Politics: హలాల్ మాంసం, హిజాబ్ విషయంలో మేము క్లారిటీగా ఉన్నాము, సీఎం, ప్రతిపక్షాలకు పనిపాట లేదు !
బెంగళూరు/న్యూఢిల్లీ: చట్టం అందరికి ఒక్కటే అనే విషయం ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ అన్నారు. చట్టం ఒక్కొక్కరికి ఒక్కోరంగా ఉండదనే విషయం ప్రతిపక్ష పార్టీల నాయకులు గుర్తు చేసుకోవాలని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మయ్ ఘాటుగానే సమాధానం ఇచ్చారు. హలాల్ మాంసం విషయంలో, ఇటీవల హిజాబ్ విషయంలో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ మీడియాతో మాట్లాడారు. కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ మీద కొందరు కావాలనే పనికట్టుకుని విమర్శలు చేస్తున్నారని, అలాంటి వారికి సమాధానం చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ అన్నారు. కర్ణాటక మాజీ సీఎం హెచ్.డి. కుమారస్వామి ఎప్పుడు ఏమి మాట్లాడుతారో ఆయనకే తెలీదని ,ఆయన విమర్శలకు తాను ఎందుకు సమాధానం చెప్పాలని, ఎవరు ఏమి మాట్లాడుతున్నారో అనే విషయం ప్రజలు గమనిస్తున్నారని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మయ్ అన్నారు.

శాంతిని కాపాడటం మా పని
హలాల్ మాంసం విషయంలో చట్టం తనపని తాను చేసుకుని వెలుతుందని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మయ్ అన్నారు. ధార్మిక కార్యక్రమాలకు అనగుణంగానే అందరూ నడుచుకోవాలని బసవరాజ్ బొమ్మయ్ ప్రజలకు మనవి చేశారు. కర్ణాటకలో శాంతిని కాపాడటానికి మా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని సీఎం బసవరాజ్ బొమ్మయ్ అన్నారు.

చట్టం అందరికి సమానమే
చట్టం అందరికి ఒక్కటే అనే విషయం ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ అన్నారు. చట్టం ఒక్కొక్కరికి ఒక్కోరంగా ఉండదనే విషయం ప్రతిపక్ష పార్టీల నాయకులు గుర్తు చేసుకోవాలని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మయ్ ఘాటుగానే సమాధానం ఇచ్చారు.

హిజాబ్ విషయంలో హైకోర్టు ఆదేశాలను పాటించాలి
హిజాబ్ వివాదంపై అందరి వాదనలు విన్న కర్ణాటక హైకోర్టు తీర్పు ఇచ్చిందని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మయ్ గుర్తు చేశారు. హైకోర్టు తీర్పును ప్రతిఒక్కరూ గౌరవించాలని, ఏదో ఒక వర్గానికి అన్యాయం జరిగిందని అని మాట్లాడటం మంచిది కాదని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ అన్నారు.

ఆయన ఏం మాట్లాడుతారో ఆయనకే తెలీదు
కర్ణాటకలో శాంతిని కాపడటంలో ఆ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నాయకుడు హెచ్ డీ. కుమారస్వామి ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక మాజీ సీఎం హెచ్.డి. కుమారస్వామి ఎప్పుడు ఏమి మాట్లాడుతారో ఆయనకే తెలీదని ,ఆయన విమర్శలకు తాను ఎందుకు సమాధానం చెప్పాలని, ఎవరు ఏమి మాట్లాడుతున్నారో అనే విషయం ప్రజలు గమనిస్తున్నారని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మయ్ అన్నారు.

పనికట్టుకుని విమర్శలు చేస్తున్నారు
కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ మీద కొందరు కావాలనే పనికట్టుకుని విమర్శలు చేస్తున్నారని, అలాంటి వారికి సమాధానం చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ అన్నారు. హలాల్ మాంసం విషయంలో, ఇటీవల హిజాబ్ విషయంలో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ఘాటుగానే సమాధానం ఇచ్చారు.












Click it and Unblock the Notifications