పసిడికి అమాంతం పెరిగిన గిరాకీ- దెబ్బకు.. !!
అంతర్జాతీయ మార్కెట్ లో ఏర్పడిన మార్పుల నేపథ్యంలో దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. పశ్చిమ ఆసియాలో.. ముఖ్యంగా అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న భౌగోళిక, రాజకీయ అనిశ్చిత పరిస్థితులు మార్కెట్ ను అస్థిరత్వాన్ని గురి చేస్తోన్నాయి. ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించాలనే తీర్మానాన్ని యుఎస్ సెనెట్ తిరస్కరించడం మార్కెట్ వర్గాలలో ఆందోళనలను మరింత పెంచింది. ఈ ఉద్రిక్తతల పరిణామాలతో సురక్షిత పెట్టుబడిగా భావించే పసిడికి గిరాకీ ఒక్కసారిగా పుంజుకుంది.
అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ధర 0.2 శాతం మేర పెరిగి సుమారు 4,288.36 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లల్లో యధాతథ స్థితిని సుదీర్ఘకాలం పాటు కొనసాగించవచ్చనే అంచనాలు వెలువడటం వల్ల డాలర్ బలపడుతోంది. దీని ప్రభావం బంగారం రేట్లపై పడింది. దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.13 శాతం లాభపడి.. 10 గ్రాములకు రూ. 1,51,780 కు చేరింది.

గురువారం నాటి క్లోజింగ్ సెషన్ తో కంపేర్ చేస్తే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలో రూ. 160 పెరుగుదల కనిపించింది. 22 క్యారెట్లల్లో రూ. 150, 18 క్యారెట్లల్లో రూ. 120 మేర పెరిగింది. ఇది నామమాత్రమే అయినప్పటికీ.. ఇదే ఊపు వచ్చే వారం కూడా కొనసాగుతుందనడానికి కేంద్రబిందువు అయింది. వెండి స్వల్పంగా తగ్గింది. కిలో వెండి ధర 0.10 శాతం మేర క్షీణించి రూ. 2,33,810 వద్ద ట్రేడ్ అవుతోంది.
హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,38,600 కాగా.. 24 క్యారెట్లు రూ. 1,51,200 పలుకుతోంది. ఇక్కడి వెండి రూ. 2,32,680 లకు లభిస్తోంది. ముంబై లో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ. 1,38,884, 24 క్యారెట్లు రూ. 1,51,510, వెండి కిలో రూ. 2,33,380 వద్ద నిలిచింది. బెంగళూరులో ఇవే రేట్లు వరుసగా రూ. 1,38,893, రూ. 1,51,520, రూ. 2,33,170 వద్ద కొనసాగుతున్నాయి. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 1,39,187, 24 క్యారెట్లు రూ. 1,51,840, వెండి కిలో రూ. 2,33,670 లకు చేరుకుంది.
వివిధ నగరాల్లో నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి.
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 15,284, 22 క్యారెట్లు - రూ. 14,010, 18 క్యారెట్లు - రూ. 11,780
ముంబై..
24 క్యారెట్లు - రూ. 15,284, 22 క్యారెట్లు- రూ. 14,010, 18 క్యారెట్లు - రూ. 11,463
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 15,284, 22 క్యారెట్లు- రూ. 14,010, 18 క్యారెట్లు - రూ. 11,463
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 15,284, 22 క్యారెట్లు- రూ. 14,010, 18 క్యారెట్లు - రూ. 11,463
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 15,284, 22 క్యారెట్లు- రూ. 14,010, 18 క్యారెట్లు - రూ. 11,463
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 15,284, 22 క్యారెట్లు- రూ. 14,010, 18 క్యారెట్లు - రూ. 11,463














Click it and Unblock the Notifications
