల్లంఘించి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ కమల్ పంత్ హెచ్చరించారు. బెంగళూరులో హిజాబ్, కాషాయం కండువాల గొడవ మొదలైయితే పరిస్థితులు చెయ్యిదాటిపోయే అవకాశం ఉందని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Recommended Video

Hijab Row: హిజాబ్ వివాదం Karnataka విద్యాసంస్థలకు సెలవు | Priyanka Gandhi | Oneindia Telugu

Hijab: బికినీలు, జీన్స్ వేసుకుంటారు, బుర్కా అయినా వేసుకుంటారు, మీకెందుకు ?, ప్రియాంకా గాంధీ!Hijab: బికినీలు, జీన్స్ వేసుకుంటారు, బుర్కా అయినా వేసుకుంటారు, మీకెందుకు ?, ప్రియాంకా గాంధీ!

ఎక్కడ చూసినా హిజాబ్ గొడవలే

ఎక్కడ చూసినా హిజాబ్ గొడవలే

హిజాబ్ వేసుకునే విషయంలో ఉడిపిలో మొదలైన వివాదం తరువాత ఆ జిల్లాను దాటి కర్ణాటక మొత్తం వ్యాపించింది. రాజకీయ రంగు పలుముకున్న హిజాబ్ వివాదం రాష్ట్రాలు దాటి దేశం మొత్తం పాకిపోయింది. ఉడిపి నుంచి కుందాపురకు, తరువాత శివమొగ్గ, బాగల్ కోటే, బీజాపుర తదితర జిల్లాలకు హిజాబ్ వివాదం పాకిపోవడంతో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి.

దేశంలో హాట్ టాపిక్ ఏదైనా ఉందా అంటే ఇదే ?

దేశంలో హాట్ టాపిక్ ఏదైనా ఉందా అంటే ఇదే ?


ముస్లీం అమ్మాయిలు హిజాబ్ ధరిస్తామని వాదిస్తుంటే, హిందువులు నుదిటి మీద తిలకం పెట్టుకుని మెడలో కాషాయం జెండాలు వేసుకుని కాలేజ్ కు వస్తామని ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హిజాబ్ (బుర్కా) వేసుకునే విషయంలో ఉడిపిలో మొదలైన వివాదం తరువాత కర్ణాటక మొత్తం వ్యాపించింది. రాజకీయ రంగు పలుముకున్న హిజాబ్ వివాదం రాష్ట్రాలు దాటి దేశం మొత్తం పాకిపోయింది.

విద్యాసంస్థలు బంద్

విద్యాసంస్థలు బంద్

హిజాబ్ వివాదం ముదిరిపోవడంతో మూడు రోజుల పాటు కర్ణాటకలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. హిజాబ్ లు ధరిస్తామని, కాషాయ కండువాలు వేసుకుంటామని కొందరు విద్యార్థులు మొండి పట్టుదలకు పోయారని, ఇదే విషయాన్ని కొందరు రాజకీయ నాయకులు స్వార్థం కోసం ఉపయోగించుకుని చిన్న విషయాన్ని పెద్దది చేశారని, ఈ వివాదం ఇతర జిల్లాలకు వ్యాపించడంతో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.

బెంగళూరులో హై అలర్ట్

బెంగళూరులో హై అలర్ట్


హిజాబ్ VS కాషాయం కండువాల గొడవలు పెద్దవి కావడంతో కర్ణాటక వ్యాప్తంగా ఆందోళనలు మొదలైనాయి. ముందుజాగ్రత్త చర్యగా కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు నగరంలోని అన్ని విద్యాసంస్థల ముందు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యాసంస్థల ముందు గుమికూడటం, ర్యాలీలు, ధర్నాలు చెయ్యడం, ఆందోళనకు దిగడం నిషేధించామని బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ కమల్ పంత్ అన్నారు.

బెంగళూరులో 22వ తేదీ వరకు సేమ్ సీన్

బెంగళూరులో 22వ తేదీ వరకు సేమ్ సీన్

ఈరోజు (ఫిబ్రవరి 9వ తేదీ) నుంచి ఈనెల 22వవ తేదీ వరకు 14 రోజుల పాటు నియమాలు అమలులో ఉంటాయని, ఎవరైనా నియమాలు ఉల్లంఘించి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ కమల్ పంత్ ఆందోళనకారునుల హెచ్చరించారు. బెంగళూరులో హిజాబ్, కాషాయం కండువాల గొడవ మొదలైయితే పరిస్థితులు చెయ్యిదాటిపోయే అవకాశం ఉందని కర్ణాటక పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

English summary
Hijab Row: Hijab controversy protests ban in Bengaluru city for 14 days surroundings of schools and colleges.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X