బంగారంతో రోడ్డు.. ప్రపంచంలోనే ఫస్ట్ గోల్డ్ వాక్‌వే చుశారా!

ఆకాశాన్ని తాకే మేడలు, అద్భుతమైన పర్యాటక వింతలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే దుబాయ్ నగరం.. ఇప్పుడు ప్రపంచ పర్యాటకులను మరో కొత్త లోకానికి తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. అడుగు తీసి అడుగు వేస్తే పసిడి వెలుగులు లీనుతూ, సరికొత్త రాజసాన్ని అందించేలా మేలిమి 24 క్యారెట్ల బంగారంతో రూపొందుతున్న ఓ సుదీర్ఘమైన నడక మార్గం త్వరలోనే రూపుదిద్దుకోనుంది. పసిడి వ్యాపారంలో సరికొత్త విప్లవానికి తెరతీస్తూ ఏర్పడిన 'దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్' పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించాలనే సంకల్పంతో ఈ సాహసోపేత ప్రాజెక్టును తలకెత్తుకుంది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఈ 'గోల్డెన్ వాక్‌వే' మరో రెండు నెలల్లోనే ప్రజలకు అందుబాటులోకి రానుండటం విశేషం.

పసిడి నడక.. పర్యాటకుల కల నెరవేరే వేళ

దుబాయ్‌లోని చారిత్రక డెయిరా ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక గోల్డ్ డిస్ట్రిక్ట్, వ్యాపార రంగాన్ని పర్యాటక రంగాన్ని ఒకే తాటిపైకి తెస్తోంది. బంగారు ఆభరణాల విక్రయాలు, హోల్‌సేల్ వర్తకం, పసిడి రంగానికి చెందిన అంతర్జాతీయ పెట్టుబడులను ఒకే వేదికపైకి తెచ్చేందుకు ఈ ప్రాంతం ప్రధాన కేంద్రంగా మారింది. ఇక్కడ ఏర్పాటు చేయనున్న 24 క్యారెట్ల బంగారు నడక మార్గంలో అడుగుపెట్టడం పర్యాటకులకు ఓ అరుదైన, మరపురాని అనుభవంగా మారనుంది. ప్రపంచ పసిడి మార్కెట్‌లో దుబాయ్ అధిపత్యాన్ని ఈ అద్భుతం మరోసారి ప్రపంచానికి చాటిచెప్పనుందని వ్యాపార వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

Dubai To Open World s Longest 24-Karat Gold Walkway In Gold District By End Of 2026 Tourist Alert

వ్యాపారంలో సరికొత్త రికార్డులు

కేవలం పర్యాటక ఆకర్షణలకే పరిమితం కాకుండా, వ్యాపార రీత్యా కూడా ఈ గోల్డ్ డిస్ట్రిక్ట్ ఊహించని వేగంతో ఎదుగుతోంది. ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటివరకు హోల్‌సేల్ బంగారు వ్యాపార కార్యాలయాల సంఖ్య ఇక్కడ ఏకంగా 20 శాతం పెరిగింది. అలాగే విలువైన రత్నాలు, పసిడి ఆభరణాలు, విలాసవంతమైన గడియారాల విక్రయ సంస్థలు 15 శాతం మేర కొత్తగా కొలువుదీరాయి. వచ్చే ఏడాది నాటికి మరిన్ని అంతర్జాతీయ సంస్థలు ఇక్కడికి తరలివస్తాయని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా, మధ్యప్రాచ్యంలోనే అత్యంత భారీ స్థాయిలో బంగారం, ఎగ్జిబిషన్ నిర్వహించేందుకు ఇక్కడ మౌలిక వసతులను వేగంగా విస్తరిస్తున్నారు.

ప్రపంచంలోనే నంబర్ వన్ పొల్యూషన్ సిటీ.. 22 మన దేశంలోనే
ప్రపంచంలోనే నంబర్ వన్ పొల్యూషన్ సిటీ.. 22 మన దేశంలోనే

అబ్బురపరిచే 'మయూర సహస్ర'.. రెండు గిన్నిస్ రికార్డులు!

ఈ బంగారు వార్తల హడావుడిలోనే దుబాయ్ వేదికగా మరో అరుదైన ఘట్టం నమోదు కావడం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ప్రముఖ ఆభరణాల సంస్థ 'జోయాలుక్కాస్' తయారు చేసిన సాంప్రదాయ భారతీయ జుంకా చెవిపోగులు రెండు గిన్నిస్ ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్నాయి. ఏకంగా 16.514 కిలోల బరువుతో 22 క్యారెట్ల మేలిమి బంగారంతో తయారు చేసిన ఈ జుంకాలకు 'మయూర సహస్ర' (వేయి నెమళ్లు) అని నామకరణం చేశారు. మనదేశ జాతీయ పక్షి నెమలి ఆకృతి, దాని సౌందర్యాన్ని ప్రతిబింబించేలా తీర్చిదిద్దిన ఈ ఆభరణాలు, ప్రపంచంలోనే అత్యంత బరువైన, అతిపెద్ద చెవిపోగులుగా చరిత్రకెక్కాయి.

Michael Jackson కట్టిన మాయా ప్రపంచం.. ఏకంగా 2,700 ఎకరాలు కొనేశాడు!
Michael Jackson కట్టిన మాయా ప్రపంచం.. ఏకంగా 2,700 ఎకరాలు కొనేశాడు!

పర్యాటకులకు శాశ్వత విందు!

ఇటీవలే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి సమక్షంలో అట్టహాసంగా ఆవిష్కరించిన ఈ రికార్డు జుంకాలను అమ్మకానికి పెట్టకుండా, దుబాయ్‌కి వచ్చే పర్యాటకుల సందర్శనార్థం శాశ్వతంగా ప్రదర్శనలో ఉంచనున్నారు. ఒకవైపు వింత గిన్నిస్ రికార్డుల జుంకాలు, మరోవైపు కళ్లుమిరుమిట్లు గొలిపే 24 క్యారెట్ల బంగారు రహదారి.. వీటికి తోడు రాబోయే అంతర్జాతీయ స్థాయి ఎగ్జిబిషన్లు కలిపి దుబాయ్ పర్యటనను కేవలం ఒక షాపింగ్ అనుభవంగా కాకుండా, పర్యాటకుల జీవితంలో నిలిచిపోయే ఒక తీపి జ్ఞాపకంగా మార్చనున్నాయి. వివరాలన్నీ రహస్యంగా ఉంచినప్పటికీ, త్వరలోనే అందుబాటులోకి రానున్న ఈ కొత్త బంగారు ప్రపంచం కోసం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+