IT HUB: బెంగళూరులో పంజా విప్పిన కరోనా కేసులు, ఈస్ట్ జోన్ టాప్, అపార్ట్ మెంట్ లు, విల్లాల్లోనే ఎక్కువ!
బెంగళూరు: కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మరోసారి పెరగడంతో ప్రజలు ఆందోళనకు గురౌతున్నారు. కరోనా వేవ్ థర్డ్ వేవ్ తగ్గిపోయిందని అందరూ అనుకుంటున్న సమయంలో మరోసారి కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరగడంతో ప్రజలు హడలిపోతున్నారు. ఐటీ హబ్ బెంగళూరులో మరోసారి కరోనా వైరస్ తాండవం చెయ్యడంతో బీబీఎంపీ అధికారులు అలర్ట్ అయ్యారు. ఈసారి బెంగళూరులోని మురికివాడల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంలేదని, అపార్ట్ మెంట్ లు, విల్లాల్లో కోవిడ్ పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని తెలిసిందని బీబీఎంపీ ఆరోగ్యశాఖ అధికారులు అంటున్నారు. బెంగళూరు ఈస్ట్ లో కోవిడ్ పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అయ్యాయని అధికారులు తెలిపారు.

హడలిపోయిన ఐటీ హబ్
కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మరోసారి పెరగడంతో ప్రజలు ఆందోళనకు గురౌతున్నారు. కరోనా వేవ్ థర్డ్ వేవ్ తగ్గిపోయిందని అందరూ అనుకుంటున్న సమయంలో మరోసారి కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరగడంతో ప్రజలు హడలిపోతున్నారు. ఐటీ హబ్ బెంగళూరులో మరోసారి కరోనా వైరస్ తాండవం చెయ్యడంతో బీబీఎంపీ అధికారులు అలర్ట్ అయ్యారు.

బెంగళూరులో మహదేవపుర టాప్
బెంగళూరులో నమోదు అయిన కరోనా పాజిటివ్ కేసుల్లో ఎక్కువ శాతం మహదేవపుర డివిజన్, బెంగళూరు ఈస్ట్ ప్రాంతంలో ఉన్నాయని బీబీఎంపీ ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. మహదేవపురలో 25 కేసులు, బెంగళూరు తూర్పు విభాగంలో 18 కేసులు నమోదు అయ్యాయని ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసిందని ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నారు.

హడలిపోతున్న ప్రజలు
బెంగళూరు గురువారం 91 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. బెంగళూరులో మహదేవపుర జోన్ లోనే 85 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని ఈస్ట్ జోన్ లో 25 కేసులు నమోదు అయ్యాయని బీబీఎంపీ అధికారులు తెలిపారు. బెంగళూరు ఈస్ట్ లో కోవిడ్ పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అయ్యాయని అధికారులు తెలిపారు.

ముంబాయి, ఢిల్లీ ఎఫెక్ట్
ఈసారి బెంగళూరులోని మురికివాడల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంలేదని, అపార్ట్ మెంట్ లు, విల్లాల్లో కోవిడ్ పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని తెలిసిందని బీబీఎంపీ ఆరోగ్యశాఖ డిప్యూటీ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేంద్ర అంటున్నారు. బెంగళూరు ఈస్ట్ ప్రాంతంలో నమోదు అయిన 25 కేసుల్లో 12 కేసులు ఢిల్లీ, అహమ్మదాబాద్, ముంబాయి నుంచి ప్రయాణించిన వారివే ఉన్నాయని అధికారులు అంటున్నారు.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications