బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Mysuru Gang Rape : మెడికల్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్-విషమంగా బాధితురాలి పరిస్థితి-ఇంకా పట్టుబడని నిందితులు

|
Google Oneindia TeluguNews

కర్ణాటకలోని మైసూరులో 23 ఏళ్ల మెడిసిన్ విద్యార్థినిపై సామూహిక అత్యాచార ఘటన సంచలనం రేపుతోంది. దాదాపు నలుగురైదుగురు వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితురాలి వాంగ్మూలం రికార్డు చేస్తే ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ ఘటన జరిగి 24 గంటలు గడిచినా ఇప్పటికైతే పోలీసులు నిందితులను పట్టుకోలేకపోయారు. ప్రత్యేక పోలీస్ బృందాలు నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెబుతున్నారు.

యూపీకి చెందిన మెడిసిన్ విద్యార్థిని..

యూపీకి చెందిన మెడిసిన్ విద్యార్థిని..

బాధితురాలు ఉత్తరప్రదేశ్‌కి చెందిన యువతిగా తెలుస్తోంది. ప్రస్తుతం కర్ణాటకలోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఆమె మెడిసిన్ చదువుతోంది. మంగళవారం(ఆగస్టు 23) సాయంత్రం తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఆమె చాముండి హిల్స్‌కి వెళ్లింది.అక్కడి నుంచి తిరిగొస్తున్న క్రమంలో... మార్గమధ్యలో లలితాద్రిపురా సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో ఓ గ్యాంగ్ వారిని అడ్డగించారు. మొదట వారి నుంచి డబ్బు డిమాండ్ చేశారు. వారి వద్ద పెద్దగా డబ్బు లేదని తెలిసి మొదట దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆ యువతిని సమీపంలోని అడవిలోకి లాక్కెళ్లి గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు.

అర్ధరాత్రి దాటాక ఆస్పత్రికి...

అర్ధరాత్రి దాటాక ఆస్పత్రికి...

రాత్రి 8గంటల సమయంలో గ్యాంగ్ రేప్ జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆ తర్వాత కొద్ది గంటలకు బాధితురాలి బాయ్‌ఫ్రెండ్ అలనహళ్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఘటనపై ఫిర్యాదు చేశాడని తెలిపారు. దీంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని వెంటనే సంఘటనా స్థలాన్ని సందర్శించినట్లు చెప్పారు. అర్ధరాత్రి 1.30గంటల సమయంలో ఆ ఇద్దరినీ ఆస్పత్రిలో చేర్చినట్లు తెలిపారు. ఆ గ్యాంగ్ చేసిన దాడిలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయని పేర్కొన్నారు. బాధితురాలి ‌బాయ్‌ఫ్రెండ్ స్టేట్‌మెంట్ రికార్డ్ చేశామని... బాధితురాలి స్టేట్‌మెంట్ ఇంకా రికార్డ్ చేయాల్సి ఉందని వెల్లడించారు.

సిట్ బృందం ఏర్పాటు...

సిట్ బృందం ఏర్పాటు...

ఈ ఘటనపై మైసూరు హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర మాట్లాడుతూ...'వాళ్లిద్దరు విద్యార్థులు.రాత్రి 7.30గంటల సమయంలో హెలిప్యాడ్ సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లారు. ఆ ఇద్దరినీ వెంబడించిన గ్యాంగ్ ఈ ఘాతుకానికి పాల్పడింది. అర్ధరాత్రి సమయంలో ఇద్దరినీ ఆస్పత్రిలో చేర్చారు. ఆస్పత్రి నుంచి మెమో స్వీకరించాం. ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. నిందితులను త్వరగా పట్టుకునేందుకు సిట్ బృందాన్ని ఏర్పాటు చేశాం. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికైతే ఎవరినీ అరెస్ట్ చేయలేదు. పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకోవాలని ఆదేశించాం. ఓ అడిషనల్ డీజీపీ అధికారిని మైసూరుకు పంపించాం.' అని జ్ఙానేంద్ర వెల్లడించారు.

సీఎం బసవరాజ్ రియాక్షన్...

సీఎం బసవరాజ్ రియాక్షన్...


కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మాట్లాడుతూ... నిందితులను త్వరగా పట్టుకోవాలని డీజీపీ ప్రవీణ్ సూద్‌ను ఆదేశించినట్లు తెలిపారు. నిందితులు ఎంతటివారైనా సరే వారిపై కఠిన ర్యలు తీసుకోవాల్సిందేనని చెప్పానన్నారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్నట్లుగా అనుమానిస్తున్న ఓ మేషన్ వర్కర్‌ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం బాధితురాలు,ఆమె బాయ్‌ఫ్రెండ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితురాలు కోలుకుంటే ఆమె స్టేట్‌మెంట్ రికార్డ్ చేసే అవకాశం ఉంది.

గతంలో సంచలనం రేపిన ఢిల్లీ పారామెడికల్ స్టూడెంట్‌పై గ్యాంగ్ రేప్...

గతంలో సంచలనం రేపిన ఢిల్లీ పారామెడికల్ స్టూడెంట్‌పై గ్యాంగ్ రేప్...

తొమ్మిదేళ్ల క్రితం 2012లో దేశ రాజధాని ఢిల్లీలో పారామెడికల్ స్టూడెంట్‌పై గ్యాంగ్ రేప్ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో బాధితురాలిగా నిర్భయగా నామకరణం చేశారు. 23 ఏళ్ల ఆ పారామెడికల్ స్టూడెంట్ తన స్నేహితుడితో కలిసి రాత్రిపూట బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో.. బస్సు డ్రైవర్ రామ్‌సింగ్ సహా ఆరుగురు వ్యక్తులు ఆమెపై గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారు. ఆమె స్నేహితుడిపై ఇనుప రాడ్లతో దాడి చేశారు. ఆమె జననాంగాల్లో ఇనుప రాడ్లు జొప్పించి చిత్రహింసలకు గురిచేశారు. అనంతరం ఆమెను,అతని స్నేహితుడిని కదులుతున్న బస్సు నుంచి బయటకు విసిరేశారు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలిని మొదట ఢిల్లీ ఆస్పత్రిలో,ఆ తర్వాత సింగపూర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ బాధితురాలు మృతి చెందింది.

నిర్భయ నిందితులకు ఉరిశిక్ష....

నిర్భయ నిందితులకు ఉరిశిక్ష....

ఈ కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకరైన రామ్ సింగ్ తీహార్ జైలులో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పోలీసులు అతను ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. నిందితుల్లో ఒకరు మైనర్ కావడంతో... జువైనల్ హోమ్ నుంచి అతన్ని విడుదల చేశారు. మిగతా నలుగురు నిందితులను మార్చి 20,2020న తీహార్ జైల్లో ఉరితీశారు. నిర్భయ ఘటన జరిగిన ఎనిమిదేళ్లకు నిందితులకు ఉరిశిక్ష పడింది. అంతకుముందు,నిందితులు పలుమార్లు రివ్యూ పిటిషన్లతో ఉరిశిక్షను వాయిదా పడేలా చేశారు. అందరూ ఒకేసారి కాకుండా... ఒక్కొక్కరు ఒక్కోసారి కోర్టును ఆశ్రయించడంతో ఉరిశిక్ష వాయిదా పడుతూ వచ్చింది. నిందితుల క్షమాభిక్షను రాష్ట్రపతి తిరస్కరించడంతో ఎట్టకేలకు ఉరిశిక్ష పడింది.

సంచలనం రేపిన హత్రాస్

సంచలనం రేపిన హత్రాస్


గతేడాది ఉత్తరప్రదేశ్‌లో హత్రాస్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. దళిత(వాల్మీకి) యువతిపై కొంతమంది అగ్రకుల యువకులు అత్యాచారానికి పాల్పడి ఆమెపై దాడి చేశారు. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. అయితే ఆమె మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించకుండా... పోలీసులే తీసుకెళ్లి దహన సంస్కారాలు నిర్వహించారు. దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఆధారాలు మాయం చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. సీఎం ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది.

Recommended Video

Karnataka Scorpion Festival : విష పురుగులతో గేమ్స్.. భారీగా జనాలు || Oneindia Telugu

English summary
Gang-rape on a 23-year-old MBA student in Mysore, Karnataka-Police suspect that about four to five people involved in rape incident. Currently her health condition seems to be critical.Police recorded her male friend statement,and SIT formed to inquiry this incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X