కన్న కూతుర్ని కొట్టి చంపేసిన తండ్రి, లక్షలు ఖర్చు చేసి గ్రాండ్ గా పెళ్లి చేస్తే ఏడాదికే ఏం చేసిందంటే?
పుట్టింటికి వెళ్లిన తరువాత తల్లిదండ్రులతో పాటు డాక్టర్ చెల్లెలికి ఆమె టార్చర్ పెట్టింది. విసిగిపోయిన తండ్రి అతని కన్న కూతురిని చంపేయడం కలకలం రేపింది.
బెంగళూరు: అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న కూతురు భర్త ఇంట్లో ఆనందంగా ఉంటే అంతకంటే సంతోషించే తల్లిదండ్రులు ఎవ్వరూ ఉండరు. అయితే గ్రాండ్ గా పెళ్లి చేసుకుని సంవత్సరం కూడా భర్తతో కాపురం చెయ్యకుండా ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది.
పుట్టింటికి వెళ్లిన తరువాత తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులకు, డాక్టర్ చెల్లెలికి ఆమె టార్చర్ పెట్టిందని తెలిసింది. విసిగిపోయిన తండ్రి అతని కన్న కూతురిని చంపేయడం కలకలం రేపింది.

భర్తతో గొడవలు
బెంగళూరులోని కొడిగేహళ్లి ధనలక్ష్మి లేఅవుట్ లో రమేష్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. రమేష్ కు ఆశా(32) అనే కుమార్తె ఉంది. ఆశాకు చాలా ఏళ్ల క్రితం వివాహమైంది. అయితే వివాహం చేసుకున్న కొన్ని నెలలు మాత్రం ఆశా ఆమె భర్తతో సంతోషంగా ఉంది. తరువాత ఆశాకు ఆమె భర్తకు నిత్యం గొడవలు జరిగాయి. తరువాత ఆశా భర్తతో గొడవపడి కోడిగేళ్లిలోని ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది.

అందరితో గొడవపడుతున్న ఆశా
లక్షల రూపాయలు ఖర్చు చేసి ఎంతో గ్రాండ్ గా కూతురు ఆశాకు పెళ్లి చేస్తే ఆమె జీవితం ఇలా అయిపోయింది అంటూ ఆమె తండ్రి రమేష్ ఆవేదన చెందాడు. కూతురు జీవితాన్ని చక్కదిద్దేందుకు తల్లిదండ్రులు ఎంత ప్రయత్నించినా ఆశా మాత్రం ఎవరి మాట వినకుండా పట్టుదలగా పుట్టింటిలోనే ఉండిపోయింది. వైద్యురాలిగా పనిచేస్తున్నసోదరితో పాటు తల్లిదండ్రులను ఆశా ప్రతిజు వేధించి వారితో ఇంట్లో తరచూ గొడవలు పడేదని తెలిసింది.

కన్నకూతుర్ని కొట్టి చంపేసిన తండ్రి
ఆశా బుధవారం రాత్రి ఆమె తండ్రి రమేష్ తో పాటు తల్లితో గొడవ పెట్టుకుంది. అయితే రోజూ పెద్ద కూతురు ఆశా వేధింపులతో విసిగిపోయిన తండ్రి రమేష్ సహనం కోల్పోయి నువ్వు ఇంటిలో నుంచి బయటకు వెళ్లిపో అని కూతురికి చెప్పాడు. ఆ సందర్బంలో మాటామాటా పెరిగిపోవడంతో సహనం కోల్పోయిన రమేష్ పెద్ద కర్ర తీసుకుని కూతురు ఆశా తలపై కొట్టాడు.
దీంతో తలకు బలమైన దెబ్బ తగిలి రక్తస్రావం అయింది. వెంటనే ఆశాను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆశా మృతి చెందిందని వైద్యులు చెప్పారు. కూతురు ఆశాను హత్య చేసిన ఆమె తండ్రి రమేష్‌ను బెంగళూరులోని కొడిగేహళ్లి పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications