Paramour: ఇద్దరు ప్రియుల ముద్దుల లేడీ, పాత ప్రియుడికి కోపం వచ్చింది. మ్యాటర్ రివర్స్, కథ క్లోజ్!
బెంగళూరు/కొడుగు: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో కాపురం చేసి ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది. పిల్లలు పుట్టిన తరువాత దంపతుల మద్య తేడాలు రావడంతో విడిపోయారు. పిల్లలతో కలిసి తల్లి వేరుగా నివాసం ఉంటున్నది. వివాహం చేసుకుని భార్య, పిల్లలతో కలిసి నివాసం ఉంటున్న వ్యక్తి ఆమెకు పరిచయం కావడం ఇద్దరూ అక్రమ సంబందం పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నారు.
భార్యతో కాపురం చేస్తున్న భర్త అతని ప్రియురాలికి, ఆమె పిల్లలకు కావలసినవి అన్నీ చూసుకుంటున్నాడు. ప్రియుడితో హ్యాపీగా ఉంటున్న మహిళ మరో ప్రియుడిని సెట్ చేసుకుని అతనితో జల్సాలు చేసింది. ఇదే సందర్బంలో ఇద్దరు ప్రియుల ముద్దలు కిలాడీ లేడీ దారుణ హత్యకు గురికావడం కలకలం రేపింది.

భర్తకు విడాకులు ఇచ్చేసింది
కర్ణాటకలోని కొడుకు జిల్లాలోని సోమవారపేట తాలుకాలోని మాదాపురలో ఝహీరా అనే మహిళ నివాసం ఉంటున్నది. 14 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్న ఝహీరా ఆమె భర్తతో కాపురం చేసి ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది. పిల్లలు పుట్టిన తరువాత ఝహీరా దంపతుల మద్య తేడాలు రావడంతో ఇద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు.

ప్రియుడిని సెట్ చేసుకుంది
పిల్లలతో కలిసి ఝహీరా భర్తకు దూరంగా వేరుగా నివాసం ఉంటున్నది. మాదాపురలో పూవయ్య అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. వివాహం చేసుకుని భార్య, పిల్లలతో కలిసి నివాసం ఉంటున్న పూవయ్య కొన్ని సంవత్సరాల క్రితమే ఝహీరాకు పరిచయం అయ్యాడు. తరువాత ఝహీరా, పూవయ్య అక్రమ సంబందం పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నారు.

మరో యువకుడిని సెట్ చేసుకుని ఎంజాయ్
ఝహీరా, పూవయ్యల మతాలు వేరు అయినా ఇద్దరూ హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఇదే సందర్బంలో ఝహీరా యవ్వనంలో ఉన్న మరో యువకుడిని సెట్ చేసుకుని అతనితో ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టింది. చాలా కాలం పాటు ఝహీరా ఆమె మొదటి ప్రియుడు పూవ్వయ్యకు రెండో ప్రియుడు మ్యాటర్ తెలీకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంది.

ప్రియురాలి చీటి చింపేసిన మొదటి ప్రియుడు
భార్య హేమావతితో కాపురం చేస్తున్న పూవయ్య అతని ప్రియురాలు ఝహీరాకు, ఆమె పిల్లలకు కావలసినవి అన్నీ వసతులు, ఇంటి అద్దె ఇవ్వడం, సరుకులు తీసివ్వడం చేస్తున్నాడు. ప్రియుడు పూవయ్యతో హ్యాపీగా ఉంటున్న ఝహీరా మరో ప్రియుడితో జల్సాలు చేసింది. ఈ విషయం తెలుసుకున్న పూవయ్య అతని ప్రియురాలు ఝహీరాను చంపేయాలని డిసైడ్ అయ్యాడు. ఇద్దరు ప్రియుల ముద్దలు ప్రియురాలు ఝహీరాను హత్య చేసిన పూవయ్య అతని భార్య హేమావతికి ఫోన్ చేసి మ్యాటర్ మొత్తం చెప్పాడు.

ఇద్దరు ప్రియుల ముద్దుల ప్రియురాలి కథ ?
తన ప్రియురాలు ఝహీరాకు ఇంత చేసినా నాకే మోసం చేసిందని, నాకు బెయిల్ తీసుకురావాలని పూవయ్య అతని భార్య హేమావతికి ఫోన్ చేసి చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. మొత్తం మీద ఇద్దరు ప్రియుల ముద్దుల ప్రియురాలు ఝహీరా దారుణ హత్యకు గురికావడం కొడుగు జిల్లాలో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications