Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం బిగ్ న్యూస్..! ఇక ఆటోమేటిక్ రిఫండ్..!

మూడేళ్లుగా ఎలాంటి లావాదేవీలు జరగని పీఎఫ్ ఖాతాల్లో కనీస నిల్వ వెయ్యి, అంతకంటే తక్కువ ఉంటే దాన్ని ఆటోమేటిగ్గా వారి సేవింగ్స్ ఖాతాలకు పంపబోతున్నారు.

పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం ఇవాళ భారీ ఊరట కల్పించే వార్త చెప్పింది. ఈపీఎఫ్ (EPFO)ఖాతాల్ని ఓ దశ వరకూ నిర్వహించే ఆ తర్వాత వదిలేసిన వాటిలో మిగిలిపోయిన డబ్బుల్ని ఆటోమేటిగ్గా ఖాతాదారులకు చెల్లించాలని కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఇది ఎవరికి వర్తిస్తుందో కూడా కేంద్రం వెల్లడించింది. దీంతో వారు ఇకపై ఆ డబ్పుల కోసం పీఎఫ్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని తెలిపింది.

పీఎఫ్ ఖాతాల్లో చిన్న చిన్న బ్యాలెన్స్ లు మిగిలిపోయి, ఇన్ ఆపరేట్ గా ఉన్న ఖాతాలుంటే వాటిలో ఖాతాదారులు దాచుకున్న వెయ్యి లేదా అంత కంటే తక్కువ మొత్తాల్ని ఆటోమేటిగ్గా వాటికి లింక్ అయి ఉన్న సేవింగ్స్ ఖాతాల్లోకి పంపాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ఒక పైలట్ ప్రాజెక్ట్‌ను ఆమోదించింది. దీనికి ఖాతాదారులు ఎటువంటి దరఖాస్తు లేదా పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు.

EPFO Major Relief Subscribers with Inoperative Accounts 1 000 or Less to Get Automatic Refund

మూడు సంవత్సరాల పాటు ఎటువంటి చందా చెల్లించకుండా, లావాదేవీ జరగకుండా ఉంటే సదరు ఈపీఎఫ్‌ఓ ఖాతాను నిరుపయోగంగా పరిగణిస్తారు. తాజా నిర్ణయం ప్రకారం ఇందులో వెయ్యి లేదా అంతకన్నా తక్కువ నిల్వ ఉంటే ఆ డబ్బును నేరుగా చందాదారుల లింక్ చేయబడిన బ్యాంకు ఖాతాకు బదిలీ చేస్తారు. లబ్ధిదారులు ఈ ప్రక్రియకు ఎటువంటి క్లెయిమ్ దాఖలు చేయనవసరం లేదు.

EPFO Major Relief Subscribers with Inoperative Accounts 1 000 or Less to Get Automatic Refund

ప్రస్తుతం ప్రభుత్వ లెక్కల ప్రకారం ఏడు లక్షలకు పైగా నిరుపయోగ ఖాతాలు ఉన్నాయి. ఆధార్‌తో లింక్ చేసిన ఈ ఖాతాలకు సొమ్ము తక్షణమే చెల్లిస్తారు. మిగిలిన అర్హత కలిగిన ఖాతాలకు బదిలీలు దశలవారీగా జరుగుతాయి.ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే, మిగిలిన 25 లక్షల నిరుపయోగ ఖాతాలను కూడా ఇలాంటి స్వయంచాలక వాపసు విధానం కిందకు తీసుకురావచ్చని భావిస్తున్నారు. ఈ ఖాతాలు గత మూడు సంవత్సరాలుగా ఎటువంటి కార్యకలాపాలు లేనివి, 20 సంవత్సరాలకు పైగా పాతవి కూడా. నిధుల సెటిల్‌మెంట్‌ను క్రమబద్ధీకరించడం, రాతపని తగ్గించడం, కార్మికులకు త్వరితంగా డబ్బులు అందించడమే దీని ఉద్దేశం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+