2027లో బంగారం ధరలకు రెక్కలు? నిజంగానే అంత పెరుగుతాయా?

ప్రపంచవ్యాప్తంగా, భారత మార్కెట్లలో బంగారం ధరలు ఇప్పటికే రికార్డు స్థాయిలకు చేరుకుని ఇన్వెస్టర్లకు, వినియోగదారులకు హాట్ టాపిక్‌గా మారాయి. మార్కెట్ విశ్లేషణలు ఓ వైపు ఉంటే.. బల్గేరియన్ ఆధ్యాత్మిక వేత్త బాబా వంగా 2027లో బంగారం ధరల పెరుగుదలపై చేసినట్లు ప్రాచంరంలో ఉన్న ఓ విచిత్రమైన భవిష్యవాణి ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. 2027లో ప్రపంచ నగదు సంక్షోభం లేదా ఆర్థిక మాంద్యం కారణంగా బ్యాంకింగ్ వ్యవస్థలపై నమ్మకం తగ్గి, ప్రజల భద్రమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతారని కథనాలు పేర్కొంటున్నాయి.

భారీగా పుంజుకొంటోన్న బంగారం రేట్లు: ఇకపై ఇదే ట్రెండ్..?
భారీగా పుంజుకొంటోన్న బంగారం రేట్లు: ఇకపై ఇదే ట్రెండ్..?

2027పై బాబా వంగా పేరుతో అంచనాలు వైరల్
సోషల్ మీడియా ప్రచారం ప్రకారం.. రాబోయే ఆర్థిక సంక్షోభం కారణంగా బంగారం ధరలు 25 శాతం నుంచి 40 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఇండియాలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.2.10 లక్షల నుంచి రూ.2.62 లక్షలు-రూ.2.82 లక్షల వరకు ఎగబాకవచ్చని కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే బాబా వంగా స్వయంగా తన భవిష్యవాణులను ఎక్కడా లిఖితపూర్వకంగా నమోదు చేయలేదు. కావున ఈ ప్రచారంలో ఉన్న గణాంకాలన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమేనని, ఇవి అధికారికమైన ఆర్థిక అంచనాలు కావని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Gold Prices 2027 Will Gold Rates Soar to Rs 2 8 Lakh Baba Vanga Prophecy and Market Reality Details

దిగ్గజ ఆర్థిక సంస్థల అసలు అంచనాలు
సోషల్ మీడియా వదంతులను పక్కనపెడితే.. అంతర్జాతీయ స్థాయి ఆర్థిక సంస్థలు కూడా రాబోయే సంవత్సరాల్లో పసిడి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషణల్లో వెల్లడించాయి. 2026 చివరి త్రైమాసికంలో ఔన్సు బంగారం ధర 6 వేల డాలర్లకు(10 గ్రాములకు సుమారు రూ.1,84,883) చేరుకోవచ్చని జేపీ మోర్గాన్ గ్లోబల్ రీసెర్చ్ అంచనా వేసింది. అలాగే 2027 చివరి నాటికి ఇది ఔన్సుకు 6 వేల 300 డాలర్లకు (10 గ్రాములకు రూ.2,13,125) వరకు పెరగవచ్చని పేర్కొంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ ముప్పు, సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు దీనికి ప్రధాన కారణాలుగా తెలిపింది.

మరోవైపు 2027 తొలి అర్థబాగంలో ఔన్సు బంగారం ధర 5 వేల డాలర్లకు(10 గ్రాములకు సుమారు రూ.1,69,049) పెరిగే అవకాశం ఉందని మరో సంస్థ యూబీఎస్(UBS) విశ్లేషించింది. ఇదిలా ఉండగా.. 2026 చివరి నాటికి ఔన్లు బంగారం 4,600 డాలర్లకు(10 గ్రాములకు రూ.1,55,525) వరకు పెరగవచ్చని డాయిష్ బ్యాంక్(Deutsche Bank) విశ్లేషించింది.

ఇండియాతో ఫైనల్ అంటేనే భయం? మ్యాచ్‌కు ముందే పాక్ కెప్టెన్‌ షాకింగ్ కామెంట్స్!
ఇండియాతో ఫైనల్ అంటేనే భయం? మ్యాచ్‌కు ముందే పాక్ కెప్టెన్‌ షాకింగ్ కామెంట్స్!

ఎవరీ బాబా వంగా?
1911లో జన్మించిన వాంగెలియా పాండేవా దిమిత్రోవా(బాబా వంగా) బల్గేరియాకు చెందిన ప్రసిద్ధ అంధ ఆధ్యాత్మిక వేత్త. 12 ఏళ్ల వయసులో తీవ్రమైన సుడిగాలిలో చిక్కుకుని ఆమె తన చూపును కోల్పోయారు. సెప్టెంబర్ 11 దాడులు, చెర్నోబిల్ దురంతం, ప్రిన్సెస్ డయానా మరణం, 2004 సునామీ వంటి సంఘటనలను ఆమె ముందుగానే ఊహించారని ఆమె మద్దతుదారులు నమ్ముతారు. ఆమె చెప్పిన భవిష్యవాణుల్లో 85 శాతం వరకు నిజమయ్యాయని ప్రచారం ఉన్నప్పటికీ.. దీనికి ఎటువంటి అధికారిక ఆధారాలు లేవు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+