Amazon Layoffs: మరో 14,000 మందిపై వేటు!

గ్లోబల్ టెక్ జెయింట్ అమెజాన్ మరోసారి 'లేఆఫ్స్' అస్త్రాన్ని ప్రయోగించబోతోంది. 2026 ప్రారంభంలోనే 16,000 మందిని తొలగించి షాక్ ఇచ్చిన ఈ సంస్థ, మే నెల నాటికి అదనంగా మరో 14,000 మందిని తొలగించేందుకు సిద్ధమవుతున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇదే జరిగితే, కేవలం 2026 లోనే అమెజాన్ కోల్పోయిన మొత్తం ఉద్యోగాల సంఖ్య 30,000 మార్కుకు చేరుకుంటుంది.

అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ నేతృత్వంలో జరుగుతున్న ఈ భారీ మార్పులకు ప్రధాన కారణం 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్'. జనరేటివ్ AI మరియు ఆటోమేషన్ వ్యవస్థలు అందుబాటులోకి రావడంతో, మానవ వనరుల అవసరం తగ్గిందని కంపెనీ భావిస్తోంది. ఈసారి ప్రధానంగా మిడ్-లెవల్ మేనేజర్లు, హెచ్ఆర్ (HR), క్లౌడ్ కంప్యూటింగ్ (AWS) - రిటైల్ విభాగాల్లోని 'వైట్ కాలర్' ఉద్యోగులే లక్ష్యంగా ఈ తొలగింపులు ఉండబోతున్నాయి. అయితే, వేర్‌హౌస్ - లాజిస్టిక్స్ విభాగాల్లో పనిచేసే కింది స్థాయి సిబ్బందికి ప్రస్తుతానికి ఎలాంటి ముప్పు లేదని సమాచారం.

Amazon Layoffs 2026 Tech Giant to Cut 14 000 More Jobs Globally to Boost AI Efficiency and Reduce Bureaucracy

నిర్వహణ భారం తగ్గింపు.. లాభాల వేట!

సంస్థలోని అంతర్గత బ్యూరోక్రసీని తగ్గించడం, మేనేజ్మెంట్ స్థాయిలను సరళీకరించడం ద్వారా వ్యయ సామర్థ్యాన్ని పెంచుకోవాలని అమెజాన్ లక్ష్యంగా పెట్టుకుంది. ఒకవైపు ఉద్యోగులను తొలగిస్తూనే, మరోవైపు AI మౌలిక సదుపాయాల కోసం $125 బిలియన్ల భారీ పెట్టుబడిని కేటాయించడం గమనార్హం. అంటే, మనుషుల కంటే యంత్రాలకే కంపెనీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టమవుతోంది.

అయోమయంలో ఉద్యోగులు

కంపెనీ అధికారికంగా ఈ వార్తలను ధృవీకరించనప్పటికీ, అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలు ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పనితీరును అంచనా వేసే కొలమానాల్లో (Metrics) పారదర్శకత లేకపోవడం, ఎప్పుడు ఎవరిపై వేటు పడుతుందో తెలియని అనిశ్చితి ఐటీ కారిడార్‌లో భయాందోళనలు రేకెత్తిస్తోంది. చైనా వంటి ప్రాంతాల్లో ఇప్పటికే టీమ్-స్థాయి మార్పులు మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి.

సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ మానవ శ్రమకు విలువ తగ్గుతుందా? అనే చర్చకు అమెజాన్ తాజా నిర్ణయాలు ఆజ్యం పోస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ తొలగింపుల పర్వం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+