కుప్పకూలిన ధరలు: సీజ్ ఫైర్ దెబ్బకు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించిన తరువాత ముడి చమురు ధరలు కుప్పకూలాయి. ఏకంగా 17 శాతం మేర పడిపోయాయి. ఒకే రోజు ఈ స్థాయిలో పతనం కావడం క్రూడాయిల్ చరిత్రలో ఇదే తొలిసారి. హార్ముజ్ జలసంధిని సురక్షితంగా తిరిగి తెరవాలనే షరతుతో కూడిన ఈ దౌత్యపరమైన పురోగతి ఈ ఏడాది ప్రారంభంలో ధరలను రికార్డు స్థాయికి పెంచిన వార్ ప్రీమియాన్ని గణనీయంగా తగ్గించింది.

భారత్ లో పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలు స్థిరంగా కొనసాగాయి. చమురు మార్కెటింగ్ సంస్థలు సాధారణంగా అంతర్జాతీయ ధరల 15 రోజుల సగటు ఆధారంగా పంప్ ధరలను సర్దుబాటు చేస్తాయి. ఈ విధానం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో వచ్చిన తక్షణ మార్పులు దేశీయంగా ప్రతిబింబించడానికి సమయం పడుతుంది. కాల్పుల విరమణ ఒప్పందం ధృవీకరించబడిన వెంటనే అంతర్జాతీయ బెంచ్‌మార్క్‌లు 15 శాతం నుండి 20 శాతం వరకు పడిపోయాయి. గంటల వ్యవధిలోనే బ్యారెల్‌కు సుమారు 26 డాలర్లను కోల్పోయింది.

Crude Crashes 17 Percent on US-Iran Ceasefire as India Petrol and Diesel Prices Stay Steady

వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ లో క్రూడ్ ధర 94.85- 96.17 డాలర్ల మధ్య ఉండగా, దాదాపు 16-17 శాతం పతనం కనిపించింది. 100 డాలర్ల దిగువకు పడిపోయింది. బ్రెంట్ క్రూడ్ ధర కూడా 92.30 - 95.37 డాలర్ల మధ్య ట్రేడ్ అవుతోంది. ఇక్కడ దాదాపు 13-16 శాతం మేర క్షీణత నెలకొంది. అదే సమయంలో విక్రయాలు సైతం భారీగా జరిగాయి. ఇంట్రాడే పీక్-టు-ట్రాఫ్ 117.63 నుండి 91.05 డాలర్లకు పడిపోవడంతో 26 డాలర్లు తగ్గింది

ఈ పరిణామాల మధ్య వివిధ నగరాల్లో పెట్రోల్ రేట్ల వివరాలిలా ఉన్నాయి.

హైదరాబాద్ లో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 107.46

ఢిల్లీలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 94.77

కోల్‌కతాలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 105.41

ముంబైలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 103.54

చెన్నైలో పెట్రోల్ ధర: లీటరుకు రూ.101.06

భువనేశ్వర్‌లో పెట్రోల్ ధర: లీటరుకు రూ.100.94

డీజిల్ ధరలు ఇవీ..

హైదరాబాద్ లో డీజిల్ ధర: లీటరుకు రూ. 95.70,

ఢిల్లీలో డీజిల్ ధర: లీటరుకు రూ. 87.67

కోల్‌కతాలో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.02

ముంబైలో డీజిల్ ధర: లీటరుకు రూ. 90.03

చెన్నైలో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.61

భువనేశ్వర్‌లో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.52

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+