పండగ సీజన్ ఎఫెక్ట్- బంగారం ధరల్లో మరో తగ్గుదల
అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ భవిష్యత్ వడ్డీ రేట్ల నిర్ణయాలపై నెలకొన్న అనిశ్చితి కారణంగా పసిడి, వెండి ధరల్లో ఒడుదొడుకులు నమోదవుతున్నాయి. బంగారం ధరల్లో తగ్గుదల కొనసాగుతోంది. దేశంలో ధన్ తెరాస్, దీపావళి పండుగల కొనుగోళ్ల తర్వాత బంగారం ధరలు మరోసారి తగ్గుదలను నమోదు చేసుకున్నాయి. సోమవారం నాటి క్లోజింగ్ సెషన్ తో పోల్చుకుంటే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ. 490 మేర తగ్గింది.
ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ విడుదల చేసిన బెంచ్ మార్క్ రేట్ల ప్రకారం.. 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర 1,43,1400 రూపాయల వద్ద రికార్డయింది. 22 క్యారెట్ల 10 గ్రాముల ఆభరణాల బంగారం ధర 1,31,212 రూపాయల వద్ద కొనసాగుతోంది. మార్కెట్లో పసిడి రేట్లు స్థిరంగా ఉండటంతో నాణేలు, లైట్‌వెయిట్ జ్యువెలరీ సెట్లు, విలువైన రాళ్లు పొదిగిన ఆభరణాలకు డిమాండ్ బాగా పెరిగింది.

హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,44,110 వద్ద స్థిరపడింది. 10 గ్రాముల 22 క్యారెట్లు రూ. 1,32,250 గా నమోదైంది. ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 1,44,110 గా రికార్డు కాగా.. 22 క్యారెట్లు రూ. 1,32,022 వద్ద ట్రేడ్ అయింది. చెన్నైలో ఇవే రేట్లు వరుసగా రూ. 1,39,910, రూ.1,32,022 వద్ద నిలిచాయి. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,44,129, 22 క్యారెట్లు రూ. 1,32,022 వద్ద కొనసాగుతున్నాయి.
నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 14,411, 22 క్యారెట్లు - రూ. 13,105, 18 క్యారెట్లు - రూ. 10,823
ముంబై..
24 క్యారెట్లు- రూ. 14,411, 22 క్యారెట్లు - రూ. 13,210, 18 క్యారెట్లు - రూ. 10,808
బెంగళూరు..
24 క్యారెట్లు- రూ. 14,411, 22 క్యారెట్లు - రూ. 13,210, 18 క్యారెట్లు - రూ. 10,808
హైదరాబాద్..
24 క్యారెట్లు- రూ. 14,411, 22 క్యారెట్లు - రూ. 13,210, 18 క్యారెట్లు - రూ. 10,808
విజయవాడ..
24 క్యారెట్లు- రూ. 14,411, 22 క్యారెట్లు - రూ. 13,210, 18 క్యారెట్లు - రూ. 10,808
విశాఖపట్నం..
24 క్యారెట్లు- రూ. 14,411, 22 క్యారెట్లు - రూ. 13,210, 18 క్యారెట్లు - రూ. 10,808












Click it and Unblock the Notifications
