ఐడీబీఐలో ఇంటి దొంగలు: రూ.445.32 కోట్లకు కుచ్చుటోపీ.. 31 మందిపై కేసు

హైదరాబాద్: బ్యాంకులను మోసం చేసిన దగాకోరుల చిట్టా ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నది. ఇటువంటి దగాకోరుల వలన నష్టపోయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరసన తాజాగా ఐడీబీఐ బ్యాంకు చేరింది. ఈ బ్యాంకు నుంచి దాదాపు రూ.445.32 కోట్ల మేరకు రుణం తీసుకున్న 31 మందిపై సీబీఐ శుక్రవారం కేసు నమోదు చేసింది.

సీబీఐ అరెస్ట్ చేసిన వారిలో ఐడీబీఐ మాజీ జనరల్ మేనేజర్ బట్టు రామారావు, మరో 21 సంస్థలు ఉండటం గమనార్హం. రామారావు అక్రమాలు బయటికి రావడంతో బ్యాంకు అతన్ని ఉద్యోగం నుంచి తొలగించింది. హైదరాబాద్‌లోని ఐడీబీఐ రీజినల్ హెడ్ మంజునాథ్ పాయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు.

ఇలా ఐడీబీఐ అధికారుల కుట్ర
చేపల పెంపకందారులకు మంజూరు చేసే రుణాలతోపాటు, ఇతర రుణాల్ని విడుదల చేయడంలో అప్పటి బషీర్‌బాగ్ ఐడీబీఐ బ్యాంకు శాఖ డీజీఎం బట్టు రామారావు, చీఫ్ జనరల్ మేనేజర్ ఆర్ దామోదరన్‌ కుట్రపూరితంగా వ్యవహరించి 22 గ్రూపులకు రూ.192.98 కోట్ల రుణాలను మంజూరు చేయడంలో తోడ్పడ్డారు. ప్రస్తుతం మొత్తం రుణబకాయి రూ.445.32 కోట్లకు చేరినట్లు ఐడీబీఐ గుర్తించింది.

CBI files case against 31 persons in Rs 445 crore fraud with IDBI

హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వరకు ఇలా శఠగోపం
ఐడీబీఐ హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్, హబ్సిగూడ శాఖలతో పాటు విశాఖపట్నం జిల్లా సిరిపురం శాఖ ఈ రుణాలు మంజూరు చేయడం గమనార్హం. రుణగ్రహీతలు ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలతోపాటు తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో చేపలను పెంచుతున్నట్లు చూపి ఈ రుణాలను మంజూరు చేశారు. వాస్తవానికి వీరిలో ఎవరూ చేపలు పెంచడం లేదని బ్యాంకు గమనించింది.

వ్యక్తిగత ఖాతాల్లో రుణ మొత్తాల బదిలీలు
బ్యాంకు విడుదల చేసిన రుణ మొత్తాలను ఆయా సంస్థల ప్రతినిధులు తమ వ్యక్తిగత పొదుపు ఖాతాల్లోకి బదిలీ చేసుకున్నారని సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో ఐడీబీఐ తెలిపింది. రుణాన్ని మంజూరు చేసేటప్పుడు ఆయా సంస్థలు దాఖలు చేసిన తనఖా దస్తావేజులు నకిలీవిగా బ్యాంకు గుర్తించింది. మొత్తానికి 2009 నుంచి 2012 దాకా దాదాపు 220 రుణ ఖాతాల నుంచి రూ.192.98 కోట్ల రుణాన్ని ఐడీబీఐ విడుదల చేసింది.

దక్కన్ క్రానికల్ చైర్మన్‌పై సీబీఐ కేసు
ఆర్థిక నేరగాళ్లపై ఉక్కుపాదం మోపుతున్న కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తాజాగా డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (డీసీహెచ్‌ఎల్), ఆ సంస్థ చైర్మన్ టీ వెంకట్రామ్ రెడ్డితోపాటు మరికొంత మంది ఇతరులపై ఛీటింగ్ కేసు నమోదు చేసింది.

CBI files case against 31 persons in Rs 445 crore fraud with IDBI

కేర్, ఐడీఎఫ్సీలపైనా కేసు
ప్రభుత్వ రంగంలోని ప్రముఖ బీమా సంస్థ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ (యూఐఐసీ) లిమిటెడ్‌ను రూ.30.54 కోట్లకు మోసగించారన్న అభియోగాల మేరకు వీరితో పాటు యూఐఐసీ చెన్నై పెట్టుబడుల విభాగ మాజీ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఏ బాలసుబ్రమణియన్, మాజీ ఛీఫ్ మేనేజర్ కేఎల్ కుంజీల్వర్, సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) నుంచి ఆమోదం పొందిన ప్రముఖ రేటింగ్ సంస్థ కేర్, ఐడీఎఫ్‌సీలపై కూడా సీబీఐ కేసు నమోదు చేసినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు.

ఇలా నేరపూరిత కుట్ర
నేరపూరిత కుట్రలో భాగంగా బాలసుబ్రమణియన్, కుంజీల్వర్ 2011లో డీసీహెచ్‌ఎల్ జారీ చేసిన అన్‌సెక్యూర్డ్ రిడీమబుల్ నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లలో స్వల్పకాలిక పెట్టుబడులు పెట్టారని, ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించకపోవడంతో యూఐఐసీకి రూ.30.54 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+