Teacher: వీడు టీచర్ కాదు, పక్కా 420, పగలు పిల్లలకు పాఠాలు, రాత్రి ఆలయాల్లో లూటీలు, ప్లాన్-బి!
బెంగళూరు/మంగళూరు: ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్ లో పిల్లలకు పాఠాలు చెబుతున్న టీచర్ ప్రతినెల జీతం తీసుకుంటున్నాడు. ఓ స్నేహితుడి కారణంగా విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన టీచర్ రాంగ్ రూట్ లో వెళ్లాడు. ప్రతిరోజు స్కూల్ లో పిల్లలకు పాఠాలు చెబుతున్న టీచర్ స్నేహితుడితో కలిసి రాత్రిపూట దేవాలయాలకు కన్నం వేశాడు.
కారు, బైక్ కొనుక్కొని తిరుగుతూ చెడు అలవాట్లకు బానిస అయ్యి ఎంజాయ్ చేశాడు. గ్రహాలు అన్ని ఒకేచోట చేరడంతో టీచర్ చిక్కిపోయాడు. టీచర్ ఎన్ని దేవాలయాల్లో చోరీ చేశాడు అని అసలు మ్యాటర్ తెలుసుకున్న పోలీసులు, విద్యాశాఖ అధికారులు బిత్తరపోయారు.

ప్రభుత్వ స్కూల్ టీచర్
కర్ణాటకలోని హావేరి జిల్లాలోని రెట్టిహళ్లి గ్రామానికి చెందిన వసంత్ కుమార్ అలియాస్ వసంత్ (40) అనే వ్యక్తి ఉన్నత విద్యాభ్యాసం చేసి ప్రభుత్వ ఉద్యోగం సంపాధించాలని అనుకున్నాడు. పోటీ పరీక్షలు రాసిన వసంత్ కుమార్ ప్రభుత్వ టీచర్ ఉద్యోగం సంపాదించాడు. హావేరి పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో కొన్ని సంవత్సరాల నుంచి టీచర్ గా ఉద్యోగం చేస్తున్నాడు.

సలీం ఎంట్రీ
ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్ లో పిల్లలకు పాఠాలు చెబుతున్న టీచర్ వసంత్ కుమార్ ప్రతినెల ప్రభుత్వం ఇచ్చే జీతం తీసుకుంటున్నాడు. నాలుగు సంవత్సరాల క్రితం సలీమ్ (28) అనే కేటుగాడు టీచర్ వసంత్ కుమార్ కు పరిచయం అయ్యాడు. రానురాను వసంత్ కుమార్, సలీమ్ చాలా క్లోజ్ అయ్యారు.

రూటు మార్చిన టీచర్
స్నేహితుడు సలీమ్ కారణంగా వసంత్ కుమార్ విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు. ప్రభుత్వం ఇచ్చే జీతం టీచర్ వసంత్ కుమార్ కు సరిపోలేదు. అంతే టీచర్ వసంత్ కుమార్ రూట్ మార్చి స్నేహితుడు సలీమ్ తో కలిసి రాంగ్ రూట్ లో వెళ్లాడు. ప్రతిరోజు స్కూల్ లో పిల్లలకు పాఠాలు చెబుతున్న టీచర్ వసంత్ కుమార్ అతని స్నేహితుడు సలీమ్ తో కలిసి రాత్రిపూట దేవాలయాలకు కన్నం వేశాడు.

చిక్కిపోయిన టీచర్
ఉత్తర కన్నడ జిల్లాలోని యల్లాపురలోని మంచికేరి గ్రామంలోని శ్రీ మహాగజలక్ష్మి అమ్మవారి ఆలయంలో చోరీ చేస్తున్న సమయంలో టీచర్ వసంత్ కుమార్, సలీమ్ స్థానికులకు చిక్కిపోయారు. ఇద్దరిని చితకబాదిన గ్రామస్తులు పోలీసులకు అప్పగించారు. చోరీ చేసిన ఇద్దరిలో ప్రభుత్వ టీచర్ వసంత్ కుమార్ ఉన్నాడని వెలుగు చూడటంతో అందరూ షాక్ అయ్యారు.

18 దేవాలయాల్లో చోరీలు
టీచర్ వసంత్ కుమార్ అతని ఫ్రెండ్ సలీమ్ తో కలిసి ఇప్పటి వరకు హావేరి, ఉత్తర కన్నడ జిల్లాతో పాటు పలు జిల్లాల్లో 18 దేవాలయాల్లో చోరీ చేశాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. చోరీ చేసిన బంగారు నగలు విక్రయించిన టీచర్ వసంత్ కుమార్
కారు, బైక్ కొనుక్కొని తిరుగుతూ చెడు అలవాట్లకు బానిస అయ్యి ఎంజాయ్ చేశాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

వీడు టీచర్ కాదు..... పక్కా 420
టీచర్ వసంత్ కుమార్, సలీమ్ నుంచి రూ. 12 లక్షల విలువైన కారు. బజాజ్ ప్లాటినా బైక్, రూ. 2.29 లక్షల నగదు, బంగారు నగలు, 3.5 కేజీల వెండి ఆభరణాలు, దేవుడి పూజకు ఉపయోగించే విలువైన వస్తువులతో పాటు మొత్తం రూ. 19.20 లక్షల విలువైన వస్తులు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు అన్నారు.

సీసీటీవీ కెమెరాలను వదలని టీచర్
దేవాలయాల్లో హుండిలోని నగదుతో పాటు బంగారు నగలు, వెండి వస్తువులు, సీసీటీవీ కెమెరాలు, కెమెరాలకు ఏర్పాటు చేసిన డీవీఆర్ లు కూడా చోరీ చేసి తప్పించుకుని తిరుగుతున్నారని పోలీసులు చెప్పారు. టీచర్ ఎన్ని దేవాలయాల్లో చోరీ చేశాడు అని అసలు మ్యాటర్ తెలుసుకున్న కర్ణాటక విద్యాశాఖ అధికారులు బిత్తరపోయారు.












Click it and Unblock the Notifications