Bengaluru: భర్తకు అక్రమ సంబంధం, టార్చర్, లేడీ టెక్కీ ఆత్మహత్య, మ్యాటర్ మొత్తం లీక్ చేసింది!

దంపతులు ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు. భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ప్రియురాలితో బయట ఎంజాయ్ చేస్తూ ఇంట్లో భార్యకు టార్చర్ పెట్టాడు.

బెంగళూరు: కట్నం కోసం భర్త, అతని తల్లిదండ్రులు వేధించడంతో విసిగిపోయిన లేడీ టెక్కీ విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బెంగళూరులోని తుబరహళ్లిలో నివాసం ఉంటున్న మాధురి(28) విషం సేవించి చికిత్స విఫలమై మృతి చెందిందని పోలీసులు అన్నారు. కొన్ని రోజుల క్రితం మాధురి ఇంట్లో విషం సేవించి ఆత్మహత్యకు ప్రయత్నించింది. వెంటనే మాధురిని బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స విఫలమై మాధురి చనిపోయిందని పోలీసులు అన్నారు.

అక్ర సంబంధం పెట్టుకున్న టెక్కీ మొగుడు ఇంట్లో భార్యకు నరకం చూపించాడని వెలుగు చూసింది. ఆత్మహత్య చేసుకున్న మహిళ కూడా టెక్కీగా ఉద్యోగం చేస్తోంది.

ఆరు సంవత్సరాల క్రితం పెళ్లి

ఆరు సంవత్సరాల క్రితం పెళ్లి

చికిత్స పొందుతూ మాధురి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెంగళూరులోని వర్తూరు పోలీస్ స్టేషన్‌లో వరకట్న వేధింపుల కేసు నమోదు అయ్యింది. మాధురి భర్త గురు ప్రసాద్, మామ రాఘవేంద్ర రావు, అత్త సుధాల మీద కేసు నమోదు చేశామని పోలీసు అధికారులు తెలిపారు.

దేవనహళ్లికి చెందిన మాధురి, తూబరహళ్లికి చెందిన గురు ప్రసాద్‌ల వివాహం ఏడు సంవత్సరాల క్రితం జరిగింది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు అయిన గురు ప్రసాద్, మాధురి దంపతులు ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్నారు. దంపతులకు ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు.

భర్తకు అక్రమ సంబంధం

భర్తకు అక్రమ సంబంధం

గురు ప్రసాద్ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయమై గురు ప్రసాద్, మాధురి దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. అక్రమ సంబంధం గురించి ప్రశ్నించిన మాధురిపై గురు ప్రసాద్, గర్భిణి అని పట్టించుకోకుండా దాడికి పాల్పడ్డాడు.

కొడుకు తరపున అత్త కూడా మాట్లాడారు. పుట్టింటికి వెళ్లి కట్నంగా డబ్బులు తీసుకురావాలని మాధురి మీద భర్త కుటుంబ సభ్యులు ఒత్తిడి చేశారు.

ఆసుపత్రిలో స్టోరీ మొత్తం చెప్పిన లేడీ టెక్కీ

ఆసుపత్రిలో స్టోరీ మొత్తం చెప్పిన లేడీ టెక్కీ

భర్త కుటుంబ సభ్యులు టార్చర్ తట్టుకోలేక మాధురి నానా ఇబ్బందులు ఎదుర్కొనింది. జనవరి 25న మాధురితో గొడవ పడిన గురు ప్రసాద్ మీ పుట్టింటికి వెళ్లి కట్నం డబ్బులు తీసుకురావాలని గొడవ చేశాడు. అత్త కూడా నా కొడుకుని వదిలేసి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోవాలని మాధురికి తేల్చి చెప్పింది.

దీంతో మనస్తాపానికి గురైన మాధురి జనవరి 26న రాత్రి భర్త ఇంట్లోనే విషం తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమమంలో మాధురి వర్తూరు పోలీసులకు పూర్తి మ్యాటర్ చెప్పింది. అయితే చికిత్స విఫలమై మాధురి చనిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+