ఆర్ టీసీ బస్సుల్లో ఫ్రీ అంటూ తెగతిరిగేశారు, రూ. లక్షల్లో ఫైన్ వసూలు చేశారు!

బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో జూన్ 11వ తేదీ నుంచి మహిళలకు కేఎస్ ఆర్ టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ సిద్దరామయ్య ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శక్తి పథకం అమలుకు ముందే మే నెలలో టిక్కెట్లు లేకుండా ప్రయాణించిన 3,000 కేసులు నమోదు అయ్యాయి.

దీంతో సంస్థకు జరిగిన నష్టాన్ని అధికారులు తప్పించారు. మే నెలలో కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ దర్యాప్తు బృందాలు తనిఖీలను వేగవంతం చేశాయి. ఆ నెలలో మొత్తం 44, 052 రవాణా బస్సులను అధికారుల బృందం తనిఖీ చేసింది.

Free travel in RTC buses, officials have collected lakhs of rupees fine from those roaming without tickets

ఈ సమయంలో కేఎస్ ఆర్ టీసీ బస్సులలో టిక్కెట్లు లేకుండా ప్రయాణించిన మొత్తం 3, 266 కేసులు నమోదు చేశారు. 3, 636 మంది టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నారని అధికారులు గుర్తించారు. కార్పొరేషన్ మొత్తం ఆదాయానికి గండిపడే రూ.73, 859 నష్టాన్ని అధికారులు నివారించారు. మొత్తం 3,636 టిక్కెట్‌ లేని కేసుల నుంచి అధికారులు మొత్తం రూ.5,89,453 వసూలు చేసినట్లు కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.

దీనితో పాటు ప్రయాణికులు దయచేసి బస్సులలో ప్రయాణించేటప్పుడు టిక్కెట్లు తీసుకోవాలని, ఇది పురుషులకు వర్తిస్తుందని అధికారులు తెలిపారు. జూన్ 11 న మహిళలందరికీ ఉచిత ప్రయాణ శక్తి పథకం యోజన అమలు చేయబడింది. శక్తి పథకం కింద ఓ మహిళ ఎక్స్‌ప్రెస్ బస్సు ఎక్కి బీభత్సం సృష్టించింది. బస్సు ఆపకపోవడంతో డ్రైవర్‌పై ఆ మహిళ దాడి చేసింది.

ప్రస్తుతం ఓ మహిళ సహా నలుగురిని అరెస్టు చేశారు. చల్లకెరె డిపోకు చెందిన రాయదుర్గం-బెంగళూరు బస్సులో బెంగళూరు వెళ్లేందుకు ఓ మహిళ ఎక్కింది. దాబాస్‌పేటలో ఆపాలని మహిళ కోరింది. కానీ ఈ బస్సు ఎక్స్‌ప్రెస్‌ బస్సు కావడంతో ఆమె కోరినట్లు దాబస్‌పేటలో ఆపేందుకు వీలులేదని బస్సు డ్రైవరె చెప్పడంతో గొడవ జరిగిందని అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+