• search
 • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Khiladi lady: ద్రౌపదికి ఐదు మంది, ప్రియాకు ఆరు మంది భర్తలు, నువ్వేకావాలి, క్యూలో ప్రియులు!

|

బెంగళూరు/ మంగళూరు: మహాభారతంలో ద్రౌపదికి ఐదు మంది భర్తలు ఉన్న విషయం తెలిసిందే. పంచ పాండవులను పెళ్లి చేసుకున్న ద్రౌపది పతివ్రత అయినప్పుడు తాను ఐదు మందిని పెళ్లి చేసుకుంటే తప్పు ఏ ముందని ప్రియా అనే మహిళ భావించింది. ఐదు మందిని పెళ్లి చేసుకున్న ప్రియా తనకంటే 16 ఏళ్ల చిన్నవాడిని ఆరో పెళ్లి చేసుకుని ప్రియా ప్రియతమా రాగాలు అంటూ ఎంజాయ్ చేసింది. అయితే పరిస్థితులు అనుకూలించక ఆలిబాబా అరడజను భర్తలు ఒక్కచోట చేరడంతో పంచాతీ పెద్దిది అయ్యింది.

  Watch: Mother And Cop At A Time! | Lady Constable Performs Duties With 1 Year Kid | Oneindia Telugu

  ఆరో భర్తను వదలిపెట్టడానికి ప్రియా, భార్యను వదిలిపెట్టడానికి ఆరో భర్త చంద్రుడు ససేమిరా అనడంతో పంచాయితీలు చేసిన పోలీసులు, కుటుంబ సభ్యులు షాక్ కు గురైనారు. తాను ఏ తప్పు చెయ్యలేదు, నా మీదకు కేసు ఎందుకు పెడుతున్నారు అంటూ ప్రియా ఎదురుతిరగడంతో పోలీసులకు ఎక్కడో కాలిపోవడంతో అసలు కథ మొదలైయ్యింది.

  TikTok: డబుల్ బెడ్ రూమ్ హౌస్, తల్లి టీ 20, కూతురు వన్ 'డే'మ్యాచ్ లు, ఇంట్లోనే లవర్స్, చివరికి!

  ప్రియా కంటే 16 ఏళ్ల చిన్నోడు

  ప్రియా కంటే 16 ఏళ్ల చిన్నోడు

  కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాకు కంబినహళ్ళి గ్రామానికి చెందిన చంద్రు అలియాస్ చంద్రుడు (22) అనే యువకుడు ప్రియా (38) అనే మహిళను వెంటపెట్టుకుని బెంగళూరులోని పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. మేము ఇద్దరం ప్రేమ వివాహం చేసుకున్నామని, మా కులాలు వేరని, వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్న ఐదు మంది మమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తున్నారని, మీరే మాకు రక్షణ కల్పించాలని, మా ప్రాణాలు కాపాడాలని ప్రియా, చంద్రూ పోలీసులకు మనవి చేశారు.

  లవ్ మ్యారేజ్.... ఫ్యాక్షన్ గొడవలు కాదు కదా?

  లవ్ మ్యారేజ్.... ఫ్యాక్షన్ గొడవలు కాదు కదా?

  కులాలు, మతాలు వేరైతే సర్వసాదారణంగా ప్రేమ పెళ్లి చేసుకున్న వారికి అమ్మాయి లేదా అబ్బాయి కుటంబ సభ్యుల నుంచి వ్యతిరేకత ఉంటుందని, ఇలా వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఐదు మంది ప్రియా, చంద్రులను ఎందుకు చంపాలని ప్రయత్నిస్తున్నారని చిక్కమగళూరు జిల్లా పోలీసులు ఆరా తీశారు. ప్రియా, చంద్రుకు టీ తెప్పించి ఇచ్చిన పోలీసులు వాళ్లు టీ తాగిన తరువాత ఇప్పుడు చెప్పండి, ఏమి జరిగింది ? అంటూ ఆరా తీశారు. ప్రియా చెప్పిన స్టోరీ విన్న పోలీసులు మూడు బిందెల నీళ్లు తాగేశారు.

  సార్.... చంద్రుడు ఆరో మొగుడు

  సార్.... చంద్రుడు ఆరో మొగుడు

  తాను ఇంతకు ముందు ఐదు మందిని పెళ్లి చేసుకున్నానని, వారితో కాపురం చెయ్యడం తనకు ఇష్టం లేదని, అందుకే ఇప్పుడు చంద్రూను ప్రేమించి అతన్ని ఆరో భర్తను చేసుకున్నానని ప్రియా అమాయకంగా చెప్పింది. ఈమె ఏమైనా బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా అనుకుంటున్నావా ?, నీకంటే 16 ఏళ్లు వయసు ఎక్కువ ఉన్న ఈమెను పెళ్లి చేసుకుని ఇప్పుడు భద్రత కల్పించాలని ఇక్కడికి వచ్చావా? అంటూ పొలీసులు చంద్రూ అలియాస్ చంద్రుడి మీద మండిపడ్డారు. సార్ అవన్ని నాకు తెలీవు, ప్రియా లేకపోతే నేను చచ్చిపోతాను అంటూ చంద్రూ మొండికేశాడు.

  క్యూలో నిలబడిన ఆరు మంది భర్తలు

  క్యూలో నిలబడిన ఆరు మంది భర్తలు

  ప్రియా తెలిపిన వివరాల ఆధారం పోలీసులు ఆమె ఐదు మంది భర్తల వివరాలు, ఫోన్ నెంబర్లు తీసుకుని వారిని సంప్రధించారు. ప్రియా ఇంతకు ముందే పెళ్లి చేసుకున్న బసవరాజు, కిరణ్, రమేష్, బెంగళూరు నివాసి దుక్కరం, రాజును పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. ప్రియా ఆరు మంది భర్తలు వరుసగా ఆలీబాబా అరడజను దొంగలు టైపులో వరుసగా నిలబడ్డారు. ఆరు మంది మాకు ప్రియానే కావాలి అంటూ తేల్చిచెప్పడంతో పోలీసులు షాక్ కు గురైనారు. కరోనా కాలంలో ఇదెక్కడి పంచాయితీరా దేవుడా ? అంటూ పోలీసులు అయోమయానికి గురై తలలు పట్టుకున్నారు.

  ఒకే ఒక్కడు కావాలి...... అది చంద్రుడే

  ఒకే ఒక్కడు కావాలి...... అది చంద్రుడే

  ప్రియా పెళ్లి చేసుకున్న ఐదు మందిలో నలుగురు చిక్కమగళూరు జిల్లాకు చెందిన వాళ్లే. ఆ నలుగురు బెంగళూరులో వివిద ప్రాంతాల్లో ఉంటున్నారు. ఒక్క వ్యక్తి మాత్రమే బెంగళూరు చెందినవాడు. ఆరో భర్తది కూడా చిక్కమగళూరు జిల్లానే. ప్రియాకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లలను పుట్టింటిలో వదిలిపెట్టిన ప్రియా వరుసగా ఆరు మందిని పెళ్లి చేసుకుందని, ఎవ్వరికీ చట్టపరంగా విడాకులు ఇవ్వలేదని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

  ప్రియా కామాంధురాలు.... అయినా ఓకే

  ప్రియా కామాంధురాలు.... అయినా ఓకే

  పోలీసులు ఆరో భర్త చంద్రు సోదరిని పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. ప్రియా ఇంత వరకు ఎవ్వరికి విడాకులు ఇవ్వలేదని, నువ్వే ఆమెతో కాపురం చెయ్యడానికి మేము అంగీకరించమని, ఆమె కామాంధురాలని, ఇప్పుడు ఏడో పెళ్లి చేసుకోదని గ్యారెంటీ ఏమిటని చంద్రును ఆమె సోదరి, పోలీసులు నిలదీశారు. నాకు ప్రియా తప్పా ఎవ్వరూ వద్దు, ఆమె నాకు కావాలని చంద్రు పట్టుబట్టాడు. పంచాయితీ తెగకపోవడంతో పోలీసులకు ఎక్కడో కాలిపోయింది. ఐదు మంది భర్తలకు విడాకులు ఇవ్వకుండా ఆరో పెళ్లి చేసుకుందని, భర్తలను మోసం చెయ్యడమే కాకుండా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుందని ఆరోపిస్తూ పోలీసులు ప్రియా మీద కేసు నమోదు చేశారు.

  నేను ఏమైనా మర్డర్ చేశానా ? పెళ్లి చేసుకున్నా !

  నేను ఏమైనా మర్డర్ చేశానా ? పెళ్లి చేసుకున్నా !

  నేను ఎవ్వరిని హత్యలు చెయ్యలేదని, పెళ్లిళ్లు మాత్రమే చేసుకున్నానని, తన భర్తలు తనను సక్రమంగా చూసుకోకపోవడం వలనే వారితో విడిపోయి చంద్రూను పెళ్లి చేసుకున్నానని, తాను ఏ తప్పు చెయ్యలేదని, నా మీద కేసు ఎందుకు నమోదు చేస్తారని ప్రియా ఎదురుతిరిగింది. తనకు ప్రియానే కావాలని మొండికి కుర్చుకున్న చంద్రుకు కౌన్సిలింగ్ ఇస్తున్న పోలీసులు ప్రియా మీద కేసు నమోదు చేసి ఇప్పుడు కోర్టును ఆశ్రయించడానికి సిద్దం అయ్యారు. కొన్ని సంవత్సరాల క్రితం తమిళ, తెలుగు బాషాల్లో విడుదలైన కామిడి కింగ్ వడివేలు సినిమాలో వడివేలు అచ్చం ఆరు మంది మహిళలను ఒకరికి తెలీకుండా ఒకరిని పెళ్లిళ్లు చేసుకుంటాడో అచ్చం ఆ సినిమా లాగే ఈ ప్రియా స్టోరీ రివర్స్ లో ఉందని పోలీసులు అంటున్నారు.

  English summary
  Khiladi lady: Bengaluru police faces a comedy scene which has come in Vadivel film, already 5 times married woman again marries 6 th one in Karnataka.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X