బీజేపీతో సహ కాంగ్రెస్ కు కూడా ఎన్నికల ప్రచారం చేస్తారా ఈ హీరో? ఏం జరుగుతోంది?
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏమైనా జరిగే అవకాశం ఉందని వెలుగు చూస్తోంది. కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు కాంగ్రెస్ లో చేరడం. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు బీజేపీలో చేరిపోయారు. ఇదే సమయంలో ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి నాయకులు జంప్ అవుతూ వస్తున్నారు.
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ కి సంపూర్ణ మద్దతు ప్రకటించిన కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ బీజేపీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. సీఎం బసవరాజ్ బోమ్మయ్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న హీరో సుదీప్ ఆ రోజు సీఎం బోమ్మయ్ సొంత నియోజక వర్గం అయిన శిగ్లావిలో ఎన్నిక ప్రచారం చేశారు.

ఇప్పుడు కర్ణాటకలోని పలు నియోజక వర్గాల్లో హీరో సుదీప్ బీజేపీ నాయకులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని హీరో సుదీప్ సుడిగాలి పర్యటనలో ఉన్నారు. ఇదే సమయంలో హీరో సుదీప్ కొంత మంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు మద్దతుగా ఎన్నిలక ప్రచారం చేస్తారని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.
కర్ణాటకలో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న హీరో సుధీప్ బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీలోని కొంత మంది నాయకుల తరపున ఎన్నికల ప్రచారం చేసే అవకాశం ఉందని వెలుగు చూడటం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
ఇదే సమయంలో కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్, హీరో సుదీప్ కలిసి చాలా క్లోజ్ గా తీసుకున్న ఫోటోలను కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మొత్తం మీద హీరో సుదీప్ బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీకి ఎన్నిలక ప్రచారం చేస్తారా ?, లేదా ? అనే వియషం వేచిచూడాలి.
ఇప్పటికే బీజేపీ తరుపున ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతన్న హీరో సుదీప్ ను తప్పుదోవ పట్టించడానికి కొందరు నాయకులు ఎత్తులు వేస్తున్నారని, అలాంటి నాయకుల కలలు నెరవేరవని కొందరు బీజేపీ నాయకులు అంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు తాను ప్రచారం చెయ్యనని హీరో సుదీప్ తో పాటు ఆయన అభిమానులు ఎక్కడా ఖండించకపోవడంతో సామాన్య ప్రజలు అయోమయంలో పడిపోయారు.












Click it and Unblock the Notifications