Politics: హైకమాండ్ ఎఫెక్ట్ ?, అక్కడి నుంచి పోటీ చెయ్యను, తేల్చి చెప్పిన మాజీ సీఎం, హాట్ టాపిక్!
బెంగళూరు/ మైసూరు: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద కొందరు నాయకులు, కార్యకర్తలు మండిపడుతున్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో పోటీ చేసే విషయం దగ్గర నుంచి ఎన్నికల ప్రచారం చేసే విషయం వరకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పూర్తిగా విఫలం అయ్యిందని ఆ పార్టీకి చెందిన కొందరు నాయకులు ఆరోపిస్తున్నారు. ఢిల్లీలో ఎప్పటిలాగే కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలోని పెద్దలు సమావేశం అయ్యి గాంధీల కుటుంబానికి మేము విధేయులు అని ప్రకటించేశారు. సోనియా గాంధీ నాయకత్వంలో మేము పని చేస్తామని తూతూ మంత్రంగా చెప్పేశారు.
పేరుకు కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఎవరు అని చర్చించడానికి సమావేశం అయినా చివరికి సోనియా గాంధీకి అందరూ జైజై అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మార్పులు రావాలని డిమాండ్లు మొదలైనా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏమాత్రం పట్టించుకోలేదని తెలిసింది. గాంధీలు లేని కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలు చూడలేరని, గాంధీలు లేకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి ఉండటం సాధ్యం కాదని కేపీసీసీ చీఫ్ డీకే. శివకుమార్ ఇప్పటికే చెప్పారు. కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకుని లాభం పొందాలని అనుకునేవాళ్లు మాత్రమే ఇప్పుడు ఆ పార్టీని విమర్శిస్తున్నారని, అధికార దాహం ఉన్న వాళ్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీని వదిలేసి బయటకు వెళ్లిపోతున్నారని కేపీసీసీ చీఫ్, మాజీ మంత్రి, ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
గాంధీలు లేని కాంగ్రెస్ పార్టీని అసలుసిసలైన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఊహించుకోవడం చాలా కష్టం అని డీకే శివకుమార్ అంటున్నారు. అయితే అదే కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య మరో బాంబు పేల్చేశారు. వచ్చే సంవత్సరం జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను చాముండేశ్వరి అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యనని, తనకు రెండోసారి రాజకీయ భిక్ష పెట్టిన చాముండి నియోజక వర్గం ప్రజలు తనను ఎంతో ఆధరించారని, అయినా తాను ఈ నిర్ణయం తీసుకున్నానని సిద్దరామయ్య చేప్పడం ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

కాంగ్రెస్ లీడర్స్ విఫలం
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద కొందరు నాయకులు, కార్యకర్తలు మండిపడుతున్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో పోటీ చేసే విషయం దగ్గర నుంచి ఎన్నికల ప్రచారం చేసే విషయం వరకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పూర్తిగా విఫలం అయ్యిందని ఆ పార్టీకి చెందిన కొందరు నాయకులు ఆరోపిస్తున్నారు.

సోనియా గాంధీకి జై కొట్టిన కాంగ్రెస్ లీడర్స్
ఢిల్లీలో ఎప్పటిలాగే కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలోని పెద్దలు సమావేశం అయ్యి గాంధీల కుటుంబానికి మేము విధేయులు అని ప్రకటించేశారు. సోనియా గాంధీ నాయకత్వంలో మేము పని చేస్తామని తూతూ మంత్రంగా చెప్పేశారు. పేరుకు కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఎవరు అని చర్చించడానికి సమావేశం అయినా చివరికి సోనియా గాంధీకి అందరూ జైజై అని చెప్పారు.

డీకే శివకుమార్ క్లారిటి
గాంధీలు లేని కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలు చూడలేరని, గాంధీలు లేకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి ఉండటం సాధ్యం కాదని కేపీసీసీ చీఫ్ డీకే. శివకుమార్ ఇప్పటికే చెప్పారు. కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకుని లాభం పొందాలని అనుకునేవాళ్లు మాత్రమే ఇప్పుడు ఆ పార్టీని విమర్శిస్తున్నారని, అధికార దాహం ఉన్న వాళ్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీని వదిలేసి బయటకు వెళ్లిపోతున్నారని కేపీసీసీ చీఫ్, మాజీ మంత్రి, ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీలు లేని కాంగ్రెస్ పార్టీని అసలుసిసలైన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఊహించుకోవడం చాలా కష్టం అని డీకే శివకుమార్ అంటున్నారు.

బాంబు పేల్చిన సిద్దరామయ్య
కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య మరో బాంబు పేల్చేశారు. వచ్చే సంవత్సరం జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను చాముండేశ్వరి అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యనని, తనకు రెండోసారి రాజకీయ భిక్ష పెట్టిన చాముండేశ్వరి నియోజక వర్గం ప్రజలు తనను ఎంతో ఆధరించారని, అయినా తాను ఈ నిర్ణయం తీసుకున్నానని సిద్దరామయ్య చేప్పడం ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

సిద్దూను పార్టీ నుంచి బహిష్కరించిన మాజీ ప్రధాని
2005లో జేడీఎస్ పార్టీ చీఫ్, మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ సిద్దరామయ్యను జేడీఎస్ పార్టీ నుంచి బహిష్కరించారు. జేడీఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసిన సిద్దరామయ్య 2006లో చాముండేశ్వరి అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేశారు.అప్పట్లోనే సిద్దరామయ్యను చాముండేశ్వరి నియోజక వర్గంలో ఓడించాలని అనేక ప్రయత్నాలు జరిగాయి.

సిద్దూను ఓడించాలని ప్రయత్నించిన మాజీ ప్రధాని
సిద్దరామయ్యను ఓడించాలని స్వయంగా మాజీ ప్రధాని, జేడీఎస్ చీఫ్ హెచ్ డీ. దేవేగౌడ చాముండేశ్వరి నియోజక వర్గంలో ప్రతి ఇంటికి తిరిగి ప్రచారం చేశారు. మాజీ ప్రధాని హెచ్ డీ. దేవేగౌడ, జేడీఎస్ నాయకులు సిద్దరామయ్యను ఓడించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరికి సిద్దరామయ్య 257 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

చాముండేశ్వరిలో షాక్.... బాదామిలో?
మైసూరు జిల్లాలోని చాముండేశ్వరి నియోజక వర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన సిద్దరామయ్యను జేడీఎస్ అభ్యర్థి జీటీ దేవేగౌడ ఓడించారు. అయితే అదే అసెంబ్లీ ఎన్నికల్లో మరో నియోజక వర్గం బాదామి నుంచి పోటీ చేసిన సిద్దరామయ్య ఎమ్మెల్యేగా విజయం సాధించారు. చాముండేశ్వరి నియోజక వర్గం నుంచి తాను పోటీ చెయ్యనని తేల్చి చెప్పిన సిద్దరామయ్య మరోసారి బాదామి నియోజక వర్గం నుంచి పోటీ చేస్తారని తెలిసింది.
ఇప్పటికే సిద్దరామయ్యకు సేఫ్ సీట్ అయిన వరుణ అసెంబ్లీ నియోజక వర్గాన్ని ఆయన కుమారుడు యతీంద్ర కోసం త్యాగం చేసిన సిద్దరామయ్య కొన్నిసార్లు చాముండేశ్వరి నియోజక వర్గం, ఇప్పుడు బాదామి నియోజక వర్గం నుంచి పోటీ చేశారు.

ఇలాంటి టైమ్ లో సిద్దరామయ్య ఇలా చెప్పారంటే?
మొత్తం మీద కాంగ్రెస్ నాయకత్వం మీద కార్యకర్తలు మండిపడుతున్న సమయంలో సిద్దరామయ్య చాముండేశ్వరి నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యనని చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. ఇదే సమయంలో కర్ణాటకలో బీజేపీ ముందస్తు ఎన్నికలకు వెలుతుందని జరుగుతున్న ప్రచారంపై స్పందించిన సిద్దరామయ్య అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్దంగా ఉందని, ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని సిద్దరామయ్య జోస్యం చెప్పారు.
-
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..?












Click it and Unblock the Notifications