Rains: ఐటీ హబ్ ప్రజలకు సినిమా చూపించిన వాన దేవుడు, గ్యాప్ ఇచ్చి మళ్లీ ప్రతాపం చూపించాడు, దెబ్బకు !
బెంగళూరు: ఐటీ హబ్ ప్రజలకు వాన దేవుడు సినిమా చూపించాడు. గ్యాప్ ఇచ్చినట్లు ఇచ్చి మళ్లీ వాన దేవుడు మళ్లీ ప్రతాపం చూపించడంతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఐటీ హబ్ బెంగళూరు నగరంలోని అనేక ప్రాంతాలు వర్షం నీరు రోడ్ల మీదకు రావడంతో జలమయం అయ్యాయి. ఆదివారం ఉదయం నుంచి నగరంలోని అనేక ప్రాంతాల్లో భారీ వానలు కురిశాయి. బెంగళూరులోని అనేక ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షం నీరు చేరిపోవడంతో జలమయం అయ్యాయి. మద్యాహ్నం కొంచెం విరామం ఇచ్చిన వానదేవుడు సాయంత్రం మళ్లీ ప్రతాపం చూపించాడు. బెంగళూరులో కొన్ని రోజులుగా కరుస్తున్న వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లోని రోడ్లు దెబ్బ తిన్నాయి. కుండపోత వానలతో విపరీతంగా ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికుల నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోమవారం ఉదయం పలు ఐటీ కంపెనీల కార్యాలయాలు, విద్యాసంస్థలు ప్రారంభం కావడంతో నగరంలోని అనేక ప్రాంతాల ప్రజలు ట్రాఫిక్ లో చిక్కుకున్నారు.

భారీ వర్షాలు.... చెరువులు తలపిస్తున్న రోడ్లు
బెంగళూరులోని పలు రహదారుల మీద రెండు మూడు అడుగుల ఎత్తులో నీళ్లు నిలిచిపోవడంతో కొన్ని ప్రాంతాల్లోని రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. పాదచారులు, వాహనచోదకులు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బెంగళూరు నగరంలో నిత్యం రద్దీగా ఉండే సిల్క్ బోర్డు జంక్షన్ తో పాటు అనేక రహదారుల్లో గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి.

నానా ఇబ్బందులు పడుతున్న ప్రజలు
నగరంలోని పలు ప్రాంతాల్లోని ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ జామ్ కావడంతో ఆ పరిసర ప్రాంతాల్లో సంచరించే వాళ్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బెంగళూరు-తుమకూరు రోడ్డు, బెంగళూరు- పాత మద్రాసు రోడ్డు, బెంగళూరు- ఎలక్ట్రానిక్ సిటీ రహదారుల్లో విపరీతంగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. బెంగళూరు నగరంలో ఇళ్లల్లో నిలిచిపోయిన నీరు బయటకు పంపించడానికి ఇంటి యజమానులు నానా తిప్పలు పడుతున్నారు.

అధికారులు అలర్ట్
బెంగళూరు నగరంలోని అనేక పాత భవనాలు, శిథిలావస్థలో ఉన్న కట్టడాల్లో నివాసం ఉంటున్న ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. పలు చోట్ల నిర్మాణంలో ఉన్న కట్టడాల దగ్గర, మెట్రోపనులు జరుగుతున్న ప్రాంతాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోని పనులు చెయ్యాలని కూలీలకు అధికారులు సూచించారు. భారీ వర్షాల కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న బెంగళూరు ప్రజలు మాత్రం ఎవరిపనుల్లో వారు నిమగ్నం అవుతున్నారు.

సినిమా చూపించిన వాన దేవుడు
ఐటీ హబ్ ప్రజలకు వాన దేవుడు సినిమా చూపించాడు. గ్యాప్ ఇచ్చినట్లు ఇచ్చి మళ్లీ వాన దేవుడు మళ్లీ ప్రతాపం చూపించడంతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఐటీ హబ్ బెంగళూరు నగరంలోని అనేక ప్రాంతాలు వర్షం నీరు రోడ్ల మీదకు రావడంతో జలమయం అయ్యాయి. బెంగళూరు నగరంతో పాటు కర్ణాటకలోని అనేక జిల్లాల్లో భారీగా వానలు కురుస్తున్నాయి. ఇప్పటికే బెంగళూరు నగరంతో పాటు కొన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు.












Click it and Unblock the Notifications