కర్ణాటక బీజేపీ చీఫ్ నళిన్‌కు కరోనా - రాష్ట్రంలో కొత్తగా 8324 కేసులు - ఒక్క బెంగళూరులోనే మూడు వేలు

కొత్త కేసులు, మరణాల పరంగా కర్ణాటకలో పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించిన వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,324 కేసులు, 115 మరణాలు నమోదయ్యాయి. తాజాగా కరోనా బారినపడిన వాళ్లలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌కుమార్ కటీల్‌ కూడా ఉన్నారు.

దేశంలోకి కరోనా ప్రవేశించిన తొలినాళ్లలో కర్ణాటకలో పరిస్థితి అదుపులోనే ఉన్నా, గడిచిన రెండు మూడు నెలల్లో మాత్రం వైరస్ వేగంగా వ్యాప్తి చెందింది. కొత్తగా నమోదైన 8,324 కేసుల్లో ఒక్క బెంగళూరు సిటీనుంచే 3వేల కేసులు ఉండటం గమనార్హం. కొత్తవాటితో కలిపి కర్ణాటకలో మొత్తం కేసుల సంఖ్య 3,27,076కు, మరణాల సంఖ్య 5,438కు పెరిగినట్లయింది.

Karnataka: state BJP chief Nalin Kumar tests positive for COVID-19, 8,324 fresh cases

బెంగళూరు అర్బన్ జిల్లాలో 2,993 కేసులు వెలుగు చూడగా, 25 మంది చనిపోయారు. ఫలితంగా నగరంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,24,442కు పెరిగింది. కరోనా కారణంగా నగరంలో ఇప్పటి వరకు 1,911 మంది మరణించినట్టు అధికారులు తెలిపారు. దక్షిణభారతంలో చెన్నై తర్వాత మోస్ట్ ఎఫెక్టెడ్ నగరంగా బెంగళూరు నిలిచింది. ఇదిలా ఉంటే,

Recommended Video

    Unlock 4.0 Guidelines : తెరుచుకునేవి తెరుచుకోనివి ఏంటంటే..! || Oneindia Telugu

    కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు నళిన్‌కుమార్ కటీల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఆదివారం ట్విట్టర్ లో తెలియజేశారు. ఎలాంటి లక్షణాలు లేకుండానే తానకు పాజిటివ్ వచ్చిందని, డాక్టర్ల సలహా మేరకు ఆసుపత్రిలో చేరానన్న నళిన్ కుమార్.. గడిచిన కొద్ది రోజుల్లో తనతో కాంటాక్ట్ అయినవాళ్లంతా ముందు జాగ్రత్తగా ఐసోలేషన్‌లో ఉండి కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+