Rains: నిన్న చెన్నై, నేడు ఐటీ హబ్, వర్షాల దెబ్బతో ప్రజలు, నాలుగు రోజులు సేమ్ సీన్, ఆంధ్రాను వదల్లేదు !
బెంగళూరు/చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం దెబ్బతో ఇప్పటికే తమిళనాడు అతలాకుతలం అయ్యింది. తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాల దెబ్బతో ప్రజలు హడలిపోయారు. పక్కన ఉన్న కర్ణాటక, కేరళ రాష్ట్రాల మీద వాయుగుండం ప్రభావం చూపించింది. బంగాళాఖాతంలోని వాయుగుండం తీరాన్ని తాకింది. ఈ నేపథ్యంలో బెంగళూరులో కూడా వర్షాలుపడుతున్నాయి. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు విరామం లేకుండా బెంగళూరులో వర్షం కురుస్తూనే ఉంది. అయితే భారీ వర్షాలు పడకపోవడంతో ఐటీ హబ్ ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. గురువారం బెంగళూరులోని అనేక రహదారుల్లో జనసంచారం లేక రోడ్లు ఖాళీగా దర్శనం ఇచ్చాయి. వచ్చే నాలుగు రోజులు బెంగళూరులో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కర్ణాటకలోని పలు జిల్లాలో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ముందుజాగ్రత్త చర్యగా కర్ణాటకలోని పలు జిల్లాల్లో శుక్రవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. తమిళనాడులో భారీ వర్షాల దెబ్బతో ఇప్పటి వరకు 14 మంది మరణించారని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మొత్తం మీద భారీ వర్షాల దెబ్బతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ ప్రజలు వనికిపోతున్నారు.

తమిళనాడు విలవిల
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం దెబ్బతో ఇప్పటికే తమిళనాడు అతలాకుతలం అయ్యింది. తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాల దెబ్బతో ప్రజలు హడలిపోయారు. తమిళనాడులో భారీ వర్షాల దెబ్బతో ఇప్పటి వరకు 14 మంది మరణించారని ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అధికారికంగా ప్రకటించింది.

చెన్నై ఇంకా కోలుకోలేదు
భారీ వర్షాల దెబ్బతో చెన్నై సిటీ చిత్తడి అయ్యింది. భారీ వర్షాల దెబ్బ నుంచి చెన్నై సిటీ ప్రజలు ఇంకా కోలుకోవడం లేదు. చెన్నైలోని పలు ప్రాంతాలు శుక్రవారం ఉదయం వరకు ఇకా జలవలయంలోనే చిక్కుకున్నాయి. రోడ్లు మీద నిలిచిపోయిన వరద నీటిని, ఇళ్లల్లోకి చేరుకుంటున్న వర్షం నీటిని బయటకు పంపించడానికి స్థానిక ప్రజలు, కార్పోరేషన్ అధికారులు నానా తిప్పలు పడుతున్నారు.

బెంగళూరులో అలాంటి పరిస్థితితే..... కానీ ఎంతో మేలు
తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావం పక్కన ఉన్న కర్ణాటకకు తాకింది. గురువారం ఉదయం నుంచి నుంచి శుక్రవారం ఉదయం వరకు విరామం లేకుండా బెంగళూరులో వర్షం కురుస్తూనే ఉంది. అయితే భారీ వర్షాలు పడకపోవడంతో ఐటీ హబ్ ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. గురువారం బెంగళూరులోని అనేక రహదారుల్లో జనసంచారం లేక రోడ్లు ఖాళీగా దర్శనం ఇచ్చాయి.

బెంగళూరులో మరో నాలుగు రోజులు సేమ్ సీన్
వచ్చే నాలుగు రోజులు బెంగళూరులో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బెంగళూరు సిటీలోని లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలు ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా బంధువుల ఇళ్లకు పరుగు తీస్తున్నారు. కర్ణాటకలోని పలు జిల్లాలో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ముందుజాగ్రత్త చర్యగా కర్ణాటకలోని పలు జిల్లాల్లో శుక్రవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
Recommended Video

బెంగళూరులో ఇది పరిస్థితి
గురువారం మద్యాహ్నం వరకు ఐటీ హబ్ బెంగళూరు సిటీలో 4.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో 3.8 సె.మీ, హెచ్ఏఎల్ ఎయిర్ పోర్టులో 3.5 సె,మీ వర్షం పడిందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. బెంగళూరు నగరంలో గురువారం వేకువ జామున నుంచి పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, కొన్ని ప్రాంతాలో చిరుజల్లలు కురుస్తుండటంతో వాతావరణం చాలా చల్లగా ఉంది. చలి దెబ్బతో చిన్న పిల్లలు, వృద్దులు వణికిపోతున్నారు. శుక్రవారం కూడా బెంగళూరులోని పలు ప్రాంతాల్లో నిత్యం రద్దీగా ఉండే రోడ్లు ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్












Click it and Unblock the Notifications