Escape: టెర్రర్ గ్యాంగ్ రేప్, బుల్లెట్ రుచి చూపించిన బెంగళూరు పోలీస్, స్పాట్ లో వీరంగం, ఆరు మంది!
బెంగళూరు: విదేశీ యువతిని చిత్రహింసలు పెట్టిన రాక్షసులు ఆమెకు బతికుండగానే నరకం చూపించారు. ఢిల్లీ నిర్బయ ఘటన తరహాలోనే ఈ దారుణం జరగడం కలకలం రేపింది. నలుగురు కామాంధులు, ఇద్దరు మహిళలు కలిసి బాంగ్లాదేశ్ యవతి బతికుండగానే ఆమెకు నరకం చూపించారు. సామూహిక అత్యాచారం చేసిన తరువాత ఆ యువతి మర్మాంగంలో బీర్ బాటిల్ చెక్కేయడం, దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యింది. విచారణ కోసం సంఘటనా స్థానికి వెళ్లిన పోలీసుల మీద దాడి చేసిన నిందితులు తప్పించుకోవడానికి ప్రయత్నించారు. పోలీసుల జరిపిన కాల్పుల్లో ఇద్దరు నిందితులు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎన్ కౌంటర్ జస్ట్ మిస్ కాండంతో మిగిలిన నిందితుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

పోలీసులపై గ్యాంగ్ రేప్ కేసు నిందితుల దాడి
శుక్రవారం బెంగళూరు పోలీసులు బాంగ్లాదేశ్ యువతి గ్యాంగ్ రేప్ కేసు నిందితులు సాగర్, మోహమ్మద్, రిదాయ్ బాబు, హకీల్ ను రామమూర్తి నగరలోని అవులహళ్ళి సమీపంలోని మారగోండనహళ్ళిలోని ఇంటి దగ్గరకు పిలుచుకుని విచారణ మొదలుపెట్టారు. తరువాత నిందితులను చెన్నసంద్రలోని కనకనగర దగ్గరకు పిలుచుకుని వెళ్లారు. ఆ సమయంలో పోలీసుల అదుపులో ఉన్న నిందితులు పోలీసుల మీద రాళ్లతో దాడి చేసి వారి దగ్గర ఉన్న రివాల్వర్లు లాక్కొవడానికి విఫలయత్నం చేశారు.

బుల్లెట్ రుచి చూపించిన మామలు
ఒక్కసారిగా గ్యాంగ్ రేప్ కేసు నిందితులు దాడికి ప్రయత్నించడంతో వారిని లొంగిపోవాలని పోలీసులు హెచ్చరించారు. అయితే నిందితులు అందరూ పారిపోవడానికి ప్రయత్నించారు. పోలీసు అధికారులు వెంటనే కాల్పులు జరిపారు. ఆ సమయంలో రివాల్వర్ బుల్లెట్ లు రిదాయ్, సాగర్ కాళ్లలోకి దూసుకోవడంతో ఇద్దరూ కుప్పలకూలిపోయారు. వెంటనే నిందితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించిన పోలీసులు ఇద్దరికి చికిత్స చేయిస్తున్నారు. దేశం మొత్తం ఉలిక్కిపడేలా చేసిన బెంగళూరు గ్యాంగ్ రేప్ కేసు నిందితులపై పోలీసులు కాల్పలు జరపడం కలకలం రేపింది.

ఇంట్లో దారుణం
ఐటీ హబ్ బెంగళూరు నగరంలోని రామమూర్తి నగర సమీపంలోని అవులహళ్లికి కూతవేటు దూరంలో ఉన్న మారగోండనహళ్ళి ప్రాంతంలోని ఎన్ఆర్ ఐ లేఔట్ లోని ఓ ఇంటిలో బాంగ్లాదేశ్ కు చెందిన 22 ఏళ్ల యువతి మీద గ్యాంగ్ రేప్ జరిగింది. యువతి మీద గ్యాంగ్ రేప్ చేసే సమయంలో కామాంధులు వీడియో తీశారు. నలుగురు కామాంధులకు మరో ఇద్దరు మహిళలు సహకరించిన విషయం ఆ వీడియోలో కనపడుతోంది.

మర్మాంగంలో బీర్ బాటిల్ తో ?
యువతి మీద గ్యాంగ్ రేప్ చేసిన తరువాత ఆమె మర్మాంగంలో ( ప్రైవేట్ పార్ట్)లో కామాంధులు మద్యం బాటిల్ (బీర్ బాటిల్) చెక్కేసి ఆమెకు నరకం చూపించారని వెలుగు చూసింది. బాంగ్లాదేశ్ మీద గ్యాంగ్ రేప్ చేసి ఆమెను చిత్రహింసలు పెడుతున్న సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యింది. బెంగళూరులో ఈ దారుణం జరిగిందని వెలుగు చూడటంతో ఐటీ హబ్ ఉలిక్కిపడింది. గ్యాంగ్ రేప్ చేసిన నలుగురు కామాంధుల పక్కనే మరో ఇద్దరు మహిళలు ఉన్న విషయం వీడియోలో కనపడుతోంది.

ఆరు మందిని పట్టుకున్న పోలీసులు
బెంగళూరు గ్యాంగ్ రేప్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రామమూర్తి నగర పోలీసులు రంగంలోకి దిగారు. వీడియో ఆధారంగా బాంగ్లాదేశ్ కు చెందిన సాగర్, మోహమ్మద్ బాబా షేక్, రిదాయ్ బాబు, తెలంగాణలోని హైదరాబాద్ కు చెందిన హకీల్ అనే కామంధులను అరెస్టు చేశారు. ఇదే కేసులో బాంగ్లాదేశ్ కు చెందిన ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారైన మరో బాంగ్లాదేశ్ మహిళ చివరికి పోలీసులకు చిక్కిపోయిందని తెలిసింది.
Recommended Video

హైటెక్ స్కెచ్ కింగ్ పిన్ ఎవరు ?
బాంగ్లాదేశ్ నుంచి అక్రమంగా యువతులు, మహిళలను బెంగళూరు తీసుకు వచ్చి వారితో బలవంతంగా హైటెక్ వేశ్యవాటిక కేంద్రం నిర్వహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. గ్యాంగ్ రేప్ కు గురైన యువతిని కూడా బాంగ్లాదేశ్ నుంచి అక్రమంగా బెంగళూరు తీసుకు వచ్చి ఉంటారని అధికారుల విచారణలో వెలుగు చూసింది. ఈ హైటెక్ వేశ్యవాటిక కింగ్ పిన్ ఎవరు ? అని బెంగళూరు పోలీసులు ఆరా తీస్తున్నారు. మరో వైపు బాధితురాలి ఆచూకి తెలుసుకోవాలని పోలీసులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications