Youth: నిన్న బీజేపీ నాయకుడు, నేడు ఫాజిల్, పక్కాప్లాన్ తో ఫినిష్, అసలు ఏం జరుగుతోంది?!
మంగళూరు/ బెంగళూరు: కర్ణాటకలో మరోసారి యువకుడు దారుణ హత్యకు గురైనాడు. మూడు రోజుల క్రితం బీజేపీ నాయకుడు హత్యకు గురి కావడంతో కరావళి ప్రాంతంతో పాటు కర్ణాటక ప్రజలు ఉలిక్కిపడ్డారు. బీజేపీ నాయకుడి హత్య కేసు దర్యాప్తులో ఉన్న సమయంలోనే మరో వర్గం యువకుడు అదే టైపులో దారుణ హత్యకు గురైనాడు.
కర్ణాటకలోని మంగళూరుకు సమీపంలోని సూరత్కల్ లో గురువారం రాత్రి ఫాజిల్ అనే యువకుడు అతని స్నేహితులతో కలిసి మాట్లాడుతున్నాడు. ఆ సందర్బంలో మంకీ క్యాప్ లు వేసుకుని కొందరు యువకులు ఫాజిల్ ఉన్న ప్రాంతానికి వెళ్లారు.
ఫాజిల్ అతని పనిలో అతను ఉన్న సమయంలో మంకీ క్యాప్ లు వేసుకున్న వ్యక్తులు ఫాజిల్ ను దారుణంగా నరకడంతో పాటు ఇష్టం వచ్చినట్లు పొడిచేశారు. తీవ్రగాయాలైన ఫాజిల్ కుప్పకూలిపోయాడు. విషయం గుర్తించిన స్థానికులు, ఫాజిల్ స్నేహితులు అతన్ని ఆసుపత్రికి తరలించారు.

అప్పటికే కత్తిపోట్లు విపరీతంగా పడటంతో ఫాజిల్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఫాజిల్ హత్యకు గురి కావడంతో సూరత్కల్ తో పాటు మంగళూరుతో సహ నాలుగు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించామని మంగళూరు పోలీసు అధికారులతో పాటు స్థానిక పోలీసులు తెలిపారు.
ఫాజిల్ అతని స్నేహితులతో మాట్లాడుతున్న సందర్బంలో కొందరు వ్యక్తులు అతని మీద దాడి చేసి హత్య చేశారని పోలీసు అధికారులు అంటున్నారు. మంగళవారం రాత్రి కొందరు వ్యక్తులు బీజేపీ నాయకుడు ప్రవీణ్ ను దారుణంగా నరికి చంపేయడం కలకలం రేపింది.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications