బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కర్ణాటకలో లాక్‌డౌన్ రూల్స్ ఈజీ: 50 శాతం కేపాసిటీతో పర్మిషన్, కానీ నో లిక్కర్

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ ఉధృతి తగ్గుముఖం పట్టింది. దీంతో రాష్ట్రాలు లాక్ డౌన్ క్రమంగా తీసివేస్తున్నాయి. తెలంగాణ తొలుత లాక్ డౌన్ ఎత్తివేసిన సంగతి తెలిసిందే. పొరుగు రాష్ట్రం కర్ణాటక కూడా లాక్ డౌన్ నిబంధనలను మరింత సులభతరం చేశాయి. కర్ణాటకలో కొన్ని జిల్లాల్లో లాక్ డౌన్ రూల్స్ వెసులుబాటు కల్పించారు. కొన్ని జిల్లాల్లో నిబంధనలు కొనసాగనున్నాయి.

16 జిల్లాల్లో సాయంత్రం 5 వరకు షాపులు తెరచి ఉంటాయి. ప్రజా రవాణా, బస్సులు, మెట్రో సర్వీసులు అందుబాటులో ఉంటాయి. అయితే అందులో 50 శాతం కేపాసిటీతో మాత్రం నడపాలని ప్రభుత్వం షరతు విధించింది. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో కూడా 50 శాతం కేపాసిటీ నిబంధనను తెరపైకి తీసుకొచ్చారు.

Karnataka eases lockdown rules: Hotels, gyms, resorts curbs relaxed

హోటల్స్, క్లబ్, రెసార్టెంట్లు తెరచేందుకు పర్మిషన్ ఇచ్చారు. అయితే అందులో ఏసీ వేయొద్దు, మద్యం సరఫరా చేయొద్దని నిబంధన పెట్టారు. జిమ్ కూడా 50 శాతం మందితో.. ఏసీ ఆన్ చేయకుండా నడుపుకోవచ్చు. లాడ్జ్, రిసార్ట్ కూడా 50 శాతం కేపాసిటీతో రన్ చేయొచ్చు. స్టేడియాల్లో క్రీడలు నిర్వహించుకోవచ్చని.. కానీ నిబంధనలను బ్రేక్ చేయొద్దని స్పష్టంచేశారు.

Recommended Video

COVID Third Wave | Easing COVID 19 Curbs | Oneindia Telugu

నైట్ కర్ఫ్యూ రాత్రి 7 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఉంటుందని స్పష్టంచేశారు. శుక్రవారం రాత్రి 7 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు వీకెండ్ కర్ఫ్యూ అమల్లో ఉండనుంది.

English summary
All shops can remain open till 5 pm in all these karnataka 16 districts. Public transport, buses and metro services are allowed to ply with 50 per cent capacity.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X