Gold Price : వరుస పెరుగుదలకు బ్రేక్! ఈ రోజు భారీగా తగ్గిన బంగారం ధరలు!
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు సృష్టిస్తున్న భౌగోళిక రాజకీయ అనిశ్చితి... అదనంగా డాలర్‌తో పోలిస్తే బలహీనపడుతున్న రూపాయి... ఈ అంశాలన్నీ కలిసి గత మూడు రోజులుగా పసిడిని పరుగులు పెట్టించాయి. అయితే, పెట్టుబడిదారులకు కొంత ఊరటనిచ్చే వార్త! వరుసగా ఎగబాకిన బంగారం ధరలు నేడు (నవంబర్ 12, బుధవారం) కాస్త తగ్గుముఖం పట్టాయి. ప్రమాదాలు, సంక్షోభ సమయాల్లో సురక్షిత ఆస్తిగా భావించే బంగారంపై పెరిగిన డిమాండ్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. కొనుగోలుదారులకు ఇది ఒక మంచి అవకాశంగా భావించవచ్చు.
తగ్గిన ధరలు ఎంతంటే?
ఈ రోజు బులియన్ మార్కెట్‌లో వివిధ క్యారెట్ల బంగారం ధరలు ఎలా తగ్గాయనే వివరాలు ఇలా ఉన్నాయి . 24 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధరపై రూ.33 తగ్గి రూ.12,551 వద్ద ట్రేడ్ అవుతోంది. పది గ్రాములపై తగ్గుదల రూ.330 మే తగ్గి ధర రూ. 1,25,510 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధరపై రూ.30 తగ్గి రూ. 11,505 వద్ద ట్రేడ్ అవుతోంది. పది గ్రాములపై రూ.300 తగ్గి ధర రూ.1,15,050 ట్రేడ్ అవుతోంది.. ఇక 18 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధరపై రూ. 25 తగ్గి రూ. 9,413 వద్ద ట్రేడ్ అవుతోంది. పది గ్రాములపై తగ్గుదల రూ. 250 తగ్గింది . ధర రూ. 94,130 వద్ద ట్రేడ్ అవుతోంది..

ప్రధాన నగరాల్లో పసిడి రేట్లు
తెలుగు రాష్ట్రాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో నేటి ధరలు దేశంలోని అనేక ప్రాంతాలలో ఉన్న ధరలకు సమానంగా ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 1,25,510 వద్ద ఉంది. అదే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,15,050 వద్ద ఉంది. ముంబై, బెంగళూరు, విశాఖపట్నం 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు రూ. 1, 25, 510, 24 క్యారెట్ల బంగారం రూ. 1, 15, 050 గా ఉంది. ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రూ. 1,25,560 కాగా 22 క్యారెట్ల బంగారం రూ.1,15, 200 గా ఉంది . అహ్మదాబాద్ లో24 క్యారెట్ల పసిడి రూ. 1,15,560 గా ఉంది. అదే 22 క్యారెట్ల బంగారం రూ.1,15,100 వరకు ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ 1, 26, 560 కాగా, 22 క్యారెట్ల పసిడి రూ.1,16,000 ట్రేడ్ అవుతోంది.
నగరాలను బట్టి ధరల్లో స్వల్ప తేడాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చెన్నైలో ఈ రోజు అత్యధిక ధర నమోదైంది. ఈ స్వల్ప తగ్గుదల వివాహాలు మరియు ఇతర శుభకార్యాల సీజన్‌లో కొనుగోలు చేయాలనుకునే వారికి అనుకూలంగా మారింది. అయితే, అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్‌లు మారే అవకాశం ఉంది కాబట్టి, కొనుగోలుదారులు స్థానిక మార్కెట్ ధరలను ఒకసారి సరిచూసుకోవడం మంచిది.












Click it and Unblock the Notifications