తేనెటీగల దాడి: భర్త మృతి, భార్య పరిస్థితి విషమం!
లక్నో: తేనెటీగల దాడిలో భర్త మరణించగా, భార్య తీవ్రంగా గాయపడిన ఉదంతమిది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ జిల్లాలోని రతన్‌లాల్ నగర్‌లో సోమవారం చోటుచేసుకుంది.
రతన్‌లాల్ నగర్‌లోని తమ ఇంటిముందు సత్నాం మంజ్వాని(60), ఆయన భార్య గౌరి నిలబడి మాట్లాడుకుంటుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఎక్కడ్నించి వచ్చాయో తెలియదుగానీ హఠాత్తుగా వారిపైన తేనెటీగల గుంపు దాడి చేసింది. ఈ ఘటనలో వారి బంధువు ప్రకాష్ కూడా గాయపడ్డాడు.

ఇది గమనించగానే ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే తీవ్రంగా గాయపడిన సత్నాం మంజ్వాని తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోగా అతడ్ని, అతడి భార్య గౌరిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మంజ్వాని మరణించినట్లు అక్కడి వైద్యులు తెలిపారు.
మరోవైపు తేనెటీగల దాడిలో తీవ్రంగా గాయపడిన మంజ్వాని భార్య గౌరి సాకేత్ నగర్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అయితే ఆమె పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు అక్కడి వైద్యులు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications