Jet speed: ఆటోలో ఏడు మంది, ఇంటికి వెళ్లిపోతున్నాము అనుకున్నారు, ఇంతలో ఇన్నోవా కారు వెళ్లి?
బెంగళూరు: కుటుంబ సభ్యులతో కలిసి ఆటో డ్రైవర్ ఇంటికి వెలుతున్నాడు. ఇంటికి వెళ్లి భోజనం చేసి సంతోషంగా నిద్రపోవాలని అందరూ అనుకున్నారు. మార్గం మద్యలోనే మా ప్రాణాలు పోతాయని మహిళలు ఊహించలేకపోయారు. వేగంగా వచ్చిన ఇన్నోవా కారు ఆటో ఢీకొట్టింది. అంతే వాయువేగంతో ఇన్నోవా కారు అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు.
బెంగళూరు నగరంలోని కేఆర్ పురం సమీపంలో శుక్రవారం ఇన్నోవా ఆటోను ఢీకొట్టిన తీరుతో స్థానిక ప్రజలు హడలిపోయారు. కేఆర్ పురం ఆర్టీఓ కార్యాలయం ఎదుట ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారణం అయిన డ్రైవర్ ఇన్నోవా కారుతో పరారైనాడు. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు.

మృతులను ఫాజిలా, తసీనాగా గుర్తించామని పోలీసులు అన్నారు. కే ఆర్.పురం మీదుగా ఆటోలో ఏడుమంది వెలుతున్నారని పోలీసులు అన్నారు. ఆటో డ్రైవర్ ఖలీద్, అతని భార్య తసీనా, ఖలీద్ సోదరి ఫజీలాతో పిల్లలు ఆటోలో బయలుదేరారు. ఈ సందర్భంగా మితిమీరిన వేగంతో ఇన్నోవా కారు వెళ్లి ఆటోను ఢీకొనడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. రెండేళ్ల చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. మిగిలిన వారికి కూడా గాయాలు కావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని కేఆర్ పురం ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
కేఆర్ పురం ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి విచారణ చేస్తున్నారు. ఆటోను ఢీకొట్టిన ఇన్నోవా కారు డ్రైవర్ వాహనంతో సహ అక్కడి నుంచి పరారయ్యాడు. ప్రమాదానికి కారణం అయ్యింది బ్లాక్ కలర్ ఇన్నోవా కారు అని ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు చెప్పారు. కేఆర్ పురం ఆర్ టీఓ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో, ట్రాఫిక్ సిగ్నల్స్ లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు పరిశీలిస్తున్న పోలీసులు ఇన్నోవా కారు డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications