బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Power Star: పునీత్ రాజ్ కుమార్ కార్యక్రమం, స్టార్ హీరోకు సినిమా చూపించిన పోలీసులు, నో ఎంట్రి !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/హైదరాబాద్/ చెన్నై: స్యాండిల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చనిపోయి 19 రోజులు పూర్తి అవుతున్నా ఆయన లేని లోటు మాత్రం కనపడటం లేదు. బెంగళూరులో జరిగిన పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సంతాప సభకు దక్షిణ భారతదేశంలోని పలు బాషల సినీ నటులతో పాటు ప్రముఖ పార్టీల రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున హాజరైనారు. హైదరాబాద్, చెన్నై నుంచి ప్రముఖ నటులు ఈ కార్యక్రమానికి హాజరైనారు. స్యాండిల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటుడిగానే కాకుండా ఆయన ఇంతకాలం చేసిన సమాజసేవ గురించి ప్రముఖులు గుర్తు చేసుకుని ఆయన లోటు నిజంగా తీర్చలేనదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సందర్బంగా పునీత్ రాజ్ కుమార్ సంతాప సభకు హాజరుకావడానికి వెచ్చిన స్టార్ హీరోను పోలీసులు గేటు దగ్గరే అడ్డుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. కన్నడలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఆ హీరోతో కోట్ల రూపాయలతో సినిమాలు నిర్మించడానికి నిర్మాతలు క్యూ కడుతున్నారు. అలాంటి స్టార్ హీరోను పాస్ ఉంటేనే లోపలికి పంపిస్తాం, లేదంటే వెనక్కి వెళ్లిపోండి అంటూ పోలీసులు అడ్డుకోవడం కలకలం రేపింది. మీరు లోపల కుర్చోవడానికి సీట్లు ఖాళీగా లేవు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్లిపోండి అంటూ స్టార్ హీరోకు పోలీసులు తేల్చి చెప్పారు. స్టార్ హీరో వెంట ఆయన అనుచరులు, మరో ఇద్దరు హీరోలు ఉండటంతో అందరిని ఎంట్రన్స్ గేట్ దగ్గర అడ్డుకున్న పోలీసులు ఆ స్టార్ హీరోకు పట్టపగలు చుక్కలు చూపించి నిజంగానే సినిమా చూపించడం ఇప్పుడు స్యాండిల్ వుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. చాలా సేపు బెంగళూరు ప్యాలెస్ గ్రౌండ్ ఎంట్రన్స్ దగ్గర హైడ్రామా చోటుచేసుకుంది.

Illegal affair: ఇంటి ఓనర్ తో పూజారి భార్య ?, ఆంటీ, కూతురు అందర్, పూజ చెయ్యాలని ఫినిష్ !Illegal affair: ఇంటి ఓనర్ తో పూజారి భార్య ?, ఆంటీ, కూతురు అందర్, పూజ చెయ్యాలని ఫినిష్ !

పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సంతాప సభ

పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సంతాప సభ

స్యాండిల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చనిపోయి 19 రోజులు పూర్తి అవుతున్నా ఆయన లేని లోటు మాత్రం కనపడటం లేదు. కర్ణాటక చలన చిత్ర వాణిజ్య మండలి ఆధ్వర్యంలో బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్ లో పునీత్ రాజ్ కుమార్ కు సంతాప సభ ఏర్పాటు చేశారు. బెంగళూరు ప్యాలెస్ గ్రౌండ్ లో జరిగిన పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సంతాప సభకు దక్షిణ భారతదేశంలోని పలు బాషల సినీ నటులతో పాటు ప్రముఖ పార్టీల రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున హాజరైనారు.

పాస్ లు పంపిణి చేసిన నిర్వహకులు

పాస్ లు పంపిణి చేసిన నిర్వహకులు

పునీత్ రాజ్ కుమార్ అంతిమ దర్శనం కోసం సుమారు 30 లక్షల మంది ఆయన అభిమానులు, ప్రజలు వచ్చారని అధికారులు అంచనా వేశారు. పునీత్ రాజ్ కుమార్ దినాల సందర్బంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి కొన్ని వేల మంది వచ్చి వెళ్లారు. ఈ రెండు సంఘటనలు గుర్తు పెట్టుకున్న నిర్వహకులు పునీత్ సంతాప సభకు ప్రముఖులు వస్తున్న సందర్బంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ముందుగానే కార్యక్రమానికి ఆహ్వానించిన వారికి పాస్ లు పంపిణి చేశారు.

పాస్ లు ఉంటేనే వదలండి.... లేదంటే లేదు

పాస్ లు ఉంటేనే వదలండి.... లేదంటే లేదు

బెంగళూరు ప్యాలెస్ గ్రౌండ్ లో జరిగిన పునీత్ రాజ్ కుమార్ సంతాప సభకు స్యాండిల్ వుడ్ కు చెందిన సుమారు 140 మంది ప్రముఖ హీరోలు, నటీనటులకు పాస్ లు పంపిణి చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ తో పాటు మాజీ ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖ నాయకులను ఆహ్వానించారు.

తెలుగు, తమిళ హీరోలకు ఆహ్వానం

తెలుగు, తమిళ హీరోలకు ఆహ్వానం

తెలుగు, తమిళ చిత్రరంగానికి చెందిన ప్రముఖ హీరోలను పునీత్ రాజ్ కుమార్ సంతాప సభకు ఆహ్వానించారు. బహుబాష నటుడు, ప్రముఖ హీరో, నిర్మాత విశాల్, శరత్ కుమార్, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ తో పాటు తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన కొందరు నటులు ఈ కార్యక్రమానికి హాజరైనారు. బెంగళూరు ప్యాలెస్ గ్రౌండ్స్ లోని గాయిత్రీ విహార్ లో పునీత్ రాజ్ కుమార్ సంతాప సభ జరిగింది.

స్టార్ హీరోకు సినిమా చూపించిన పోలీసులు

స్టార్ హీరోకు సినిమా చూపించిన పోలీసులు

స్యాండిల్ వుడ్ లో టాప్ 5 హీరోల్లో చాలెంజింగ్ స్టార్ దర్శన్ కూడా ఒక్కరు. పునీత్ రాజ్ కుమార్ సంతాప సభకు హాజరుకావడానికి వచ్చిన స్టార్ హీరో దర్శన్ ను పోలీసులు గాయిత్రీ విహార్ గేటు దగ్గరే అడ్డుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. కన్నడలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న చాలెంజింగ్ స్టార్ దర్శన్ తో కోట్ల రూపాయలతో సినిమాలు నిర్మించడానికి నిర్మాతలు క్యూలో ఉన్నారు. అయితే గేట్ దగ్గర స్టార్ హీరో దర్శన్ కు బెంగళూరు పోలీసులు సినిమా చూపించారు.

నిలబడి కార్యక్రమం చూసి వెళ్లిపోతానంటే ?

నిలబడి కార్యక్రమం చూసి వెళ్లిపోతానంటే ?

అలాంటి స్టార్ హీరో దర్శన్ ను పాస్ ఉంటేనే లోపలికి పంపిస్తాం, లేదుంటే వెనక్కి వెళ్లిపోండి అంటూ పోలీసులు అడ్డుకోవడం కలకలం రేపింది. మీరు లోపల కుర్చోవడానికి సీట్లు ఖాళీగా లేవు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్లిపోండి అంటూ స్టార్ హీరో దర్శన్ కు బెంగళూరు పోలీసులు తేల్చి చెప్పారు. లోపల కుర్చోవడానికి సీటు లేకపోయినా పర్వాలేదు, నిలబడి ఆ కార్యక్రమం చూసి వెళ్లిపోతానిన హీరో దర్శన్ చెబితే పోలీసులు మాత్రం కుదరదని తేల్చి చెప్పడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు ఎదురైనాయి.

వెనుక సీట్లో కుర్చున్న స్టార్ హీరో

స్టార్ హీరో దర్శన్ వెంట ఆయన అనుచరులు, అలనాటి హీరో, బహుబాష నటుడు కన్నడ ప్రభాకర్ కుమారుడు, హీరో వినోద్ ప్రభాకర్, మరో హీరో యశష్ సూర్యాలు ఉండటంతో అందరిని ఎంట్రన్స్ గేట్ దగ్గర అడ్డుకున్న పోలీసులు అందరికి పట్టపగలు చుక్కలు చూపించి నిజంగానే సినిమా చూపించడం ఇప్పుడు స్యాండిల్ వుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది.

Recommended Video

Puneeth Rajkumar: చిత్ర పరిశ్రమ ఓ రత్నాన్ని కోల్పోయింది.. దిగ్భ్రాంతి లో క్రీడాలోకం| Oneindia Telugu
మధ్యలోనే వెళ్లిపోయిన చాలెంజింగ్ స్టార్

మధ్యలోనే వెళ్లిపోయిన చాలెంజింగ్ స్టార్

తరువాత సీనియర్ పోలీసు అధికారులు జోక్యం చేసుకోవడంతో హీరో దర్శన్ లోపలికి వెళ్లారు. అప్పటికే వీఐపీల సీట్లు పూర్తిగా నిండిపోవడంతో వెనుక వరుసలో కుర్చున్న దర్శన్ అక్కడ రద్దినీ తట్టుకోలేక కార్యక్రమం పూర్తి కాకుండానే మధ్యలో అక్కడి నుంచి వెళ్లిపోయారు. హైదరాబాద్, చెన్నై నుంచి ప్రముఖ నటులు ఈ కార్యక్రమానికి హాజరైనారు. స్యాండిల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటుడిగానే కాకుండా ఆయన ఇంతకాలం చేసిన సమాజసేవ గురించి ప్రముఖులు గుర్తు చేసుకుని ఆయన లోటు నిజంగా తీర్చలేనదని ఆవేదన వ్యక్తం చేశారు.

English summary
Power Star: Puneet Rajkumar Namana program. Bengaluru Police stopped Darshan at palace ground asked to show Pass to make entry to the program.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X