బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Zika virus: కర్ణాటకలో జికా వైరస్ కేసు నమోదు, ఆ అమ్మాయి ఎక్కడా తిరగలేదు. ఏమీ చెయ్యలేదు, కాని!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/రాయచూర్: కరోనా వైరస్ తరువాత జికా వైరస్ ప్రజలను భయపెడుతోంది. కర్ణాటకలో మొదటిసారి జికా వైరస్ కేసు నమోదు కావడంతో అక్కడి ప్రజలు హడలిపోతున్నారు. గతంలో కేరళ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో జికా వైరస్ దెబ్బతో ప్రజలు హడలిపోయారు. ఇప్పుడు కర్ణాటకలో మొదటి జికా వైరస్ కేసు నమోదు కావడం కలకలం రేపింది. ఓ అమ్మాయి జికా వైరస్ బారినపడింది.

Father: తండ్రిని 30 ముక్కలుగా నరికేసిన కొడుకు, సొంత ఫామ్ హౌస్ లో బోర్ బావిలో వేసి కూల్ గా!Father: తండ్రిని 30 ముక్కలుగా నరికేసిన కొడుకు, సొంత ఫామ్ హౌస్ లో బోర్ బావిలో వేసి కూల్ గా!

కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలోని మాన్వి తాలుకాలోని ఓ గ్రామంలో నివాసం ఉంటున్న 5 ఏళ అమ్మాయితో పాటు ముగ్గురు అనారోగ్యానికి గురైనారు. ముగ్గురిని బళ్లారిలోని విమ్స్ ఆసుపత్రికి తరలించారు డిసెంబర్ 5వ తేదీన అనారోగ్యంతో బాధపడుతున్న ముగ్గురి రక్త నమూనాలు సేకరించి పూణేలోని ల్యాబ్ కు పంపించారు.

Zika virus: Karnataka confirmed its first ever case of Zika virus after a five-year-old girl from Raichur near Ballari tested positive

5 ఏళ్ల బాలికకు జికా వైరస్ సోకిందని పూణే నుంచి నివేదికలు వచ్చాయని కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్ సుధాకర్ క్లారిటీ ఇచ్చారు. ఈ బాలిక ఇటీవల కాలంలో ఎక్కడికి ప్రయాణించలేదని, దోమల కారణంగా జికా వైరస్ వ్యాపించి ఉంటుందని, జికా వైరస్ వ్యాపించకుండా కట్టడి చెయ్యడానికి ఆరోగ్య శాఖ సిబ్బంది అన్ని చర్యలు తీసుకుంటున్నారని కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్ సుధాకర్ మీడియాకు చెప్పారు.

Wife: నా భర్త కోడళ్లతో కుమ్మక్కు అయ్యాడు, అర్దరాత్రి నా మీద పెట్రోల్ పోసి ?, భార్య స్టేట్ మెంట్ తో?Wife: నా భర్త కోడళ్లతో కుమ్మక్కు అయ్యాడు, అర్దరాత్రి నా మీద పెట్రోల్ పోసి ?, భార్య స్టేట్ మెంట్ తో?

రాయచూరు జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలు ఏమైనా అనుమానాలు ఉంటే వెంటనే వైద్యపరీక్షలు చేయించుకోవాలని కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్ సుధాకర్ మనవి చేశారు. జికా వైరస్ వలన ప్రజలు భయపడకూడదని, ఆ వ్యాధిని కట్టడి చెయ్యడానికి మా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్ సుధాకర్ అన్నారు. మొత్తం మీద కర్ణాటకలో మొదటి జికా వైరస్ కేసు నమోదు కావడంతో అక్కడి ప్రజలు ఆందోళనకు గురౌతున్నారు.

English summary
Zika virus: Karnataka confirmed its first ever case of Zika virus after a five-year-old girl from Raichur near Ballari tested positive.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X