బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Khiladi lady: బ్యాంకులో క్యాషియర్ మేడమ్ కు ప్రియుడు, ఏటీఎం పాస్ వర్డ్ లీక్, రూ. 16 లక్షలు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ విజయపుర: బ్యాంకులో క్యాషియర్ ఉద్యోగం చేస్తున్న మహిళ ప్రతిరోజూ బ్యాంకుకు వెళ్లి ఆమె పని ఆమె చేసుకుంటూ ఇంటికి వెలుతోంది. బ్యాంకులో పని చేస్తున్న లేడీకి ఓ ప్రియుడు ఉన్నాడు. అప్పుడప్పుడు ప్రియుడు బ్యాంకుకు వెళ్లి అతని ప్రియురాలిని కలిసి తరువాత ఆమెను బయటకు పిలుచుకుని వెళ్లి ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రియుడి మోజులో పడిపోయిన బ్యాంకు క్యాషియర్ అతను ఏమి అడిగినా కాదనకుండా ఇవ్వడం మొదలుపెట్టింది. ఓ మంచిమూడ్ లో ఉన్న సమయంలో ప్రియుడు ఆమె పని చేస్తున్న బ్యాంకు ఏటీఎం యంత్రం పాస్ వర్డ్ అడిగాడు. మొదట బెట్టు చేసిన లేడీ తరువాత ప్రియుడు అడిగిన ఏటీఎం యంత్రం పాస్ వర్డ్ ఇచ్చేసింది. కొన్ని రోజుల తరువాత ఆ బ్యాంకు ఏటీఎం యంత్రంలో రూ. 16 లక్షలు లూటీ చేశాడు. ప్రముఖ బ్యాంకు ఏటీఎం యంత్రాన్ని పగలగొట్టకుండా రూ. 16 లక్షలు లూటీ కావడంతో బ్యాంకు అధికారులు, పోలీసులు హడలిపోయారు. రంగంలోకి దిగిన పోలీసులు అనేక కోణాల్లో విచారణ చెయ్యగా అసలు మ్యాటర్ బయటకు రావడంతో అందరూ బిత్తరపోయారు.

Condition: లవర్స్ పెళ్లికి అందరూ గ్రీన్ సిగ్నల్, సినిమా స్టైల్లో కండీషన్, లాడ్జ్ లో లవర్స్ ఒకే ఫ్యాన్ కు !Condition: లవర్స్ పెళ్లికి అందరూ గ్రీన్ సిగ్నల్, సినిమా స్టైల్లో కండీషన్, లాడ్జ్ లో లవర్స్ ఒకే ఫ్యాన్ కు !

బ్యాంకులో క్యాషియర్ ఉద్యోగం

బ్యాంకులో క్యాషియర్ ఉద్యోగం


కర్ణాటకలోని విజయపుర జిల్లాలోని ముద్దేబిహాళలో యూనియన్ బ్యాంకు ఉంది. ఈ బ్యాంకులో మిస్మితా శరాబి అలియాస్ మిస్మితా అనే మహిళ క్యాషియర్ గా ఉద్యోగం చేస్తున్నది. బ్యాంకులో క్యాషియర్ ఉద్యోగం చేస్తున్న మిస్మితా శరాబి ప్రతిరోజూ బ్యాంకుకు వెళ్లి ఆమె పని ఆమె చేసుకుంటూ సాయంత్రం ఆమె ఇంటికి వెలుతోంది.

ప్రియుడు ఏమి అడిగినా ఇచ్చేస్తున్న మేడమ్

ప్రియుడు ఏమి అడిగినా ఇచ్చేస్తున్న మేడమ్

బ్యాంకులో క్యాషియర్ గా చక్కగా పని చేసుకుంటున్న మిస్మితా మేడమ్ కు మంజునాథ్ అనే ప్రియుడు ఉన్నాడు. అప్పుడప్పుడు ప్రియుడు మంజునాథ్ యూనియన్ బ్యాంకుకు వెళ్లి అతని ప్రియురాలు మిస్మితాను కలిసి తరువాత ఆమెను బయటకు పిలుచుకుని వెళ్లి ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రియుడు మంజునాథ్ మోజులో పడిపోయిన బ్యాంకు క్యాషియర్ మిస్మితా అతను ఏమి అడిగినా కాదనకుండా ఇవ్వడం మొదలుపెట్టింది.

మంచి మూడ్ లో సార్ ఏమి అడిగాడంటే ?

మంచి మూడ్ లో సార్ ఏమి అడిగాడంటే ?


కొంతకాలం క్రితం మిస్మితా, ఆమె ప్రియుడు మంజునాథ్ ఏకాంతంగా కలుసుకున్నారు. ఆ సమయంలో తన ప్రియురాలు మిస్మితా మంచి మూడ్ లో ఉందని మంజునాథ్ గుర్తించాడు. మంచిమూడ్ లో ఉన్న సమయంలో ప్రియుడు మంజునాథ్ అతని ప్రియురాలు మిస్మితా పని చేస్తున్న యూనియన్ బ్యాంకు ఏటీఎం యంత్రం పాస్ వర్డ్ అడిగాడు.

ప్రియుడి వ్యామోహంలో ?

ప్రియుడి వ్యామోహంలో ?


మొదట బెట్టు చేసిన మిస్మితా తరువాత ప్రియుడు మంజునాథ్ అడిగిన ఏటీఎం యంత్రం పాస్ వర్డ్ ఇచ్చేసింది. అంతే ప్రియురాలు మిస్మితా నుంచి బ్యాంకు ఏటీఎం యంత్రం పాస్ వర్డ్ సేకరించిన మంజునాథ్ అందులోని డబ్బు లూటీ చెయ్యాలని స్కెచ్ వేశాడు. మంజునాథ్ అతని స్నేహితులను కలిసి బ్యాంకు ఏటీఎం యంత్రంలో నగదు లూటీ చెయ్యాలని చెప్పాడు.

ఒకేసారి రూ. 16 లక్షలు స్వాహా

ఒకేసారి రూ. 16 లక్షలు స్వాహా


బ్యాంకు క్యాషియర్ మిస్మితా ప్రియుడు మంజునాథ్ అతని స్నేహితులు కలిసి పాస్ వర్డ్ ఉపయోగించి ఏటీఎం యంత్రంలో ఒకేసారి రూ. 16 లక్షలు లూటీ చేశారు. విషయం తెలుసుకున్న యూనియన్ బ్యాంకు అధికారులు హడలిపోయి పోలీసులకు సమాచారం ఇచ్చారు. విజయపుర జిల్లా ఎస్పీ ఆనంద్ కుమార్ తోపాటు ముద్దేబిహాళ పోలీసులు రంగంలోకి దిగి ఏటీఎం యంత్రం ఉన్న చోట ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు పరిశీలించారు.

 బ్యాంకు సిబ్బంది ప్రమేయం ఉందని !

బ్యాంకు సిబ్బంది ప్రమేయం ఉందని !


బ్యాంకు సిబ్బంది సహకారం లేకుండా ఏటీఎం యంత్రం పాస్ వర్డ్ ఉపయోగించి నగదు లూటీ చెయ్యడం సాధ్యం కాదని పోలీసులు గుర్తించారు. బ్యాంకులో పని చేస్తున్న ఉద్యోగులు అందరిని పోలీసులు విచారణ చేశారు. ఇదే సమయంలో బ్యాంకు క్యాషియర్ మిస్మితా అనుమానాస్పదంగా ప్రవర్తించడం, పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు ఆమె మీద అనుమానం వచ్చింది.

 మ్యాటర్ మొత్తం చెప్పిన మేడమ్

మ్యాటర్ మొత్తం చెప్పిన మేడమ్


మిస్మితాను అదుపులోకి తీసుకుని విచారణలో చేస్తే తన ప్రియుడు మంజునాథ్ కు తానే ఏటీఎం యంత్రం పాస్ వర్డ్ ఇచ్చానని అంగీకరించిందని విజయపుర జిల్లా ఎస్పీ ఆనంద్ కుమార్ మీడియాకు చెప్పారు. బ్యాంకు క్యాషియర్ మిస్మితా, ఆమె ప్రియుడు మంజునాథ్, అతని స్నేహితుడు సిపాయి విఠలతో పాటు మొత్తం 7 మందిని అరెస్టు చేశారు.

ఉద్యోగం పోయింది..... ప్రియుడి కోసం జైల్లో మేడమ్

ఉద్యోగం పోయింది..... ప్రియుడి కోసం జైల్లో మేడమ్

నిందితుల నుంచి రూ. 13 లక్షల క్యాష్ తో పాటు ఐదు స్మార్ట్ ఫోన్లు, వాహనాలతో సహ మొత్తం రూ. 18 లక్షల విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నామని విజయపుర జిల్లా ఎస్పీ ఆనంద్ కుమార్ మీడియాకు చెప్పాడు. ప్రియుడితో కలిసి బ్యాంకు లేడీ క్యాషియర్ మిస్మితా రూ. 16 లక్షలు లూటీ చేసిందని వెలుగు చూడటం కలకలం రేపింది. ప్రియుడి మోజులో పడిన మిస్మితా ఉద్యోగం పోవడమే కాకుండా ఆమె జైలుపాలైయ్యింది. మిస్మితా ప్రియుడు మంజునాథ్ కు ఇంకా కొందరు సహాయం చేశారని వెలుగు చూసిందని, వారి కోసం గాలిస్తున్నామని విజయపుర జిల్లా పోలీసు అధికారులు తెలిపారు. గతంలో కూడా బ్యాంక్ క్యాషియర్ మిస్మితా ఇలాంటి ట్రిక్స్ ప్లే చేసిందా ? అని పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు.

English summary
Khiladi lady: Bank Cashier given password to lover for ATM robbery near Vijayapura in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X