బెంగళూరు పోలీసులూ ఇక అలా వద్దు: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కీలక నిర్ణయం

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కీలక నిర్ణయం తీసుకున్నారు. తనకు కల్పించిన జీరో ట్రాఫిక్ సౌకర్యాన్ని ఉపసంహరించుకుటున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ విషయమై బెంగళూరు నగర కమిషనర్‭కి సమాచారం ఇచ్చినట్లు ఆయన తెలిపారు. నగర ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.

సీఎం 'జీరో ట్రాఫిక్‌' ప్రోటోకాల్‌ కారణంగా రోడ్లపై ట్రాఫిక్‌ స్తంభించి బెంగళూరు నగర ప్రజలకు కలుగుతున్న అసౌకర్యాన్ని గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు సిద్ధరామయ్య తెలిపారు. 'ఇది నా ఇల్లు, కార్యాలయం, పబ్లిక్ ఫంక్షన్లకు కూడా వర్తిస్తుంది. కానుకల ద్వారా ప్రేమ, గౌరవం చూపించాలనుకునే వారు పుస్తకాలు ఇవ్వవచ్చు. మీ ప్రేమ, అభిమానం ఎల్లప్పుడూ నాపై ఉండాలి' అని సిద్ధరామయ్య ట్వీట్ చేశారు.

Take Back Zero Traffic Rule For His Motorcade: Karnataka CM Siddaramaiah Asks Bengaluru Police

సోమవారం నుంచి బహిరంగ దండలు, శాలువాలు స్వీకరించకూడదని సిద్ధరామయ్య నిర్ణయించుకున్నారు. కాగా, గతంలో కర్ణాటక మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై, కర్ణాటక మాజీ హోంమంత్రి ఆరగ జ్ఞానేంద్ర కూడా జీరో ట్రాఫిక్ ప్రోటోకాల్‌ను తిరస్కరించారు. రాష్ట్ర ప్రముఖులు రోడ్డు మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు, జీరో ట్రాఫిక్ ప్రోటోకాల్‌లు ఉపయోగించబడతాయి, వారు వెళ్లే వరకూ పోలీసులు ప్రజలపై ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తారు.

ఇది ఇలావుండగా, ఆదివారం రోజున కురిసిన భారీ వర్షాల కారణంగా బెంగళూరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన భానురేఖ ఓ అనే యువతి మృతి చెందారు. ఈ క్రమంలో సీఎం సిద్ధరామయ్య ఈ నిర్ణయం తీసుకున్నారు . భానురేఖ అనే యువతి తన కుటుంబంతో కలిసి కారులో కేఆర్ సర్కిల్ అండర్‌పాస్ గుండా ప్రయాణిస్తుండగా అండర్‌పాస్‌లో కారు మునిగింది.

ఈ ఘటనలో వరదలో చిక్కుకుపోయి భానురేఖ చనిపోయింది. అయితే ఆమెతో పాటు ఉన్న మరో ఐదుగురిని సహాయక సిబ్బంది రక్షించారు. సీఎం సిద్ధరామయ్య ఆస్పత్రికి వెళ్లి మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి రూ.5 లక్షలు పరిహారం ప్రకటించారు. భానురేఖ బెంగుళూరులోని ఇన్ఫోసిస్‌లో సాప్ట్ వేర్ ఇంజనీర్‌గా పని చేస్తోంది.

మే 20నే కర్ణాటక 22వ ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రిగా మరో నిమిది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల వెలువడిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ 135 సీట్లతో అధికారంలోకి వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+