వర్క్ ఫ్రం హోం.. 2022 డిసెంబర్ వరకు, కర్ణాటక సర్కార్ రిక్వెస్ట్
కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. కేసులు తగ్గుతూ.. పెరుగుతూ వస్తోన్నాయి. దీంతో ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోం గడువు పొడగించాయి. వర్క్ ఫ్రం హోం గడువు పెరుగుతూనే ఉంది. వచ్చే ఏడాది డిసెంబర్ వరకు ఇంటి నుంచి పనిచేయాలని బెంగళూరు ఐటీ కంపెనీలకు కర్ణాటక ప్రభుత్వం స్ఫష్టంచేశాయి. ఇందుకు గల కారణం కూడా వివరించింది. ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణ పనులు.. బెంగళూరు మెట్రో పనుల వల్ల వర్క్ ఫ్రం హోం గడువు పెంచాలని స్పష్టంచేసింది.
ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాప్ట్‌వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (నాస్కామ్)కు లేఖ రాసిందని డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తెలియజేసింది. సెంట్రల్ సిల్క్ బోర్డు నుంచి కేఆర్ పురం వరకు ఔటర్ రింగ్ రోడ్ పనులు జరుగుతున్నాయని వివరించింది. దీంతో ఏడాదిన్నర నుంచి రెండేళ్ల వరకు జనం రద్దీ ఉండొద్దని అనుకుంటోంది. వర్క్ ఫ్రం హోం లేకుంటే.. చాలా రద్దీ ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఔటర్ రింగ్ రోడ్ కూడా ఆరు లైన్లతో నిర్మిస్తున్నారు.

ఒకవేళ ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు కార్యాలయాలకు రావాలని కోరితే మాత్రం ట్రాఫిక్ ఇబ్బందులు తప్పవు. దీంతో నిర్మాణ పనులకు అంతరాయం కలుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణ పనుల వల్ల బసుల కోసం ప్రత్యేకంగా లైన్.. ఇతర వాహనాలను మరో దారి కూడా ఏర్పాటు చేశారు. దీంతో నిర్మాణ పనులకు ఇబ్బందులు లేకుండా జరుగుతాయి. దీంతో వచ్చే ఏడాది డిసెంబర్ వరకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని కోరుతున్నారు. ఈ మేరకు కర్ణాటక సర్కార్ ఐటీ/ బీపీవో కంపెనీలను కోరింది.












Click it and Unblock the Notifications