Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Mysore Dasara: మైసూరు దసరా ఉత్సవాలు, దూరం నుంచి చూసి దండం పెట్టుకోవాడమే, నో చాన్స్!

మైసూరు/ బెంగళూరు: ప్రపంచ ప్రసిద్ది చెందిన మైసూరు దసరా ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు ఎస్ఎం. కృష్ణ గురువారం మైసూరు దసరా ఉత్సవాలను అధికారికంగా ప్రారంభించారు. మైసూరులోని ప్రసిద్ది చెందిన చాముండేశ్వరి కొండ మీద అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన తరువాత దసరా ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. కోవిడ్-19 నియమాలు పాటిస్తూ దసరా ఉత్సవాలు జరుపుకోవాలని ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం ప్రజలకు మనవి చేసింది.

కరోనా వైరస్ థర్డ్ వేవ్ వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ సంవత్సరం దసరా ఉత్సవాల సందర్బంగా ఏర్పాటు చేసిన సాంసృతిక కార్యక్రమాలు చూడటానికి ప్రజలకు అవకాశం లేదు. ఈ ఏడాది మైసూరు దసరా ఉత్సవాలను ప్రజలు టీవీల్లో చూసి దండం పెట్టుకోవడం తప్పా చేసేది ఏమీ లేకుండా పోయింది.

మాజీ సీఎం చేతులు మీదుగా

ప్రపంచ ప్రసిద్ది చెందిన మైసూరు దసరా ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు ఎస్ఎం. కృష్ణ గురువారం మైసూరు దసరా ఉత్సవాలను అధికారికంగా ప్రారంభించారు. గురువారం ఉదయం 8.25 గంటల సమయంలో ఎస్ఎం. కృష్ణ, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్, మంత్రులు, మైసూరు జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, కర్ణాటక మంత్రులు మైసూరు దసరా ఉత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్టొన్నారు.

సాంప్రదాయంగా జరుగుతాయి... కాని ?

సాంప్రదాయంగా జరుగుతాయి... కాని ?

మైసూరు దసరా ఉత్సవాలు ప్రపంచ ప్రసిద్ది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కోవిడ్ 19 నియమాలు పాటిస్తూ ఈ సంవత్సరం సాంప్రధాయ పద్దతిలో మైసూరు దసరా ఉత్సవాలు జరుగాయని ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో మైసూరు దసరా ఉత్సవాలకు లక్షలాది మంది హాజరయ్యేవారు.

ఏకాంతంగా దసరా ఉత్సవాలు

ఏకాంతంగా దసరా ఉత్సవాలు

మైసూరులోని ప్రసిద్ది చెందిన చాముండేశ్వరి కొండ మీద అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన తరువాత దసరా ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. కోవిడ్-19 నియమాలు పాటిస్తూ దసరా ఉత్సవాలు జరుపుకోవాలని ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం ప్రజలకు మనవి చేసింది. కరోనా వైరస్ థర్డ్ వేవ్ వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ సంవత్సరం దసరా ఉత్సవాల సందర్బంగా ఏర్పాటు చేసిన సాంసృతిక కార్యక్రమాలు చూడటానికి ప్రజలకు అవకాశం లేదు.

దూరం నుంచి చూసి దండం పెట్టుకోవడమే

దూరం నుంచి చూసి దండం పెట్టుకోవడమే

కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో గత ఏడాది లాగే ఈ ఏడాది దసరా ఉత్సవాలు ప్రజలు ప్రత్యక్షంగా చూడటానికి అవకాశం లేకుండా పోయింది. మైసూరు దసరా ఉత్సవాలను ప్రజలు కన్నడిగులతో పాటు దేశ, విదేశాల్లో మైసూరు దసరా ఉత్సవాలు చూడాలని అనుకుంటున్న ప్రజలు టీవీల్లో చూసి దూరం నుంచి దండం పెట్టుకోవడం తప్పా చేసేది ఏమీ లేకుండా పోయింది.

ఆరు రాష్ట్రాల ప్రజలకు నిరాశ

ఆరు రాష్ట్రాల ప్రజలకు నిరాశ

ప్రపంచ ప్రసిద్ది చెందిన మైసూరు దసరా ఉత్సవాలు చూడటానికి గతంలో దేశ విదేశాల నుంచి ప్రతిరోజూ లక్షలాది మంది పర్యాటకులు వచ్చేవారు. అయితే కరోనా దెబ్బతో గత ఏడాది, ఈ ఏడాది ప్రజలకు ఆ అవకాశం లేకుండా పోయింది. మైసూరు దసరా ఉత్సవాలు చూడటానికి కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్రతో సహ దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యేవారు. అయితే కరోనా వైరస్ దెబ్బతో ఈ సంవత్సరం టీవీల్లో దసరా ఉత్సవాలు చూస్తూ మమా అనుకోవాలని మైసూరు దసరా ఉత్సవాలు చూడాలని అనుకునే ప్రజలు ఇప్పుడు అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+