Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Khiladi: ఇంటి ఓనర్ కు తియ్యటి మాటలు, రూ. 47 లక్షల క్యాష్, బంగారు, నైస్ గా నేపాల్ లేడీ, ప్లాన్ బి!

బెంగళూరు: వ్యాపారం చేస్తున్న వ్యక్తి అతని భార్య, పిల్లలతో కలిసి ఐటీ హబ్ లో విలాసవంతమైన ఇంటిలో నివాసం ఉంటున్నాడు. ఆ వ్యాపారవేత్త ఇంటిలో లక్షల రూపాయల నగదు నిల్వ ఉంటుంది. ఇంటికి సెక్యూరిటీ ఉండాలని ఓ వ్యక్తిని సెక్యూరిటీ గార్డుగా పెట్టారు. కొంతకాలానికి సెక్యూరిటీ గార్డు భార్య ఆ వ్యాపారి ఇంటిలో ఇంటి పని చెయ్యడం మొదలు పెట్టింది. దంపతులు నివాసం ఉండటానికి ఇంటి ఔట్ హౌస్ ఇచ్చారు. దంపతులు ఇద్దరూ అక్కడే ఉంటూ పని చేసుకుని వ్యాపారి కుటుంబానికి నమ్మకంగా ఉన్నారు. వ్యాపారి ఇంటిలో లక్షల్లో లిక్విడ్ క్యాష్ ఉంటుందని, ఇంట్లో భారీగా బంగారు నగలు ఉన్నాయని సెక్యూరిటీ గార్డు భార్య గుర్తించింది.

ఎలాగైనా వ్యాపారి ఇల్లు లూటీ చెయ్యాలని కిలాడీ భార్య, కేటుగాడు అయిన భర్త స్కెచ్ వేశారు. ఒకే రోజు భర్త పెళ్లి, భార్య, ఇద్దరు కూతుర్లు నిశ్చితార్థానికి వెళ్లారు. ఇంట్లో సీసీటీవీ కెమెరాలు మొత్తం ఆఫ్ చేసిన కిలాడీ దంపతులు రూ. 47 లక్షల క్యాష్, లక్షల విలువైన బంగారు నగలు లూటీ చేసి చెక్కేశారు. యజమాని ఇంటికి తాళం వెయ్యకుండా కిలాడీ లేడీ ఎలాంటి మాయమాటలు చెప్పింది ? అనే విషయం తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు.

ప్రముఖ వ్యాపారవేత్త

ప్రముఖ వ్యాపారవేత్త

ఐటీ హబ్ బెంగళూరులోని బాణసవాడి సమీపంలోని కమ్మనహళ్ళిలో శ్రీధర్ అనే వ్యాపారవేత్త నివాసం ఉంటున్నాడు. వ్యాపారం చేస్తున్న శ్రీధర్ అతని భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి ఐటీ హబ్ లోని కమ్మనహళ్ళిలోనే చాలా సంవత్సరాల నుంచి విలాసవంతమైన ఇంటిలో నివాసం ఉంటున్నాడు. వ్యాపారవేత్త శ్రీధర్ ఇంటిలో లక్షల రూపాయల నగదు నిల్వ ఉంటుందని తెలిసింది.

నేపాల్ సెక్యూరిటీ గార్డు దంపతులు

నేపాల్ సెక్యూరిటీ గార్డు దంపతులు

శ్రీధర్ అతని ఇంటికి సెక్యూరిటీ ఉండాలని నేపాల్ కు చెందిన క్రిష్ణ అనే వ్యక్తిని సెక్యూరిటీ గార్డుగా పెట్టారు. కొంతకాలానికి సెక్యూరిటీ గార్డు క్రిష్ణ భార్య జానకి వ్యాపారి శ్రీధర్ ఇంటిలో ఇంటి పని చెయ్యడం మొదలు పెట్టింది. నేపాల్ కు చెందిన క్రిష్ణ, జానకి దంపతులు నివాసం ఉండటానికి వ్యాపారి శ్రీధర్ అతని ఇంటి ఔట్ హౌస్ ఇచ్చాడు. వ్యాపారి శ్రీధర్ ఇంటిలోపల, బయట సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

ఒకేరోజు పెళ్లి..... నిశ్చితార్థం

ఒకేరోజు పెళ్లి..... నిశ్చితార్థం

ఈనెల 15వ తేదీన వ్యాపారి శ్రీధర్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న రెండు కుటుంబాల్లో శుభకార్యాలు జరిగాయి. బెంగళూరు ప్యాలెస్ గ్రౌండ్స్ లో జరుగుతున్న పెళ్లికి వ్యాపారి శ్రీధర్ వెళ్లాడు. శ్రీధర్ కొడుకు స్కూల్ కు వెళ్లిపోయాడు. బెంగళూరులోని వైట్ ఫీల్డ్ లో జరుగుతున్న వివాహ నిశ్చితార్థం కార్యక్రమానికి శ్రీధర్ భార్య, అతని ఇద్దరు కూతుర్లు వెళ్లడానికి సిద్దం అయ్యారు. ఆ సమయంలో నేపాల్ కిలాడీ లేడీ పవర్ ఫుల్ స్కెచ్ వేసింది.

అమ్మా..... పని చాలా మిగిలిపోయింది

అమ్మా..... పని చాలా మిగిలిపోయింది

శ్రీధర్ పెళ్లికి వెళ్లిన తరువాత ఉదయం 11 గంటల సమయంలో నిశ్చితార్థానికి బయలుదేరిన అతని భార్య ఇంటికి తాళం వేసింది. ఆ సమయంలో ఇంటి పని చేస్తున్న జానకి అమ్మా ఇంకా ఇంట్లో పని చాలా మిగిలిపోయింది, మీరు వచ్చేలోపు నేను పని పూర్తి చేస్తానని చెప్పింది. ఇంటి మెయిన్ డోర్ తాళం తీసేసిన శ్రీధర్ భార్య బంగారు నగలు, లిక్విడ్ క్యాష్ ఉన్న రూమ్ కు మాత్రం తాళం వేసుకుని ఇద్దరు కూతుర్లతో కలిసి వైల్ ఫీల్డ్ లో జరుగుతున్న నిశ్చితార్థం కార్యక్రమానికి వెళ్లిపోయింది.

నైస్ గా రూ. 47 లక్షల క్యాష్, రూ. 7 లక్షల నగలు లూటీ

నైస్ గా రూ. 47 లక్షల క్యాష్, రూ. 7 లక్షల నగలు లూటీ

యజమాని శ్రీధర్, అతని భార్య, పిల్లలు అందరూ శుభాకార్యాలకు వెళ్లిపోవడంతో నేపాల్ సెక్యూరిటీ గార్డు క్రిష్ణ, అతని భార్య జానకి చేతివాటం చూపించారు. ఇంట్లో బంగారు నగలు, డబ్బు ఉన్న రూమ్ తలుపులు బద్దలు చేశారు. బీరువాలో ఉన్న రూ. 47 లక్షల క్యాష్, రూ. 7 లక్షల విలువైన 170 గ్రాముల బంగారు నగలు లూటీ చేసి అక్కడి నుంచి చెక్కేశారు.

బిత్తరపోయిన ఇంటి యజమానులు

బిత్తరపోయిన ఇంటి యజమానులు

మద్యాహ్నం 2 గంటల సమయంలో శుభకార్యం ముగించుకున్న శ్రీధర్ భార్య ఆమె ఇద్దరు కూతుర్లతో కలిసి ఇంటికి చేరుకుంది. ఆ సమయంలో సెక్యూరిటీ గార్డు క్రిష్ణతో పాటు అతని భార్య జానకి కనపడకపోవడంతో ఆమె ఆందోళన చెందింది. వెంటనే ఇంట్లోకి వెళ్లి చూడగా డబ్బులు, నగలు ఉన్న రూమ్ తలుపు పగలగొట్టి ఉండటం, లాకర్ లో రూ. 47 లక్షలు, బంగారు నగలు చోరీ కావడంతో ఆమె హడలిపోయి వెంటనే భర్త శ్రీధర్ కు సమాచారం ఇచ్చింది.

సీసీటీవీ కెమెరాలు ఆఫ్...... ఇల్లు ఖాలీ చేసిన కిలాడీ దంపతులు

సీసీటీవీ కెమెరాలు ఆఫ్...... ఇల్లు ఖాలీ చేసిన కిలాడీ దంపతులు

ఇంటి సీసీటీవీ కెమెరాలు అన్ని ఆఫ్ చేసిన సెక్యూరిటీ గార్డు క్రిష్ణ, అతని భార్య జానకి రూ. 47 లక్షలు క్యాష్, బంగారు నగలు చోరీ చేసి ఇంటిని ఖాళీ చేసుకుని వెళ్లిపోవడం కలకలం రేపింది. విషయం తెలుసుకున్న బాణసవాడి పోలీసులు రంగంలోకి దిగి క్రిష్ణ, జానకి ఫోటోలు సేకరించి వారి కోసం బెంగళూరు మొత్తం గాలిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+