బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆరు నెలలవుతోన్నా నో గ్రోత్: డ్రగ్ కేసులో చర్యలు నిల్, ఏకంగా అసెంబ్లీలో ప్రకటించినా..

|
Google Oneindia TeluguNews

కర్ణాటకలో కలకలం రేపిన డ్రగ్స్ కేసు విచారణ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ఆర్నెళ్ల క్రితం వెలుగుచూసిన డ్రగ్స్ కేసు.. విచారణ కొనసాగు...తోంది. డ్రగ్స్ కేసు విచారణను ప్రభుత్వం ఛాలెంజ్‌గా తీసుకుంటోందని హోం మంత్రి బసవరరాజు బొమ్మే ఇదివరకే స్పష్టంచేశారు. జీవితాలను ఛిద్రం చేసే డ్రగ్స్‌పై పోరాటం కొనసాగిస్తామని.. ఇందుకోసం నిఘ మరింత పెంచామని పేర్కొన్నారు. డ్రగ్ సంబంధిత వ్యవహారాలను నిశీతంగా గమనిస్తున్నామని.. కఠిన చర్యలు తీసుకుంటామని మాజీ హోం మంత్రి కేజే జార్జ్ అడిగిన ప్రశ్నకు.. బొమ్మై గత బడ్జెట్ సమావేశాల్లో సమాధానం చెప్పారు. ఆన్సర్ ఇచ్చింది మార్చిలో.. సెప్టెంబర్ వచ్చింది.. కానీ ఇప్పటివరకు ఫలితం మాత్రం శూన్యం.

 కరోనా వైరస్ నేపథ్యంలో

కరోనా వైరస్ నేపథ్యంలో

కరోనా వైరస్ విజృంభిస్తోంది.. దీంతో డ్రగ్స్ కేసు పక్కకు పోయింది. కరోనా లాంటి వైరస్ వస్తుంటాయి.. వెళ్తుంటాయ్.. కానీ శాశ్వతమైన వైరస్ డ్రగ్స్.. కానీ వాటిపై చర్యలు కాగితాలకే పరిమితం అవుతున్నాయి. దీనికి సంబంధించి బలమైన ఆధారాలను సేకరించడంలో పోలీసులు విఫలమవడంతో న్యాయస్థానాల్లో కేసులు నిలవడం లేదు. డ్రగ్స్ నిర్వాహకులపై గుండా యాక్ట్ లాంటి కఠిన చట్టాలు అమలు చేయాలని విపక్ష నేతలు కోరుతుండగా.. హోం మంత్రి ఆ మేరకు చర్యలు తీసుకుంటారని పర్యాటక శాఖ మంత్రి సీటీ రవి పేర్కొన్నారు.

 1438 కేసులు

1438 కేసులు

డ్రగ్స్ కేసు ప్రతీ సారి అసెంబ్లీలో చర్చకు వస్తోందని వివరించారు. జనవరి నుంచి 1438 కేసులు నమోదు చేశామని.. 1798 మందిని అరెస్ట్ చేశామని వివరించారు. ఇందులో 25 మంది విదేశీయులు ఉన్నారని పేర్కొన్నారు. తమ అదుపులో ఉన్న నైజీరియన్ల వద్ద సరైన ధృవపత్రాలు కూడా లేవు అని తెలిపారు. వీరిలో చాలా మంది డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని గుర్తించామని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

Recommended Video

PM Modi Gives Call To Be “Vocal For Local Toys” || Oneindia Telugu
 నిఘా పటిష్టం

నిఘా పటిష్టం

డ్రగ్స్ నివారణ కోసం నిఘాను మరింత పటిష్టం చేయాలని మాజీ హోం మంత్రి ఎంబీ పాటిల్ కోరారు. దీంతోపాటు పోలీసుల టెక్నాలజీ కూడా అప్ గ్రేడ్ చేయాలని కోరారు. దేశంలో డ్రగ్స్ సరఫరా అయ్యే 272 జిల్లాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అందులో కర్ణాటక నుంచి బెంగళూరు అర్బన్, కోలార్, మైసూర్, ఉడుపి, రామనగర, కోడగు ప్రాంతాలు ఉన్నాయి.

English summary
karnataka has declared a war on drugs, following a rise in the number of related cases home minister basavaraj bommai said in budget session..but no action taken yet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X